Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
సమాధానం ఇవ్వగలరా!
సెక్షన్‌ 4(1)(బి) సమాచారాన్ని రాష్ట్ర శాసనమండలి ప్రదర్శించట్లేదు. తగిన చర్యలు తీసుకోండి..
సెక్షన్‌ 18(1) కింద రాష్ట్ర సమాచార కమిషన్‌కు సహోద్యమకారులు సీజే కరీరా చేసిన ఫిర్యాదు సారంశమిది.
విచిత్రంగా దీన్ని కమిషన్‌ తిరస్కరించింది. ‘మీరు సెక్షన్‌ 6(1) కింద పీఐవోకు దరఖాస్తు చేయలేదు. అలా చేయకుండా నేరుగా ఫిర్యాదు చేయకూడద’ని చెప్పింది.

... సరే, సహ చట్టం ఏం చెబుతోందో చూద్దాం!
* ప్రజా సమాచార అధికారులు, రుసుముల వివరాలు (చట్టసభకు ప్రత్యేకమైన సహ నిబంధనలు ఉన్నాయి) 4(1)(బి)లో ఉంటాయి. దాన్ని ప్రదర్శిస్తేనే కదా... ఎవరికి ఎలా దరఖాస్తు చేయాలో తెలిసేది?

* ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా 4(1)(బి)లోనే ఉంటుంది. దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచితే కావాల్సిన వివరాలను తీసుకుంటారు. ఒకవేళ దాని పరిధిలోకి రాని సమాచారం కోసమైతే విడిగా దరఖాస్తు చేసుకుంటారు. కమిషన్‌ చెప్పిన ప్రకారమైతే... 4(1)(బి) కోసం కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందే. అప్పుడు చట్టంలో చెప్పిన ‘ఎవరూ అడగకుండానే వీలైనంత ఎక్కువ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలన్న’ నిబంధన(సెక్షన్‌ 4(2))కు అర్థమేంటి?

* ‘చట్టంలో ఉన్న నిబంధనలకు లోబడి ఏ వ్యక్తి నుంచి అయినా ఫిర్యాదును స్వీకరించి విచారణ జరపడం కేంద్ర/రాష్ట్ర సమాచార కమిషన్‌ విధి’ అని సెక్షన్‌ 18(1) చెబుతోంది. మరి 4(1)(బి) ఈ చట్టంలోని ‘నిబంధన’ కాదా?

* చట్టం అమల్లోకి వచ్చి ఏడేళ్లు అవుతోంది. ఇప్పటికీ 4(1)(బి)ని ప్రదర్శించట్లేదంటే (వాస్తవానికి 120 రోజుల్లో ఆ పని చేయాలి) ఆ సమాచారాన్ని ప్రజలకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లే కదా. సెక్షన్‌ 18 (1)(బి) ప్రకారం దీనిపై ఎందుకు ఫిర్యాదు తీసుకోకూడదు?

* ‘ఈ చట్టం కింద సమాచారం తీసుకోవడానికి, రికార్డులను అందుబాటులో ఉంచమని అడగటానికి సంబంధించిన ఏ ఇతర విషయంపైనైనా’ కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చని సెక్షన్‌ 18(1)(ఎఫ్‌) స్పష్టం చేస్తోంది. 4(1)(బి) సమాచారం తీసుకోవడానికి వీల్లేని పరిస్థితిలోనే కదా కరీరా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది! అలాంటప్పుడు దాన్ని ఎలా తిరస్కరిస్తారు?

* సెక్షన్‌ 18(2): ఏ కేసునైనా విచారించడానికి తగిన కారణాలున్నాయని కేంద్ర/ రాష్ట్ర సమాచార కమిషన్‌ భావిస్తే విచారణకు ఆదేశించవచ్చు. శాసనమండలి 4(1)(బి) సమాచారాన్ని ప్రదర్శించకపోవడం మన కమిషన్‌కు ‘తగిన కారణం’గా కనిపించట్లేదా? సహ చట్టం ముఖ్యోద్దేశమంతా సెక్షన్‌ 4లోనే ఉంది. అలాంటి దాన్ని విస్మరించడం భావ్యమేనా?

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

మణిరత్నం వీరాభిమానిని!

హను రాఘవపూడి... తీసింది ‘అందాల రాక్షసి’ ఒక్కటే. దాని చుట్టూ బోలెడు కామెంట్లు.. కాంప్లిమెంట్లు. ‘మణిరత్నం ప్రభావం కుర్రాడిపై చాలా ఎక్కువ ఉంది’ అనుకొన్నారు చాలామంది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net