Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
ఎందుకంత అసహనం?
హ చట్టంపై ప్రధానమంత్రి పదేపదే అసహనం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి తగిన అవకాశాల కోసం కొందరు కాచుకూర్చున్న సమయంలో ప్రధాని ఇలా మట్లాడటం దురదృష్టకరం. ‘అప్రయోజన దరఖాస్తులను తిరస్కరించడం’పై ప్రధాని కోరుకున్నట్లు చట్టానికి సవరణలు జరిగితే... ఆ నెపంతో చాలా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. గతంలో డీవోపీటీ ఇలాగే సవరణలను ప్రతిపాదించి భంగపడింది. తన ప్రతిపాదనలకు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో వెనక్కి తగ్గింది. జాతీయ సలహా మండలి కూడా సవరణలను వ్యతిరేకించింది. అయినా... ప్రధాని ప్రతిసారీ దీనిపైనే మాట్లాడుతున్నారు.

చట్టబద్ధం కాని దరఖాస్తులను తిరగ్గొట్టడానికి తగిన నిబంధనలు సెక్షన్‌ 8లో ఉన్నాయి. ప్రజాప్రయోజనం లేని వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి సెక్షన్‌ 8(1)(జె)లో నిర్దేశించిన ‘లక్ష్మణరేఖ’ సరిపోదని ప్రధాని భావిస్తున్నారు. కానీ, ఏ కేసులో ఎవరి వ్యక్తిగత సమాచారానికి సహ చట్టం వల్ల ఇబ్బంది కలిగిందో చెప్పట్లేదు. వ్యక్తిగత స్వేచ్ఛపై జస్టిస్‌ ఎ.పి.షా ఇచ్చిన నివేదికను మన్మోహన్‌ ఉటంకిస్తున్నారు. అయితే, మా దగ్గరున్న సమాచారం మేరకు... వ్యక్తిగత స్వేచ్ఛపై ఎలాంటి చట్టం చేసినా, అది సహ చట్టానికి అనుగుణంగానే ఉండాలని ఆ నివేదిక సిఫార్సు చేసింది.

ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) ప్రాజెక్టులను సహ చట్టం నుంచి మినహాయించడం ఆమోదనీయం కాదు. అవి అత్యున్నత పారదర్శక ప్రమాణాలను అనుసరించాల్సిందే. బాధ్యతలు, జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం పీపీపీలను ప్రోత్సహిస్తోందన్న భావన సామాన్యుల్లో ఉంది.

సమాచార కమిషన్లు, కమిషనర్ల పనితీరుపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయనడంలో సందేహం లేదు. కమిషనర్ల నియామక విధానం సరిగా లేదు. ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు (రాష్ట్రాల్లో అయితే హైకోర్టు) ప్రధాన న్యాయమూర్తి ఉండాలని ఉద్యమకారులు చెప్పారు. కానీ కేంద్రం పట్టించుకోలేదు. సమాజంలోని అన్ని రంగాల వారికీ కమిషన్లలో ప్రాతినిధ్యం కల్పించాలని చట్టం చెబుతోంది. వాస్తవంలో విశ్రాంత అధికారులే కమిషనర్లు అవుతున్నారు.

కమిషనర్ల నియామక విధానాన్ని చట్టం పూర్తిగా నిర్దేశించలేదు. ప్రభుత్వం కూడా దీనిపై నిబంధనలను రూపొందించలేదు. ఈ నేపథ్యంలో నియామకాలకు సంబంధించి పారదర్శకమైన విధానాన్ని సుప్రీంకోర్టు నిర్దేశించి ఉంటే బాగుండేది. కానీ, పై సమస్యకు అత్యున్నత న్యాయస్థానం సూచించిన పరిష్కారం... మాజీ న్యాయమూర్తులను కమిషనర్లుగా నియమించడం. దీని వల్ల ఇక్కట్లు మరింతగా పెరుగుతాయి. అప్పీళ్ల విచారణలో జాప్యం రెట్టింపు అవుతుంది. పౌరులకు అనుకూలంగానే కమిషన్లు ఏర్పాటయ్యాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వాస్తవ రూపం దాల్చితే ప్రభుత్వ సంస్థలన్నీ విచారణలకు వచ్చేటప్పుడు న్యాయవాదులను తోడుతీసుకుని వస్తాయి. దీని వల్ల దరఖాస్తుదారుకు పూర్తి సమాచారాన్ని వీలైనంత త్వరగా వెల్లడించాలన్న చట్ట స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది.

- అరుణారాయ్‌, నిఖిల్‌డే

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net