ఆహ్వానం ఏదో సరదాకి... ఫన్‌ ఎస్సెమ్మెస్‌... సాంగ్‌ కౌంటర్‌... హైకూలను కార్డుపై రాసి పంపండి. ‘మనసులో మాట’ శీర్షికకు రాసేవారు, అడ్రస్‌ తప్పకుండా రాయాలి. మీరు కోరితే వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీ రచనలు
పంపాల్సిన చిరునామా:

ఈతరం
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు,
రామోజీ ఫిల్మ్‌ సిటీ,
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
you@eenadu.net

బహుమతులివిగో...
వలచినవారికి ప్రేమికులరోజున రోజాలివ్వడం.. ఐలవ్యూలు చెప్పడం.. పాత పద్ధతి. కొత్త ట్రెండ్‌ని అందిపుచ్చుకోండి గురూ! ఈ ప్రత్యేకమైన రోజు కోసం ప్రత్యేకంగా మార్కెట్లోకి వచ్చిన గ్యాడ్జెట్స్‌ ఇవి. ప్రయత్నించండి.
FitBit flex:తమ ప్రేయసి/ప్రియుడు ఫిట్‌గా ఉండాలని కోరుకునేవారు బ్రేస్‌లెట్‌లా మణికట్టుకు ధరించే ఈ పరికరాన్ని బహుమతిగా ఇవ్వొచ్చు. నడిచిన దూరం, కరిగిన కేలరీలు, నిద్రపోయన సమయం, చేసిన వ్యాయామం అన్ని వివరాలు లెక్క కడుతుంది.
Fujifilm Instax Mini8:ఇప్పుడు యువత సెల్ఫీ లోకంలో విహరిస్తున్నారు. ఆ ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకొని పక్కాగా రూపొందించిన డిజిటల్‌ కెమేరా. సెకనులో పదహారో వంతు సమయంలోనే ఫొటో క్లిక్‌మనిపించొచ్చు. అప్పటికప్పుడే ఫ్రేమ్‌తో సిద్ధమై మరీ చిత్రాలు బయటికొస్తాయి.
Polaroid ZIP mobile photo printer: సెల్‌ఫోన్‌లో క్లిక్‌మనిపించిన ఫొటోలను నిమిషం లోపలే ప్రింటవుట్లు తీస్తుంది. ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ ఏ ఫోన్‌తో అయినా కనెక్ట్‌ అవుతుంది.
Soundbot shower speaker: సంగీత ప్రియులైన ప్రేమికులకు ఇవ్వదగ్గ కానుక. వాటర్‌ప్రూఫ్‌ అయిన స్పీకర్లను చిత్రంగా బాత్‌రూమ్‌ షవర్లకు బిగించి పాటలు వినొచ్చు.
trackR tracking Device:ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయదగ్గ యాప్‌. దీని సాయంతో తాళం చెవులు, సెల్‌ఫోన్‌, ఆభరణాలు.. ఇలా పోగొట్టుకున్న ఏ విలువైన వస్తువులనైనా ట్రాక్‌ చేయొచ్చు. వాటికి 100 అడుగుల దూరంలో ఉన్నా అలారం మోగుతుంది.
Neyya:చేతి వేలికి తొడుక్కునే రింగులాంటి గ్యాడ్జెట్‌. స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించాలి. దీని సాయంతోనే సెల్‌ఫోన్‌లో ఫొటలు తీయొచ్చు, మ్యూజిక్‌ వినొచ్చు.
  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • Pratibha_SSC
  • sthirasthi_300-50.gif