కౌన్సెలింగ్‌, ఇంగ్లిష్‌ విభాగాలకు మీ సందేహాలు పంపాల్సిన చిరునామా:

చదువు డెస్క్‌,
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు, రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
edc@eenadu.net

పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన గ్రూప్‌-2 పరీక్షకు అభ్యర్థులు లక్షల సంఖ్యలో సన్నద్ధం అవుతున్నారు. వీరి కోసం పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌పై ‘విజేత కాంపిటీషన్స్‌’ ఒక పుస్తకాన్ని వెలువరించింది. ఇందులో సిలబస్‌లో పేర్కొన్న పదకొండు అంశాలపై సమాచారాన్ని అందించారు. ప్రతి అధ్యాయానికీ మౌలికాంశాలనూ, బిట్లనూ అందించారు.

ముఖ్యమైన సమాచారాన్ని పట్టికల్లో ఇచ్చారు. అభ్యర్థులు ఈ సమాచారాన్ని అధ్యయనం చేసి, బిట్లను సాధన చేయడం ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు. మొదట్లో ఇచ్చిన ఇటీవల జరిగిన పరీక్షల పేపర్లు, చివర్లో పొందుపరిచిన అంతర్జాతీయ అంశాలు పరీక్ష కోణంలో ఉపయోగకరంగా ఉన్నాయి.

గ్రూప్‌-2, పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌
పేజీలు: 1280, ధర: రూ. 589


తెలంగాణ ఉద్యమంపై సమాచారం
టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో కీలకంగా మారిన తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం విభాగంపై ‘నిపుణ పబ్లికేషన్స్‌’ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌ సామాజిక చరిత్ర మొదలు తదనంతర సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు, సంస్కృతి లక్షణాలు, భారత యూనియన్‌లో హైదరాబాద్‌ రాజ్యం విలీనం, హైదరాబాద్‌ రాష్ట్ర అవతరణ, పెద్దమనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు, ఒప్పందం ఉల్లంఘనలు, తెలంగాణ తొలి ఉద్యమ ఫలితాలు, మలి ఉద్యమంలో జరిగిన అనేక సంఘటనలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో వివిధ ప్రజాసంఘాలు, నాయకులు, రాజకీయ పార్టీల పాత్ర తదితర అంశాలపై మూడు సెక్షన్ల వారీగా సమాచారం అందించారు.

బిట్లు, పట్టికల రూపంలో ఇచ్చిన వివరాలు, నమూనా ప్రశ్నలు బాగున్నాయి. చివర్లో ఇచ్చిన రాష్ట్ర మంత్రివర్గం వివరాలు, ఉద్యమ సమయంలో విడుదలైన వివిధ పుస్తకాలు-వాటి రచయితల పేర్లు, పత్రికలు, కవులు, కలాల వంటి అంశాలు కూడా ప్రయోజనకరంగా ఉన్నాయి.

తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం
పేజీలు: 592, ధర: రూ. 349


  • Railway Recuritment Board
  • Kovida