Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
దౌర్జన్యాలిక చెల్లవు!
నిజామాబాద్‌లో ... తూర్పుగోదావరిలో... కడపలో... ఎక్కడ ఏ జిల్లాలో చూసినా సహోద్యమకారులపై దాడులే. తమకు అడ్డం వస్తున్నారన్న కడుపు మంటతో అంగబలాన్ని ప్రయోగిస్తున్న అక్రమార్కులెందరో. అలాంటి వారికి బుద్ధి చెప్పడమెలా?

అది ఎలాగో చేసి చూపించారు కడప జిల్లా పోలీసు అధికారులు.

భౌతిక దాడులతో సహోద్యమాన్ని నీరుగార్చాలనుకునే వారి వెన్నులో చలి పుట్టించే నిర్ణయం తీసుకున్నారు కడప పోలీసులు. ఒక దరఖాస్తుదారుపై దాడి చేసిన గాయపర్చిన వ్యక్తిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వాటితో పాటు అతనిపై రౌడీ షీట్‌ను తెరవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

కడప జిల్లా చెన్నూరు మండలం చిన్నమాచుపల్లికి చెందిన డి.దొరబాబు... సమాచార హక్కు చట్ట రక్షణ వేదిక సభ్యుడు. ప్రజాప్రయోజన అంశాలపై దరఖాస్తులు చేస్తుంటారు. ఆ కోవలోనే అంగన్‌వాడీలకు సంబంధించిన వివరాలను అడుగుతూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు దరఖాస్తు చేశారు. కొంత సమాచారమూ వచ్చింది. ఈ దరఖాస్తు చేసిన విషయం స్థానిక అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు తెలిసింది. వారి తరఫున పాలెం చిన్నయ్య అనే వ్యక్తి కొద్ది రోజుల కిందట సమాచారం నీకెందుకంటంటూ దరఖాస్తుదారుతో గొడవకు దిగాడు. మరికొందరితో కలిసి దొరబాబు, అతని సోదరుడిపై కర్రలతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత వారు ఈ విషయాన్ని ‘ఈనాడు ముందడుగు’ దృష్టికి తెచ్చారు.

‘ముందడుగు’ సహాయంతో స్థానిక పోలీసులకు, రాష్ట్ర సమాచార కమిషన్‌కు దొరబాబు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషన్‌, కడప జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు లేఖ రాసింది. బాధితుని ఫిర్యాదును వెంటనే విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. వీలైనంత తొందరగా పూర్తిస్థాయి నివేదికను తమకు పంపాలని చెప్పింది.

ఆ తర్వాత ఎస్పీ ఆదేశాలతో స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. పదమూడు మంది నిందితులను అరెస్టు చేశారు. సెక్షన్‌ 147, 148, 324, 307 (హత్యాయత్నం), 506ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే, చిన్నయ్యపై రౌడీషీట్‌ తెరవడానికి ఎస్‌ఐ ప్రతిపాదనలు సమర్పించారు. ఈమేరకు కడప పట్టణ సీఐ... దొరబాబుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.

- ఎస్‌.ఎ.నాజర్‌భాషా, కడప
వైద్యానికి రూ.లక్ష
సమాచారం అడిగినందుకు మమ్ముల్ని తీవ్రంగా కొట్టారు. వైద్యానికి రూ.లక్షకు పైగా ఖర్చయింది. నా ఫిర్యాదుపై సమాచార కమిషన్‌, ఎస్పీ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. వారి నా కృతజ్ఞతలు. దాడి చేసిన వ్యక్తిపై రౌడీషీట్‌ కూడా తెరుస్తామన్నారు. భవిష్యత్తులో మరే దరఖాస్తుదారుపై కూడా దాడి జరగకూడదు.
- దొరబాబు, బాధితుడు
ఉపేక్షించం
దొరబాబు చేసిన ఫిర్యాదు మాకు అందగానే కలెక్టర్‌, ఎస్పీలకు లేఖ రాశాం. ఆ తర్వాత వారు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు మాకు సమాచారమూ ఇచ్చారు. సహ దరఖాస్తుదారులెవరూ భయపడక్కర్లేదు. దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించబోం. ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకూ తగిన సూచనలిచ్చాం. దాడికి గురైన, బెదిరింపులు ఎదుర్కొంటున్న దరఖాస్తుదారులెవరైనా మాకు ఈమెయిల్‌, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. అండగా నిలుస్తాం.
- సుధాకర్‌, రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యదర్శి

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

ఆటో నడిపిన సినీనటుడు అఖిల్‌

సినీనటుడు అఖిల్‌ మంగళవారం ఖమ్మం నగరంలో ఆటో నడిపి సందడి చేశాడు. స్థానిక నరసింహస్వామి దేవాలయ సమీపంలో కిడ్నీ వ్యాధితో.....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net