పొదుపు, మదుపు, పన్నులు, బీమా, బ్యాంకులు, రుణాలు, ఆస్తులు-హక్కులు... ఇలా వ్యక్తిగత ఆదాయానికి సంబంధించిన మీ సందేహాలేమైనా సరే కార్డుపై క్లుప్తంగా రాయండి.

సిరి,
ఈనాడు బిల్డింగ్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌,
రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512.
siri@eenadu.net

అర చేతిలో బ్యాంకు.. జాగ్రత్త!
బ్యాంకులకు వెళ్లి.. వరుసలో నిలబడి లావాదేవీలు నిర్వహించే రోజులు ఎప్పుడో పోయాయి. స్మార్ట్‌ ఫోన్ల యుగంలో మీ మొబైలే బ్యాంకు శాఖగా మారిపోయింది. మరి ఈ బ్యాంకును ఉపయోగిస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు పాటిస్తున్నారా?
ఉచిత వైఫై ఉపయోగిస్తున్నారా?
ఇప్పుడు అన్ని చోట్లా ఉచిత వైఫై సౌకర్యం ఒక సాధారణ విషయంగా మారింది. సాధారణ ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకోవడానికి ఇది సరిపోతుంది. కానీ, బ్యాంకింగ్‌ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు ముట్టుకోకపోవడమే ఉత్తమం. రహస్య సాంకేతిక సంఖ్యలు, ఇతర పాస్‌వర్డ్‌లు అక్కడ వినియోగించకూడదు. కొన్నిసార్లు ఇవి మోసగాళ్ల చేతికి చేరిపోయే ప్రమాదముంది.

సౌకర్యం.. రక్షణ
మొబైల్‌ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించాలనుకున్నప్పుడు సౌకర్యాల కన్నా రక్షణకు పెద్దపీట వేయాలి. పదే పదే పాస్‌వర్డ్‌లను తెలియజేయడం ఎందుకు అని.. పాస్‌వర్డ్‌లను ఫోను గుర్తుంచుకునే సౌకర్యాన్ని ఎంచుకుంటారు. యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లను ఫోను గుర్తుంచుకుంటే.. ఏదైనా అనుకోని సందర్భంలో ఫోను పోతే చిక్కులు అనేకం వస్తాయి.

ఫోనుకు తాళం..
ప్రస్తుతం చాలామంది ఫోనులో కార్డుల వివరాలు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. ఇతరులు ఎవరైనా ఈ విషయాలను నమోదు చేసుకుంటే తిప్పలు తప్పవు. ఒకవేళ ఫోన్‌ పోతే మీరు గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరగొచ్చు. అందుకే, ట్రేస్‌ ప్యాట్రన్‌ లేదా పిన్‌ ద్వారా ఫోనుకు తాళం వేయాలి.

పూర్తిగా తెలుకున్నాకే..
లక్షల్లో ఉన్న యాప్‌లలో ఏది సరైంది.. ఏది మీకు ఉపయోగం అనేది గుర్తించడం కష్టమే. ఏదైనా యాప్‌ గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాకే దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కొన్ని యాప్‌లు మీ రహస్య సమాచారాన్ని దొంగిలిస్తాయి. కాబట్టి, జాగ్రత్త తప్పదు.

అధీకృత యాప్‌లు మాత్రమే..
బ్యాంకింగ్‌ లావాదేవీల నిర్వహణకు మీ బ్యాంకు అధీకృత యాప్‌లను మాత్రమే వినియోగించండి. కొన్ని థర్డ్‌ పార్టీ యాప్‌లు కూడా ప్రస్తుతం అధికంగా లభిస్తున్నాయి. అయితే, ఇవి ఎంత సురక్షితం అనేది ధ్రువీకరించుకోవాలి.

- నితిన్‌ ఛుఘ్‌, కంట్రీ హెడ్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif