ఆహ్వానం ఏదో సరదాకి... ఫన్‌ ఎస్సెమ్మెస్‌... సాంగ్‌ కౌంటర్‌... హైకూలను కార్డుపై రాసి పంపండి. ‘మనసులో మాట’ శీర్షికకు రాసేవారు, అడ్రస్‌ తప్పకుండా రాయాలి. మీరు కోరితే వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీ రచనలు
పంపాల్సిన చిరునామా:

ఈతరం
ఈనాడు కార్పొరేట్‌ ఆఫీసు,
రామోజీ ఫిల్మ్‌ సిటీ,
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512
you@eenadu.net

ప్రేమించుకుంటాం... రుణమివ్వండి
ల్లు కొనడానికో, కారు కల తీర్చుకోవడానికో అప్పులు చేసే వాళ్లని చూస్తుంటాం. కానీ ప్రియురాలితో సరదాగా గడపడానికి నాకు రుణం ఇవ్వండి అని అడిగే కుర్రాడ్ని ఎక్కడైనా చూశారా? గుజరాత్‌లోని జునాఘడ్‌ బ్యాంకులో పనిచేసే పాతికేళ్ల దిగ్విజయ్‌ సింగ్‌ అదేరకం. ‘నేను ప్రేమికుల రోజు ఘనంగా జరుపుకోవాలి. అర్జెంటుగా రూ.42,970ల రుణం ఇప్పించండి’ అని దరఖాస్తు చేసుకున్నాడు. అవాక్కవడం పైఅధికారుల వంతైంది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని ‘ఇదేం అప్పు ఇవ్వదగ్గ విలువైన పండగకాదు. మేం ఇవ్వం’ అనడంతో పాపం... ఆ యువ ప్రేమికుడు గుండె బద్ధలైపోయింది. అన్నట్టు దిగ్విజయ్‌ గతంలో వసంత పంచమికి కూడా రుణం తీసుకొని ‘పండగ’ చేసుకున్నాడట.
  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • Pratibha_SSC
  • sthirasthi_300-50.gif