Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
రుణం తీర్చుకుంటున్నారా!
కేరళ సమాచార కమిషనర్‌ కె.నటరాజన్‌పై ఆ రాష్ట్ర గవర్నర్‌కు అక్కడి ఆర్టీఐ సమాఖ్య ఫిర్యాదు చేసింది. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని కోరింది.

నిబంధనలను ఉల్లంఘించి తన బంధువుకు భూ కేటాయింపులు జరిపారంటూ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌.అచ్యుతానందన్‌పై గతంలో ఆరోపణలు వచ్చాయి. వాటిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కేసును విచారిస్తున్న డీఎస్పీ వి.జి.కుంజన్‌పై విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అయిన సమాచార కమిషనర్‌ నటరాజన్‌ ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. కమిషనర్‌ తనకు చేసిన ఫోన్లను రికార్డు చేసిన కుంజన్‌, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తూ ఏసీబీ డైరెక్టర్‌ ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో సమాఖ్య సభ్యులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ కమిషనర్‌పై సహ చట్టం సెక్షన్‌ 17(2) ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అచ్యుతానందన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నటరాజన్‌ సమాచార కమిషనర్‌గా నియమితులవ్వడం గమనార్హం. మరోవైపు... ఈ వ్యవహారంపై రాష్ట్ర హోంమంత్రి రాధా కృష్ణన్‌ మాట్లాడుతూ ‘కమిషనర్‌ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామ’ని చెప్పారు.

మిషనర్‌ను తొలగించాలి. సమాచార కమిషనర్ల ఎంపికపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో పేర్కొన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఉదంతాన్ని పరిశీలించాలి.
- డి.బి.బిను, ప్రధాన కార్యదర్శి, కేరళ ఆర్టీఐ సమాఖ్య

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net