Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'పట్టణాభిషేకం''వాస్తవాల ప్రతిబింబంగా బడ్జెట్‌''నీటిపై నిప్పుల వాన''సీఎం మొండి అయితే.. నేను జగమొండి''తీరప్రాంత దేశాల మధ్య సహకారం పెరగాలి''ఉత్తర కొరియా రాకెట్‌ ప్రయోగం''చిరుతకు చిక్కి .. ప్రాణాలతో బయటపడి''మౌఖికంలో మార్కులు ఖాయం''ఎయిమ్స్‌కు 220 ఎకరాలు కేటాయింపు''‘అంకుర’ భయాలొద్దు'
బయటపడతామనే భయం
‘‘సమాచార కమిషనర్ల ఎంపికలో విశ్రాంత న్యాయమూర్తులకు అగ్ర తాంబూలం ఇవ్వాలన్న భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు సమర్థనీయం కాదు. సహ చట్టంపై ప్రధాని వ్యాఖ్యలు అర్థరహితం’’
మాచారం ఇవ్వడంలో జాప్యం చేసిన అధికారికి కచ్చితంగా జరిమానా విధించాల్సిందేనని చెబుతున్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత సందీప్‌ పాండే. దేశవ్యాప్తంగా సహ చట్టం అమలు, పాలకపక్ష పెద్దల ఆలోచనల తీరుపై ‘ఈనాడు ముందడుగు’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

* సహ చట్టం కింద ‘వ్యక్తిగత’ వివరాలు అడుగుతున్నారంటున్న ప్రధాని మాటలు వాస్తవ దూరం. ఆయన వ్యాఖ్యలను నేను అంగీకరించను.

* ప్రజా (ప్రభుత్వ) భాగస్వామ్యం ఉన్న ఏ అంశానికి సంబంధించిన సమాచారాన్నయినా బహిరంగపరచాల్సిందే. పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టులన్నీ సహ పరిధిలోకి వస్తాయి.

* కమిషన్‌లలో మాజీ న్యాయమూర్తులకు స్థానం కల్పించాలన్న సుప్రీం సూచన సమర్థనీయం కాదు. ఆ తీర్పు వల్ల చట్టానికి జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ.

* రాజధాని నగరాల్లోనే కమిషన్లు ఉండకుండా ఎక్కడిక్కడ ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేస్తే అప్పీళ్లు తొందరగా పరిష్కారమవుతాయి. వీడియో కాన్ఫరెన్సుల ద్వారా విచారణలు చేస్తే సమయమూ కలిసొస్తుంది.

* దరఖాస్తుదారుకు నిర్దేశిత గడువులోగా పూర్తి సమాచారాన్ని అందించినప్పుడే అతనికి సంపూర్ణ న్యాయం జరిగినట్లు. సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసే అధికారులకు జరిమానా విధించినప్పుడే ‘తప్పులు’ పునరావృతం కావు.

* సహ చట్టాన్ని ప్రచారం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. చట్టం మెరుగ్గా అమలైతే పాలకుల తప్పులే బయటపడతాయన్న భయంతో ఇలా చేస్తున్నాయి.

* సెక్షన్‌ 4(1)(బి) అమల్లో ప్రభుత్వ యంత్రాంగాలు శ్రద్ధ చూపట్లేదు. ప్రభుత్వమూ ఈ నిబంధన అమల్లో చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదు. ప్రజలు అడగక ముందే సమాచారం వెల్లడిస్తేనే ప్రభుత్వ నిబద్ధత తెలుస్తుంది.

* ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్క శాతం లోపు యువతరమే సహ చట్టాన్ని వినియోగించుకుంటోంది. అవినీతి రహిత సమాజం కోసం ఉద్యమాలు చేస్తున్న యువత.. సహను సద్వినియోగం చేసుకోవాలి. వారి లక్ష్య సాధనకు ఇదే దగ్గరి దారి.

* అవినీతిమయమైన ప్రస్తుత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా యువత రాజకీయాల్లోకి వస్తేనే అవినీతి తగ్గుతుంది.

- అల్లూరి శ్యామ్‌కుమార్‌, న్యూస్‌టుడే, ఖమ్మం
‘‘ రాబర్ట్‌ వాద్రా, నితిన్‌ గడ్కరీ లాంటి పెద్దలు ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకుని వ్యాపారాలు చేస్తున్నప్పుడు, వాటి వివరాలను సహ చట్టం కింద తెలుసుకోకుండా ఎలా ఉండగలం? ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక కుంభకోణాలు సహతోనే బయటపడ్డాయి.’’

మాధవన్‌ పళ్లురాలగొట్టాను..!

సినిమా కోసం ఉత్తుత్తినే కాదు.. నిజంగానే అంతపని చేసిందట రితిక. గత వారం విడుదలై సంచలన విజయం సాధించిన ‘సాలా ఖడూస్‌’ చిత్రం కథానాయిక. అప్పుడెప్పుడో పరుగుల రాణీ...

ఉప్పల్‌లో పరుగుల పండగ

మ్యాచ్‌ అంటే ఇదీ.. ఆడేది సినిమావాళ్లే అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌కి ఏమాత్రం తీసిపోదు. టీ ట్వంటీలో ఉండే అసలైన మజా... మరోసారి తెలిసొచ్చింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net