Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
మమత...ఘనత
అయిదో తరగతి అమ్మాయి అటవీ శాఖాధికారులను ప్రశ్నించింది. రాష్ట్రంలో పులులను రక్షించడానికి మీరేం చేస్తున్నారని అడిగింది. అదీ సహ దరఖాస్తు చేసి మరీ. అసలు ఆ చిన్నారికి చట్టం గురించి ఎలా తెలిసింది?దరఖాస్తు చేసే ధైర్యం ఎలా వచ్చింది?
రగతి గదిలో మాస్టారు చెప్పే మాట, నేర్పించే నడక, నిర్దేశించే నడతలే... విద్యార్థి భవితకు చుక్కానీ అవుతాయి. ఆ చిన్నారి ఆలోచనలకు ఆలంబనవుతాయి. మంచి చెబుతూ, స్ఫూర్తి రగిలిస్తూ పాఠాలు చెప్పే గురువులున్న చోట పిల్లలు కచ్చితంగా ప్రయోజకులుఅవుతారు. దీనికి తార్కాణంగా నిలిచే కథనమిది.

అంకం నరేష్‌... నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం వాడిలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. స్వతహాగా సహోద్యమకారుడు. శ్రీసొసైటీ సభ్యుడు. సంస్థ తరఫున గ్రామాల్లో సహ చట్టంపై తరచుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా సహ దరఖాస్తులు చేస్తూ అవినీతిని వెలుగులోకి తెస్తున్నారు. వీటితో పాటు ఆయన తన విద్యార్థులకు కూడా సహపై శిక్షణ ఇస్తున్నారు. అయిదో తరగతి పాఠ్యాంశాల్లో సహ చట్టం కూడా ఉంది. దీన్ని సులభశైలిలో బోధిస్తున్నారు నరేష్‌. దేశవ్యాప్తంగా సహ చట్టాన్ని వినియోగిస్తున్న చిన్నారుల గురించి చెబుతూ ఇక్కడి విద్యార్థుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు. అప్పుడప్పుడు పిల్లల చేత సహపై నాటకాలూ వేయిస్తున్నారు.

ఇలా నరేష్‌ ద్వారా సహ చట్టం గురించి తెలుసుకున్న అయిదో తరగతి విద్యార్థిని బొల్లి మమత ఈ మధ్యనే సొంతగా దరఖాస్తు చేసింది. ఒకరోజు తరగతిలో ఉపాధ్యాయుడు జాతీయ జంతువు గురించి చెబుతున్నారు. అప్పుడే ఆ పాపకు, అసలు రాష్ట్రంలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసుకోవాలనిపించింది. సహ చట్టం గుర్తుకువచ్చింది. వెంటనే నరేష్‌తో మాట్లాడి అటవీ శాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ కార్యాలయ చిరునామా తీసుకుంది. దరఖాస్తు రాసి పంపింది.

బదులిచ్చారిలా..
ఈ ఏడాది లెక్కల ప్రకారం నాగార్జున సాగర్‌, శ్రీశైలం పులుల అభయారణ్యాల్లో 95 పులులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. కవ్వాల్‌ అభయారణ్యంలో పులుల అభివృద్ధి కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పులుల సంరక్షణ, అడవుల పరిరక్షణకు రక్షణ కమిటీలను నియమిస్తున్నట్లు తెలిపారు.

- ఆర్తి శ్రీకాంత్‌, నిజామాబాద్‌
పుస్తకంలోని పాఠం ఆధారంగా నాటిక రూపొందించా. దానితో సులభంగా, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించా. మమత దరఖాస్తు చేస్తానన్నప్పుడు సంతోషమేసింది.
- అంకం నరేష్‌, ఉపాధ్యాయుడు
చిన్నారి పేరు... ఈబిదాస్‌ కవిత. వాడి పాఠశాల విద్యార్థిని. సమాచార హక్కు చట్టంలోని ముఖ్యమైన నిబంధనల గురించి సెక్షన్లతో సహా గుక్క తిప్పుకోకుండా చెబుతుంది. ఎవరికి, ఎలా దరఖాస్తు చేయాలి, సమాచారం రాకపోతే ఏం చేయాలన్న విషయాలను కూడా వివరిస్తుంది.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

ఉగ్రవాదులకు శ్రీకాంత్‌ ‘టెర్రర్‌’

హీరో శ్రీకాంత్‌ ఇంటెలిజెన్స్‌ పోలీస్‌ అధికారిగా ఉగ్రవాదంపై చేసే పోరాటమే ‘టెర్రర్‌’. ఓ పోలీస్‌ అధికారి నగరాన్ని ముట్టడించిన ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని దర్శకుడు ఎంతో...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net