Sun, February 14, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
కమిషన్‌ కళ్లు తెరిచేనా!
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! రాష్ట్ర సమాచార కమిషనే సహ చట్ట స్ఫూర్తికి వ్యతిరేకంగా పని చేస్తుంటే అధికారులు భిన్నంగా వ్యవహరిస్తారా! చట్టాన్ని కట్టకట్టి అటకెక్కించేస్తారు. ప్రస్తుతం జరుగుతోంది అదే.
లానా ప్రభుత్వ యంత్రాంగం సెక్షన్‌ 4(1)(బి)ని అమలు చేయట్లేదు... చర్యలు తీసుకోండని కమిషన్‌ను కోరితే, మాకేం సంబంధం అంటోంది. ఇలాంటి ఫిర్యాదులను తీసుకోమని నిష్కర్షగా చెబుతోంది.

అధికారి సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించారు... జరిమానా వేయండని విచారణకు వచ్చిన అప్పీలుదారు ఎవరైనా చెబితే, కమిషన్‌కు సలహాలివ్వొద్దని గద్దిస్తోంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఎన్నెన్నో.

సహ చట్టం అమల్లోకి వచ్చి ఏడేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో దానికి రాష్ట్రంలో పెద్దదిక్కు అయిన కమిషన్‌ పనితీరును సమీక్షిస్తే అవాక్కవాల్సిందే.

ప్రస్తుత రాష్ట్ర సమాచార కమిషనర్లలో ఒకరిద్దరు మాత్రమే సహ చట్టాన్ని కాస్త పక్కాగా అమలు చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు జరిమానాలు వేస్తున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం రాష్ట్ర సమాచార కమిషన్‌ వ్యవహారశైలితో చట్టానికి నష్టమే కలుగుతోంది.

పుణ్యకాలం గడచిపోతోంది..
ప్రస్తుతం కమిషన్‌లో విచారిస్తోంది రెండేళ్ల నాటి కేసులను. తీర్పు ప్రతి అందిన 15 నుంచి 60 రోజుల్లోగా అప్పీలుదారుకు సమాచారం ఇవ్వాలని చెబుతూ కొందరు కమిషనర్లు విచారణలను ముగిస్తున్నారు. దరఖాస్తుదారుకు 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలని సహ చట్టం చెబుతోంది. ఆ గడువు దాటిపోయి రెండేళ్లయినా, మళ్లీ అధికారులకు సమయం ఇస్తు న్నారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా?

తీర్పు ప్రతి వెంటనే అందుతోందా అంటే అదీ లేదు. విచారణ పూర్తయిన పది, పదిహేను రోజులకు కానీ అది రావట్లేదు. ఇందులో మరో కీలక విషయమూ ఉంది. కమిషన్‌ ఆదేశాలు ఇచ్చినా సరే, అధికారులు సమాచారం ఇవ్వట్లేదు. దీనిపైన మళ్లీ దరఖాస్తుదారులు కమిషన్‌కు ఫిర్యాదు చేయాల్సి వస్తోంది.

అంత అలుసా!
హోద్యమకారులతో ప్రతి నెలా కమిషన్‌ భేటీ అవుతోంది. వారి సూచనలను ఆలకిస్తోంది. అంత వరకూ బాగానే ఉన్నా, విచారణలకు హాజరవుతున్న సాధారణ దరఖాస్తుదారులకు మాత్రం కనీస గౌరవం ఇవ్వట్లేదు. కొందరు కమిషనర్లయితే నేరుగానే నిందిస్తున్నారు. విచారణలో వాదన వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. మాకన్నీ తెలుసు, మీరేం చెప్పక్కర్లేదని ముఖం మీదే చెబుతున్నారు.

మరోవైపు... కమిషన్‌ ఆవరణలోనే ఒక దరఖాస్తుదారుపై ప్రభుత్వ వైద్యురాలి సంబంధీకులు దాడి చేశారు. ‘నీకు సమాచారం కావాలా’ అంటూ పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటన దేనికి సంకేతం? కమిషన్‌లోనే దాడికి తెగబడ్డారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితేంటి? ఇలాంటి అధికారులను దారిలో పెట్టడానికి కమిషన్‌ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటి? సమాధానం రావడం కష్టం!

దీనికి సమాధానమేంటి?
జూన్‌, 2013 నాటికి కమిషన్‌లో అప్పీళ్ల పెండింగ్‌ సమయాన్ని మూడు నెలలకు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాన సమాచార కమిషనర్‌ జన్నత్‌ హుస్సేన్‌ చెబుతున్నారు. అలా జరగాలంటే... కమిషనర్లందరూ వేగంగా విచారణలను నిర్వహించాలి కదా. కానీ, వాస్తవంలో అది జరగట్లేదని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. రోజుకు ఎవరు, ఎన్ని కేసులను విచారిస్తున్నారో తెలిపే కాజ్‌లిస్టును సక్రమంగా అందుబాటులో ఉంచట్లేదని చెబుతున్నారు. కాజ్‌లిస్టును వెబ్‌ సైట్‌లో పెట్టాలన్న తమ సూచనను పట్టించుకో వడం లేదనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిషన్‌ వెబ్‌సైట్‌ నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది. కమిషనర్ల తీర్పులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయట్లేదు. ఇందులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల 4(1)(బి) సమాచారంలో తప్పులు ఎక్కువగా ఉంటున్నా పట్టించుకోవట్లేదు. మూడు, నాలుగేళ్ల కిందటి సమాచారాన్ని అందుబాటులో ఉంచిన శాఖలు/ కార్యాలయాలపై చర్యలేమీ తీసుకోవట్లేదు. అన్నిటి కన్నా ముఖ్యంగా వెబ్‌సైట్‌ మొత్తం ఆంగ్లంలో ఉంది. ఇందులో వివరాలను చదివి అర్థం చేసుకోనే శక్తి ఎంతమందికి ఉంటుంది? స్థానిక భాషలోనే సమాచారం ఇవ్వాలని చట్టం చెబుతోంది కదా. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర కమిషన్ల సైట్లు అక్కడి స్థానిక భాషల్లోనే ఉన్నాయి.

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

ఫైనల్‌లో వారియర్స్‌

రెండోసారి సీసీఎల్‌ ట్రోఫీ గెలవాలన్న తెలుగు వారియర్స్‌ నెరవేరడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. శనివారం హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్‌లో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net