మీ సూచనలు, అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా మాకు పంపాల్సిన
చిరునామా:

ఐటీ అండ్‌ సైన్స్‌ డెస్క్‌,
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు, రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం, హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512.
ith@eenadu.net

విడ్డూరం!
ఇక ఏదీ పోదు!
ఇంట్లో ఏవేవో వస్తువులు... వాటిల్లో తాళాలు, రిమోట్‌లు, ఛార్జర్‌లు అనుకోకుండా మాయం అవుతుంటాయి. అవి ఎక్కడున్నాయా? అని ఇల్లంతా వెతికేస్తాం. అన్నీ చిందర వందర చేసేస్తాం. అంత కష్టపడకుండా Pixie పరికరాన్ని వాడితే సరి. ఇదో లొకేషన్‌ ట్రాకింగ్‌ టూల్‌. వాడుతున్న స్మార్ట్‌ ఫోన్‌తో జతకట్టి పని చేస్తుంది. దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే... పారేసుకున్నవి ఎక్కడున్నాయో ఫోన్‌ కెమెరాతో షూట్‌ చేస్తూ చూడొచ్చు. గుర్తించిన వాటిని ప్రత్యేక గుర్తుతో తెరపై చూపిస్తుంది. ఉదాహరణకు ఇంట్లోనే ఉండి బయటున్న కారులో ఉన్నాయేమో చూద్దాం అనుకుంటే ఫోన్‌ కెమెరాతో కారుని షూట్‌ చేస్తే చాలు. కారులో ఉన్న వాటిని గుర్తించి చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే... సర్దేసిన సూట్‌కేస్‌లో కావాల్సినవి అన్నీ ఉన్నాయో లేదో చూడాలంటే తిరిగి సూట్‌కేస్‌ని ఓపెన్‌ చేయక్కర్లేదు. ఫోన్‌ కెమెరాతో చూస్తే చాలు. ఏమేం ఉన్నాయో... ఏమేం లేవో చూపిస్తుంది. బుల్లి ట్యాగ్‌లా కనిపించే దీన్ని అన్నింటికీ సులువుగా అమర్చుకుని వాడుకోవచ్చు. పరికరం బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఫోన్‌కి కనెక్ట్‌ అవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు 50 అడుగుల దూరంలో ఉన్నవాటిని గుర్తిస్తుంది. బయట (అవుట్‌డోర్‌) అయితే 200 అడుగుల పరిధిలో ఉన్న వాటిని కూడా ట్రాక్‌ చేసి చూడొచ్చు. ప్రస్తుతం నమూనా దశలో ఉన్న పరికరాన్ని త్వరలోనే మార్కెట్‌లోకి తేనున్నారు.

వీడియో, ఇతర వివరాలకు: www.getpixie.com

  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif