Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
మీరు ప్రత్యేకమే!
మీ కార్యాలయానికి సంబంధించిన సెక్షన్‌ 4(1)(బి) సమాచారాన్ని నిర్వహించాల్సిందే.
- ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) రాష్ట్ర సమాచార కమిషన్‌ ఆదేశాలు.
కొత్తగా చెబుతున్నారేంటి, చట్టం అమల్లోకి వచ్చిన 120 రోజుల్లోగా 4(1)(బి)ని రూపొందించాలి కదా. ఏడేళ్ల తర్వాత ప్రత్యేకంగా ఈ ఉత్తర్వులేంటని అనుకుంటున్నారా! ముఖ్యమంత్రి కార్యాలయం మొండివైఖరే దీనికి కారణం.

తాను ప్రత్యేక ప్రభుత్వ యంత్రాంగం కాదని, సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)లోనే ఒక భాగమని సీఎంవో ఇప్పటి వరకూ వాదిస్తోంది. తమకు విడిగా 4(1)(బి) ఉండదని, జీఏడీ సమాచారమే తమకూ వర్తిస్తుందని చెప్పుకుంటుంది. వాస్తవానికి సీఎంవో, జీఏడీల విధులు, బాధ్యతలు వేర్వేరు. ముఖ్యమంత్రి సహాయ నిధి తదితరాల సమాచారం సీఎంవోలోనే ఉంటుంది. కానీ... సహ చట్ట పరిధిలోంచి తప్పించుకునేందుకు సీఎంవో అధికారులు వింత వాదనను తెరపైకి తెచ్చారు.

ఇదీ కేసు... నవీకరించిన 4(1)(బి) సమాచారం కోరుతూ రెండేళ్ల కిందట విశాఖపట్నానికి చెందిన కె.వెంకటరమణ సీఎంవోకు దరఖాస్తు చేశారు. దాన్ని అధికారులు జీఏడీకి బదిలీ చేశారు. ఆ తర్వాత కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. సమాచారం మాత్రం రాలేదు. దాంతో దరఖాస్తుదారు కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై కిందటి నెలలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ జన్నత్‌ హస్సేన్‌ విచారణ నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయం జీఏడీలో భాగం కాదని చెబుతూ విడిగా 4(1)(బి) ఉండాల్సిందేనని తీర్పిచ్చారు.

అప్పీలు సంఖ్య: 10782/సీఐసీ/2010

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

బుల్డోజర్స్‌పై విజయం మాదే: అఖిల్‌

సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగు వారియర్స్‌ జట్టుకు సారథ్యం వహిస్తున్న యువ కథానాయకుడు అఖిల్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net