Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
వేల గొంతుకలు ఒక్కటై...
సమాచారం మా జన్మహక్కు... చైతన్యనాదం. సహోద్యమ సింహనాదం. రాష్ట్రమంతటా ప్రతిధ్వనించిన సమాచార నినాదం. ఏడేళ్ల సహ చట్టానికి అపూర్వ అభినందన... జన చైతనోద్యమానికి అద్వితీయ ప్రేరణ.

చర్చాగోష్ఠులు, సదస్సులు, సమావేశాలు, ప్రదర్శనలు, చైతన్య యాత్రలు... ఆదిలాబాద్‌ నుంచి ఆముదాలవలస వరకూ, అనంతపురం నుంచి ఆత్మకూరు వరకూ ఎన్నో కార్యక్రమాలు. అన్నీ సమాచార హక్కు పైనే.

సామాన్యుడి చుట్టమైన సహ చట్టం అమల్లోకి వచ్చి కిందటి శుక్రవారినికి ఏడేళ్లు పూర్తయ్యాయి. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా ‘ఈనాడు ముందడుగు’.. వివిధ వర్గాలు, సంస్థల తోడ్పాటుతో కార్యక్రమాలను నిర్వహించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఉద్యమకారులు, అధికారుల భాగస్వామ్యంతో అవన్నీ విజయవంతమయ్యాయి. ఉద్యమకారులు సొంతగా చట్టంపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చట్టాన్ని సక్రమంగా అమలు చేయట్లేదంటూ నిరసన ప్రదర్శనలూ నిర్వహించారు.

ట్టణంలో డీఎస్‌పీ కార్యాలయం నుంచి బాపూజీ కళామందిర్‌ వరకూ ర్యాలీ. అనంతరం సహచర వేదిక సభ్యుల సమావేశమై జిల్లాలో చట్టం అమలుపై సమీక్ష. మండలాల వారీగా రక్షణ వేదికలను ఏర్పాటు. దీంతో పాటు నెహ్రూ యువ కేంద్ర భాగస్వామ్యంతో సదస్సు. 500 మందికి సహపై అవగాహన.
వరంగల్‌: స్థానిక కళాశాలల విద్యార్థులకు సహ చట్టంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. చట్టం అమల్లోని లోపాలను వివరిస్తూ డీఆర్వోకు ఉద్యమకారులు వినతిపత్రాలిచ్చారు.
ఆదిలాబాద్‌: పట్టణంలోని విద్యాసంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సదస్సు నిర్వహణ. 52 మండలాల్లో సహపై చర్చాగోష్ఠులు. చట్టాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేసిన ఉద్యమకారులు.
నిజామాబాద్‌: పట్టణంలో ఉద్యమకారులతో సమీక్షా సమావేశం. జక్రాన్‌పల్లి మండలంలో సైకిల్‌ర్యాలీ. రేడియోలో అవగాహన కార్యక్రమం
కడప: సహోద్యమ సమీక్షా సమావేశాన్ని సహచర వేదిక సభ్యులు నిర్వహించారు. చట్టాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించారు.
హైదరాబాద్‌, రంగారెడ్డి: అప్పీళ్ల విచారణ ధోరణిని నిరసిస్తూ సమాచార కమిషన్‌ కార్యాలయం ముందు ఉద్యమకారులు, విద్యార్థుల మౌనప్రదర్శన. కమిషన్‌ కార్యదర్శికి వినతిపత్రం సమర్పణ. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సెక్షన్‌ 4(1)(బి) సమాచారాన్ని కోరుతూ సహ దరఖాస్తుల దాఖలు.
తూర్పుగోదావరి: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు. సహ చట్టంపై విద్యార్థులకు క్విజ్‌ పోటీలు. చట్టాన్ని వినియోగించుకోవడంపై రాజమండ్రి మహిళా కళాశాల విద్యార్థినులకు శిక్షణ ఇచ్చిన సహచర వేదిక సభ్యులు.
అనంతపురం: సహ చట్టాన్ని వినియోగించుకోవాలంటూ పుట్టపర్తి శ్రీసాయి బాలాజీ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ర్యాలీ. జీవీటీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సదస్సు.
ఉరకలెత్తే ఉడుకురక్తమే ఉద్యమబావుటా!
విశాఖపట్నం: ఉద్యమకారులతో ఎన్జీవోస్‌ హోమ్‌లో సదస్సు. ముఖ్యఅతిథిగా డీఆర్వో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, సహ చట్ట రక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. దాడులకు గురవుతున్న ఉద్యమకారులకు అండగా ఉంటామని, వారికి ఉచిత న్యాయసేవలను అందిస్తామని ప్రకటించారు. విశాఖ నగరంలోని రామాటాకీస్‌, పౌర గ్రంథాలయం, విశలాక్షీనగర్‌, మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ, ఆంధ్రా విశ్వవిద్యాలయాలతో పాటు అనకాపల్లి, చోడవరంలలో స్థానిక ఉద్యమకారులు సదస్సులు నిర్వహించారు.

కృష్ణా: బంటుమిల్లిలో 500 మందితో ర్యాలీ చేశారు. ఉద్యమకారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

కరీంనగర్‌: జిల్లాలోని 57 మండలాల ఉద్యమకారులందరూ కలిసి వివిధ అంశాలపై 400 దరఖాస్తులు చేశారు. పట్టణంలోని అన్ని కళాశాలలను, పాఠశాలల నుంచి వచ్చిన అధ్యాపకులు, ఉపాధ్యాయులకు చట్టంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఈవో వచ్చారు.

మహబూబ్‌నగర్‌: సహచర వేదిక సభ్యల సమావేశం. అనంతరం బహిరంగ ప్రదర్శన నిర్వహించారు. చట్టాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలంటూ డీఆర్వోకి వినతిపత్రం సమర్పించారు.

నల్గొండ: ఉద్యమకారులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. సహ ప్రచార ఐక్య వేదిక, ఎంవీ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

చట్టం తెలిసిన వ్యక్తి... ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి
పశ్చిమగోదావరి: నిడదవోలు మహిళా, భీమవరం కేజీఆర్‌ఎల్‌ డీగ్రీ కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేశారు.

నెల్లూరు: సూళ్లూరిపేట ప్రతిభా డిగ్రీ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించారు. కావలిలో ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు.

మెదక్‌: కలెక్టరేట్‌లో ఉద్యమకారులు సదస్సు నిర్వహించారు. సంగారెడ్డి శ్రీతేజ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించారు. సహచర వేదిక, ఎంకేడీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డైట్‌ కళాశాలలో సదస్సు జరిగింది.

ఖమ్మం: ఎమ్మార్వో కార్యాలయంలో చట్టంపై అవగాహన కార్యక్రమం.

చిత్తూరు: ఎస్వీ విశ్వవిద్యాలయంలో సదస్సు జరిగింది. వైస్‌ఛాన్సలర్‌ ముఖ్యఅతిథిగా వచ్చారు. చట్టంపై అవగాహన కల్పిస్తూ రెడ్‌ ఎఫ్‌.ఎం. రేడియోలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమైంది.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

తెలుగులో నా ఆఖరి సినిమా వంగవీటి

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన ప్రకటన చేశారు. తెలుగులో తన ఆఖరి సినిమా......

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net