Mon, February 15, 2016

Type in English and Give Space to Convert to Telugu

'భారత్‌లో తయారీకి బ్రహ్మరథం''ఐపీఎస్‌లను పెంచండి''పాకిస్థాన్‌కు అధునాతన ఎఫ్‌-16 యుద్ధవిమానాలు''ఖేడ్‌లో 81.72 శాతం పోలింగ్‌''దిండి మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు''మెదక్‌ నిమ్జ్‌లో చైనా పెట్టుబడులు..''చెలకల్లో.. అవినీతి మొలకలు!''మార్చి 10 నుంచి శాసనసభ సమావేశాలు''మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు''కళతో సామాజిక సందేశం'
ఏదో ఒకటి చెప్పెయ్‌!
మాచారం అడిగితే చాలు... బుకాయింపులు... హూంకరింపులు. చట్టం చెబుతోంది అన్నా, సమాచార కమిషన్లు తీర్పులిచ్చాయని చెప్పినా సరే, అదే మర్యాద. పేరు గొప్ప ప్రభుత్వ యంత్రాంగాల తీరుతో చట్టం స్ఫూర్తి అణగారిపోతోంది.

వ్యవసాయ రుణాల సమాచారం సహ చట్టం సెక్షన్‌ 4(1)(బి) పరిధిలోకి వస్తుంది. బ్యాంకులే స్వచ్ఛందంగా ఆ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

- కేంద్ర సమాచార కమిషన్‌ తీర్పు 
(సీఐసీ/ఎస్‌జీ/ఎ/2012/00 0956/18940)
ఈ ఆదేశాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తోసిరాజంటోంది. దరఖాస్తు చేసినా, సమాచారం ఇవ్వట్లేదు. గత మూడేళ్లలో వ్యవసాయ రుణాలు తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా గిడజాం వాసుల వివరాలను అడుగుతూ కాకినాడలోని ఎస్‌బీఐ ప్రాంతీయ కార్యాలయానికి టి.నాగరాజు దరఖాస్తు చేశారు. పైన చెప్పిన సీఐసీ తీర్పును కూడా పేర్కొన్నారు. అయినా... ‘సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సి ఉందం’టూ పీఐవో బదులిచ్చారు. దీనిపై హైదరాబాద్‌లోని బ్యాంకు స్థానిక ప్రధాన కార్యాలయానికి అప్పీలు వెళ్లింది. మంజూరు చేసిన రుణాల సంఖ్య, రుణాల మొత్తం వివరాలను వెల్లడించాలంటూ అప్పీలేట్‌ అథారిటీ అయిన జనరల్‌ మేనేజర్‌ (నెట్‌వర్క్‌-2) ఆదేశించారు. కానీ... రుణగ్రహీతల పేర్లు, రుణాలను పొందడానికి వారు సమర్పించిన ధ్రువపత్రాల నకళ్లనూ ఇవ్వాలని మాత్రం చెప్పలేదు.
ప్రత్యేకమా?: తాము ప్రత్యేక ప్రభుత్వ యంత్రాంగమని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారి (ఈవో) చెబుతున్నారు. కోర్టు ఫీ స్టాంపుల రూపంలో దరఖాస్తు రుసుం తీసుకోమంటున్నారు. పోస్టల్‌ ఆర్డరు, డీడీల రూపేణా చెల్లిస్తేనే ఒప్పుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కోర్టు ఫీ స్టాంపులను స్వీకరించాలని నిర్దేశించే జీవో నం.740 తమకు వర్తించదని బుకాయిస్తున్నారు. రేణిగుంటకు చెందిన బి.సుమన్‌ చేసిన దరఖాస్తుకు సంబంధించి ఆయన ఇలా రాసిచ్చారు.

ఎవరిచ్చారు ఆ అధికారం?: ‘ఈ లేఖ అందిన 24 గంటల్లో ఈ కార్యాలయంలో హాజరు కావాలి’

ఆరేపల్లికి చెందిన ఎస్‌.ప్రశాంత్‌ చేసిన దరఖాస్తుకు వరంగల్‌ జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ డెప్యూటీ డైరెక్టర్‌ స్పందన ఇది. సమాచారం ఇవ్వకుండా ఇలా దరఖాస్తుదారును కార్యాలయానికి పిలిచే అధికారం అధికారులకు లేదు. ఆ విషయం తెలిసీ పిలవడంలో మర్మమేంటో అంతు చిక్కక దరఖాస్తుదారు ఆందోళనకు గురవుతున్నారు!

వలచి...గెలిచి..

ప్రేమికుల రోజూ.. అదే సూర్యుడు. అవే ఇరుసంధ్యలు. అదే గాలి. అవే దిక్కులు. ఎప్పట్లాగే ఇరవై నాలుగ్గంటలు!! మరేమిటీ ప్రత్యేకం? ఏముంది? ప్రేమే!!...

సీసీఎల్‌-6 విజేత తెలుగు వారియర్స్‌

సెలెబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ తెలుగు వారియర్స్‌ ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శనతో కర్ణాటక బుల్డోజర్స్‌ను మట్టికరిపించి రెండోసారి విజేతగా నిలిచింది. ఉప్పల్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అఖిల్‌...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net