మీ సూచనలు, అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా మాకు పంపాల్సిన
చిరునామా:

ఐటీ అండ్‌ సైన్స్‌ డెస్క్‌,
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు, రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం, హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512.
ith@eenadu.net

చిట్కా చిన్నదే!
డౌన్‌లోడ్స్‌ కోసం...
క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నారా? అయితే, ఇతర బ్రౌజర్లలో మాదిరిగా డౌన్‌లోడ్స్‌ని మేనేజ్‌ చేసేందుకు ప్రత్యేక విభాగం పైన ఎక్కడా కనిపించదు. ఒకవేళ డౌన్‌లోడ్స్‌ని మానిటర్‌ చేద్దాం అనుకుంటే మెయిన్‌ మెనూలోకి వెళ్లి ‘డౌన్‌లోడ్స్‌’ మెనూని సెలెక్ట్‌ చేయాలి. లేదంటే... Ctrl+J షార్ట్‌కట్‌ మీటని నొక్కినా డౌన్‌లోడ్స్‌ డైలాగ్‌ బాక్స్‌ వస్తుంది. ఇవేం ప్రయత్నించకుండా సరాసరి టూల్‌బార్‌లో ప్రత్యేక ఐకాన్‌తో డౌన్‌లోడ్స్‌ని మేనేజ్‌ చేసేందుకు వీలుందని తెలుసా? ఎలాగంటే... క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌ నుంచి Your Download Box ఎక్స్‌టెన్షన్‌ని బ్రౌజర్‌కి జత చేస్తే చాలు. అడ్రస్‌బార్‌ పక్కనే బాణం గుర్తుతో ప్రత్యేక ఐకాన్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే చాలు. మొత్తం డౌన్‌లోడ్స్‌ జాబితా కనిపిస్తుంది. Show all Downloads బటన్‌పై నొక్కి గతంలో డౌన్‌లోడ్‌ చేసిన వాటిని కూడా చూడొచ్చు. ఎక్స్‌టెన్షన్‌ని బ్రౌజర్‌కి జత చేసేందుకు https://goo.gl/tBQ3vD లింక్‌లోకి వెళ్లండి.
  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif