మీ సూచనలు, అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా మాకు పంపాల్సిన
చిరునామా:

ఐటీ అండ్‌ సైన్స్‌ డెస్క్‌,
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు, రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం, హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512.
ith@eenadu.net

డెస్క్‌టాప్‌ నుంచే...
ఏదైనా ఫైల్‌ పంపాలంటే?
మెయిల్‌లోని ఎటాచ్‌మెంట్‌పైనే క్లిక్‌ చేస్తున్నారా?
ఇంకా పాత పద్ధతేనా? క్లౌడ్‌లో ఎన్నో కొత్త వేదికలు వచ్చేశాయి!
Jumpshareసర్వీసుని ప్రయత్నించారా?
వాడితే షేర్‌ చేయడం చాలా సులభం!

ఉచిత ‘క్లౌడ్‌’లు...
‘మెగా’ సర్వీసు..
https://mega.nz
పేరు తగ్గట్టుగానే ఉచిత మెగా స్టోరేజ్‌తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. 50 జీబీ ఉచిత స్టోరేజ్‌ని వాడుకోవచ్చు. డేటాకి రక్షణగా ఎన్‌క్రిప్షన్‌ వలయం ఉంది. నెట్టింట్లోనే కాకుండా డెస్క్‌టాప్‌పై అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌లా ఒదిగిపోతుంది. పీసీ నుంచే సులువుగా డేటాని క్లౌడ్‌ డ్రైవ్‌లోకి సింక్‌ చేసుకోవచ్చు. ఫోన్‌లోనూ ఆప్‌ రూపంలో నిక్షిప్తం చేసుకుని డేటాని సింక్‌ చేసుకోవచ్చు.ఆండ్రాయిడ్‌, యాపిల్‌, విండోస్‌, బ్లాక్‌బెర్రీ ఫ్లాట్‌ఫాంలకు తగిన ఆప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. అంతేకాదు... బ్రౌజర్‌కీ ఆప్‌లా జత చేసి వాడుకోవచ్చు.

‘పీ’క్లౌడ్‌...
www.pcloud.com
20 జీబీ స్టోరేజ్‌ని ఉచితంగా పొందొచ్చు. ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్‌ ఫైల్స్‌, ఇతర డాక్యుమెంట్‌ ఫైల్స్‌ని సులువైన ఇంటర్ఫేస్‌తో క్లౌడ్‌లోకి అప్‌లోడ్‌ చేసి భద్రం చేసుకోవచ్చు. డెస్క్‌టాప్‌ క్లైంట్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడే క్రమంలో ముఖ్యమైన ఫైల్స్‌ని pCloud Crypto ఫోల్డర్‌లో దాచుకోవచ్చు. దీంతో ఆయా ఫైల్స్‌ని ఇతరులు చూసేందుకు వీలుండదు. పీసీ, ఫోన్‌, ట్యాబ్‌... అన్ని డివైజ్‌ల్లోకి డేటాని సులువుగా సింక్‌ చేయవచ్చు. విండోస్‌, మ్యాక్‌, లినక్స్‌ ఓఎస్‌లను సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఫ్లాట్‌ఫాంలపై ఆప్‌ రూపంలో ఒదిగిపోతుంది.

క్లౌడ్‌ సర్వీసులు అంటే... బ్రౌజర్‌ ఓపెన్‌ చేయడం... యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ టైప్‌ చేయడం... తర్వాత సిస్టంలోని ఫైల్స్‌ని క్లౌడ్‌ డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేయడం... వాటిల్లో షేర్‌ చేయాలనుకునే వాటిని సెలెక్ట్‌ చేసి పంపడం... అబ్బో ఇదంతా పెద్ద ప్రక్రియే అనుకుంటాం. కానీ, అన్ని క్లౌడ్‌ సర్వీసులు ఒకేలా ఉండవు. అందుకు ‘జంప్‌షేర్‌’ సర్వీసే ఉదాహరణ. అత్యంత సులువైన పద్ధతిలో ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేసి ఎవరికైనా పంపొచ్చు. 2 జీబీ క్లౌడ్‌ స్పేస్‌ని ఉచితంగా పొందొచ్చు. సుమారు 200 ఫైల్‌ ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌ అన్నీ ఎన్‌క్రిప్షన్‌ మోడ్‌లోనే స్టోర్‌ అవుతాయి. వాడుకుందాం అనుకుంటే బ్రౌజర్‌లోకి వెళ్లక్కర్లేదు. పదే పదే లాగిన్‌ అవ్వక్కర్లేదు. అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌లా ఇన్‌స్టాల్‌ చేసుకుని సింపుల్‌గా డెస్క్‌టాప్‌ నుంచే అన్నీ ముగించేయవచ్చు. డెస్క్‌టాప్‌ను స్క్రీన్‌షాట్‌లు తీసి కూడా పంపొచ్చు. అదెలాగో కాస్త వివరంగా చూద్దాం!

విండోస్‌ వాడితే...
వెబ్‌ సర్వీసులానే కాకుండా అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌లా సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవచ్చు. అందుకు https://jumpshare.com/apps సైట్‌లోకి వెళ్లి విండోస్‌ సెట్‌అప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఇన్‌స్టాల్‌ చేయగానే సిస్టం ట్రేలో ప్రత్యేక ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. డిసేబుల్‌ మోడల్‌లో ఉన్న ఐకాన్‌పై క్లిక్‌ చేసి జంప్‌షేర్‌లో సభ్యులవ్వాలి. సైన్‌ఇన్‌ అవ్వగానే ఐకాన్‌ గుర్తు ఎనేబుల్‌ మోడ్‌లోకి మారిపోతుంది. ఇక ఏదైనా ఫైల్‌ని సర్వీసులోకి అప్‌లోడ్‌ చేయాలంటే డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో సిస్టం ట్రేలోని ఐకాన్‌ గుర్తుపైకి లాగి వదిలేస్తే చాలు. ఫైల్‌ జంప్‌షేర్‌లోకి అప్‌లోడ్‌ అవుతుంది. అప్‌లోడ్‌ పూర్తి అయిన తర్వాత నోటిఫికేషన్‌ వస్తుంది. ఇక ఫైల్‌ని షేర్‌ చేయడానికి లింక్‌ని కాపీ చేసుకో వచ్చు. ఆ లింక్‌ని మెసేజ్‌ లేదా మెయిల్‌ చేయవచ్చు. లేదంటే... Share పై క్లిక్‌ చేసి ఆప్‌ నుంచే సరాసరి పంపేయవచ్చు. మెయిల్‌ ఐడీలను వరుసగా టైప్‌ చేసి ఎందరికైనా పంపొచ్చు. ఫైల్‌ డౌన్‌లోడ్‌ లింక్‌తో పాటు ఏదైనా మెసేజ్‌ని కూడా పంపొచ్చు. మెయిల్‌ వారికి చేయగానే మీ రిజిస్టర్‌ మెయిల్‌కి నోటిఫికేషన్‌ వస్తుంది. అంతేకాదు... పంపిన వ్యక్తి మెయిల్‌ చూశారా? లేదా అనే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే మెయిల్‌ అందుకున్న వ్యక్తి ఓపెన్‌ చేసి చూడగానే మీకు నోటిఫికేషన్‌ వస్తుంది. మీరు షేర్‌ చేసిన ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేస్తే... ఆ విషయాన్ని జంప్‌షేర్‌ మీకు చేరవేస్తుంది.

‘క్లిప్‌బోర్డ్‌’లో ఉన్నవి కూడా...
సిస్టం డ్రైవ్‌లోని ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయడం మామూలే? కానీ, మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా Ctrl+C, Ctrl+X షార్ట్‌కట్‌తో క్లిప్‌బోర్డ్‌లో పెట్టిన వాటిని కూడా జంప్‌షేర్‌లోకి తెచ్చుకుని షేర్‌ చేయవచ్చు. సిస్టం ట్రేలోని ఐకాన్‌పై రైట్‌క్లిక్‌ చేస్తే Upload from Clipboard ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయాలి. కాపీ చేసింది ఇమేజ్‌ లేదా టెక్స్ట్‌ అయినా క్షణాల్లో జంప్‌షేర్‌ జాబితాలోకి చేరిపోతుంది. క్లిప్‌బోర్డ్‌లో ఉన్నవే కాదు. డెస్క్‌టాప్‌పై ఉన్న వాటిని స్క్రీన్‌షాట్‌ తీసుకుని షేర్‌ చేయవచ్చు. అందుకు సిస్టం ట్రేలోని ఐకాన్‌పై రైట్‌క్లిక్‌ చేసి Take Screenshot ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేయండి. తర్వాత పాయింటర్‌తో డెస్క్‌టాప్‌పై మీకు కావాల్సినంత సెలెక్ట్‌ చేస్తే చాలు. వెంటనే స్క్రీన్‌షాట్‌ జంప్‌షేర్‌లోకి చేరిపోతుంది. జంప్‌షేర్‌ సెట్టింగ్స్‌ని కావాల్సినట్టుగా మార్పులు చేసుకునేందుకు Preferences మెనూలోకి వెళ్లండి. అక్కడే ఆప్షన్స్‌కి అనువైన షార్ట్‌కట్‌లు పెట్టుకోవచ్చు. ఎకౌంట్‌ సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. సిస్టం ట్రేలోని ఐకాన్‌పై క్లిక్‌ చేసి వచ్చిన పాప్‌అప్‌ విండోలోని లింక్‌పై క్లిక్‌ చేసి బ్రౌజర్‌లో వెబ్‌ వెర్షన్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. వెబ్‌ వెర్షన్‌లో Activity, My Uploads, Favorites, Shared, Analytics విభాగాల్లో డేటాని మేనేజ్‌ చేయవచ్చు.

* మ్యాక్‌ని వాడుతున్నట్లయితే యాపిల్‌ ఆప్‌ స్టోర్‌ నుంచి జంప్‌షేర్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఐట్యూన్స్‌ డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/mG4U2p


అంతా ఆటోమాటిక్‌నే...
దైనా సర్వీసుని వాడుకుని క్లౌడ్‌లో డేటాని షేర్‌ చేయడానికి సభ్యులవ్వాల్సిందే. లాగిన్‌ అయ్యాకే మిగతా ప్రక్రియ. మరి, ఇవేం లేకుండా File.io వేదికపై ఫైల్‌ని అప్‌లోడ్‌ చేసి షేర్‌ చేయవచ్చు తెలుసా? అప్‌లోడ్‌ చేసిన ఫైల్‌ని నిర్ణీత సమయం ఆటోమాటిక్‌గా సర్వీసు నుంచి తొలగిపోయేలా చేయవచ్చు. www.file.io సైట్‌లోకి వెళ్లి హోం పేజీలోని అప్‌లోడ్‌పై క్లిక్‌ చేసి సిస్టం హార్డ్‌డ్రైవ్‌ల్లోని ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయవచ్చు. అప్‌లోడ్‌ ప్రాసెస్‌ ముగిశాక ప్రత్యేక లింక్‌ జనరేట్‌ అవుతుంది. ఆ లింక్‌ని షేర్‌ చేస్తే చాలు. ఇతరులు చిటికెలో ఫైల్‌ని పొందొచ్చు.
  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif