పొదుపు, మదుపు, పన్నులు, బీమా, బ్యాంకులు, రుణాలు, ఆస్తులు-హక్కులు... ఇలా వ్యక్తిగత ఆదాయానికి సంబంధించిన మీ సందేహాలేమైనా సరే కార్డుపై క్లుప్తంగా రాయండి.

సిరి,
ఈనాడు బిల్డింగ్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌,
రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512.
siri@eenadu.net


ఫండ్‌ పథకం.. ఇస్తుంది పింఛను
న్ను ఆదాకు అవకాశం.. పదవీ విరమణ తర్వాత పింఛను కావాలనుకునే వారికి ఓ వినూత్న పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌. ఈ పథకం పేరు హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ విభాగానికి చెందిన ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్‌). అంటే ఇందులో మదుపు చేసిన మొత్తాన్ని ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీ పరిమితుల మేరకు మినహాయింపు లభిస్తుంది. ఇందులో మొత్తం మూడు రకాల ప్లాన్లు ఉన్నాయి. ఇందులో ఈక్విటీ ప్లాను నిఫ్టీ 500 ఇండెక్స్‌ ఆధారంగా పనిచేస్తుంది. హైబ్రిడ్‌ ఈక్విటీ.. క్రిసిల్‌ బ్యాలెన్స్‌డ్‌ ఇండెక్స్‌, హైబ్రిడ్‌ డెట్‌.. క్రిసిల్‌ ఎంఐపీ బ్లెండెడ్‌ ఇండెక్స్‌ ఆధారంగా పనిచేస్తాయి. ఇందులో ప్రతి ప్లానూ ప్రత్యేక పెట్టుబడి వ్యూహాన్ని పాటిస్తుంది. పెట్టుబడిని కనీసం ఐదేళ్లపాటు కొనసాగించాల్సి ఉంటుంది. మదుపు చేసిన మొత్తాన్ని 60 ఏళ్ల దాకా వేచి చూసి, తర్వాత పింఛనులాగా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.5వేలు. ఎన్‌ఎఫ్‌ఓ చివరి తేదీ ఫిబ్రవరి 19.


చిన్న కంపెనీల్లో..
చిన్న, మధ్య తరహా కంపెనీల్లో మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి తోడ్పడే ఫండ్‌ను బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఎమర్జింగ్‌ లీడర్స్‌ (సిరీస్‌ 7) పేరుతో విడుదల చేసింది. ఇది క్లోజ్‌ ఎండెడ్‌ ఫండ్‌. పెట్టిన పెట్టుబడిని మూడున్నర ఏళ్లపాటు కొనసాగించాలి. ఫిబ్రవరి 19 వరకూ అందుబాటులో ఉండే ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.5వేలు. నష్టభయం ఉంటుంది.

వృద్ధితోపాటు..
ర్థిక వృద్ధిని ఆసరాగా చేసుకొని లాభపడే రంగాలు, కంపెనీల్లో మదుపు చేసే లక్ష్యంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఇండియా రికవరీ ఫండ్‌ విడుదల అయ్యింది. క్లోజ్‌ ఎండెడ్‌ గ్రోత్‌ పథకం ఇది. కనీస పెట్టుబడి రూ.5వేలు. ఎన్‌ఎఫ్‌ఓ చివరి తేదీ ఫిబ్రవరి 22.

పెట్టుబడి సురక్షితంగా
ష్టభయం తక్కువగా ఉండాలి.. కాస్త మంచి రాబడి రావాలని కోరుకునే వారు ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్లను పరిశీలించొచ్చు. తాజాగా పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు వీటిని విడుదల చేశాయి. ఇందులో 36 నెలల వ్యవధితో డీఎస్‌పీ బ్లాక్‌ రాక్‌ ఎఫ్‌ఎంపీ సిరీస్‌ 195 ఒకటి. డెట్‌, మనీ మార్కెట్‌ పథకాల్లో ఇది మదుపు చేస్తుంది. కనీస పెట్టుబడి రూ.5వేలు. పెట్టుబడి పెట్టేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 23.

దీర్ఘకాలిక లక్ష్యంతో సురక్షిత పథకాల్లో మదుపు చేయాలనుకునే వారికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టిపుల్‌యీల్డ్‌ ఫండ్‌ సిరీస్‌ 10 అందుబాటులోకి వచ్చింది. ఇందులో పెట్టుబడిని 1103 రోజులు కొనసాగించాలి. కనీస పెట్టుబడి మొత్తం రూ.5వేలు. ఎన్‌ఎఫ్‌ఓ చివరి తేదీ ఈ నెల 15.

  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif