ఆహ్వానం ఏదో సరదాకి... ఫన్‌ ఎస్సెమ్మెస్‌... సాంగ్‌ కౌంటర్‌... హైకూలను కార్డుపై రాసి పంపండి. ‘మనసులో మాట’ శీర్షికకు రాసేవారు, అడ్రస్‌ తప్పకుండా రాయాలి. మీరు కోరితే వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీ రచనలు
పంపాల్సిన చిరునామా:

ఈతరం
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు,
రామోజీ ఫిల్మ్‌ సిటీ,
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
you@eenadu.net

వేలంటైన్స్‌డేనా... నేనా?
మాట ఎవరైనా సాదాసీదా అమ్మాయి అంటే పెద్ద విశేషమేం కాదు. కానీ ప్రేమ కథా చిత్రాల్లో నటిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టే కత్తిలాంటి కత్రినా అంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఈ ప్రేమికులరోజున మీరేం చేయబోతున్నారు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తనలాగే సమాధానం చెప్పింది మరి. ‘అసలు వేలంటైన్స్‌ డే అంటే ఏంటి? నాకు దాని అర్ధమే తెలియదు. జీవితంలో నేనెపుడూ ప్రేమికులరోజు జరుపుకోలేదు. నేను ప్రతిక్షణం నటన, పనినే ప్రేమిస్తా’ అనడంతో అవాక్కవడం ఆ కుర్ర విలేకరి వంతు అయింది. ‘రణ్‌బీర్‌కపూర్‌తో కూడా జరుపుకోలేదా?’ అని నోటిదాకా వచ్చిన ప్రశ్నను మింగేసి నోరు మెదపకుండా ఉండిపోయాడు అతగాడు. సాటి హీరోహీరోయిన్లు ఈ ప్రత్యేకమైన రోజుకు ఎక్కడికెళ్లాలి? ఎలా ఎంజాయ్‌ చేయాలి? అని ఆలోచిస్తుంటే కత్రినా ఇలా వేదాంతం మాట్లాడేసిందండీ! ‘ఫితూర్‌ విజయం తర్వాత బహుశా నాకో సరికొత్త ప్రేమ దొరుకుతోంది కాబోలు’ అంటూ అడక్కముందే ఓ హింట్‌ కూడా ఇచ్చేసింది. ఇంతకీ తను ఆదిత్యరాయ్‌కపూర్‌తో లవ్‌లో దిగేసిందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • Pratibha_SSC
  • sthirasthi_300-50.gif