మీ సూచనలు, అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా మాకు పంపాల్సిన
చిరునామా:

ఐటీ అండ్‌ సైన్స్‌ డెస్క్‌,
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు, రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం, హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512.
ith@eenadu.net

మొబైల్‌ మాయ!
అలారం అదో టైపు!
దిండు పక్కనే... స్మార్ట్‌ ఫోన్‌లో అలారం. నిద్రపోయే ముందు ఎలాగైనా లేవాల్సిందేనని అలారం పెట్టేస్తారు. తీరా పొద్దునే మోగుతుంటే పట్టనట్టే పడుకుంటారు. లేదంటే... స్నూజ్‌ చేసి పడేస్తారు. ఇందుకు అవకాశం లేకుండా సరికొత్త పద్ధతిలో అలారంని సెట్‌ చేద్దాం అనుకుంటే? మైక్రోసాఫ్ట్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన Mimicker Alarm ఆప్‌ని ప్రయత్నించొచ్చు. ఇదో భిన్నమైన అలారం ఆప్‌. అలారం ఆఫ్‌ అవ్వాలంటే మీరు నిద్ర లేచి ఓ గేమ్‌ ఆడాల్సిందే. ఏ రేసింగ్‌ గేమో... పజిల్‌ గేమో అయితే లేవగానే ఏం ఆడతాం! అనే సందేహం అక్కర్లేదు. ఇదో సింపుల్‌ గేమ్‌. సెట్‌ చేసిన అలారంని ఆఫ్‌ చేయాలంటే మీరో సెల్ఫీ దిగాలి. ఆటేంటంటే... Express Yourself. ఈ ఆటని సెట్‌ చేస్తే గేమ్‌లో చెప్పినట్టుగా హావభావాల్ని ముఖంలో చూపిస్తూ సెల్ఫీలు దిగాలి. ఉదాహరణకు Make a Surprised Face కమాండ్‌తో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా సెల్ఫీ దిగితేగానీ అలారం ఆఫ్‌ అవ్వదు. మీ ముఖంలో ఆశ్చర్యం కనిపించకపోతే గేమ్‌ పూర్తి కాదు. మళ్లీ సెల్ఫీ దిగాల్సిందే. సరైన భావాన్ని వ్యక్తం చేస్తూ సెల్ఫీ దిగితేగానీ గేమ్‌ని పూర్తి చేయాలేరు. ఇలా తీసుకున్న సెల్ఫీని సోషల్‌ నెట్‌వర్క్‌ వాల్స్‌పై స్నేహితులతో పంచుకోవచ్చు. సెల్ఫీ ఒక్కటే కాదు... Color Capture గేమ్‌లో రంగుల్ని గురించి ఫొటోలు తీయాలి. ఆటలో అడిగిన రంగుని చుట్టూ ఉన్న పరిసరాల్లో గుర్తించి ఫొటో తీయాలన్నమాట. ఇంకా Tongue Twister కూడా ఉంది. అన్ని సాధారణ అలారం ఆప్స్‌లో మాదిరిగానే అలారం షెడ్యూల్స్‌ని మేనేజ్‌ చేయవచ్చు. వారంలో ఏయే రోజుల్లో ఎప్పుడు నిద్రలేవాలనేది ఒకేసారి సెట్‌ చేసుకునే వీలుంది.

డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/jNUkX9

  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif