పొదుపు, మదుపు, పన్నులు, బీమా, బ్యాంకులు, రుణాలు, ఆస్తులు-హక్కులు... ఇలా వ్యక్తిగత ఆదాయానికి సంబంధించిన మీ సందేహాలేమైనా సరే కార్డుపై క్లుప్తంగా రాయండి.

సిరి,
ఈనాడు బిల్డింగ్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌,
రామోజీ ఫిల్మ్‌ సిటీ
అనాజ్‌పూర్‌ గ్రామం,
హయత్‌నగర్‌ మండలం,
రంగారెడ్డి జిల్లా.
తెలంగాణ. 501512.
siri@eenadu.net

పరిమిత ప్రీమియం చెల్లింపుతో..
జీవిత బీమా పాలసీకి ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లించి, గరిష్ఠంగా 15 ఏళ్లపాటు బీమా రక్షణ ఉండాలని కోరుకునే వారికి ఎక్సైడ్‌ లైఫ్‌ స్టార్‌ సేవర్‌ పేరుతో కొత్త పాలసీ అందుబాటులోకి వచ్చింది. ఈ పాలసీ కొనసాగే వ్యవధిని బట్టి కనీసం 3 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 60ఏళ్ల వయసు వారి వరకూ తీసుకునేందుకు వీలుంది. పాలసీ 10, 12, 15 ఏళ్ల వ్యవధికి లభిస్తోంది. వ్యవధితో నిమిత్తం లేకుండా ప్రీమియాన్ని కనీసం ఐదేళ్లపాటు చెల్లిస్తే సరిపోతుంది. వార్షిక కనీస ప్రీమియం రూ.24వేలు. గరిష్ఠ పరిమితి లేదు. చెల్లించిన ప్రీమియాన్ని బట్టి కచ్చితమైన రాబడి హామీ ఉంది. రూ.24,000-రూ.59,999 మధ్య ప్రీమియం చెల్లించిన వారికి వార్షిక గ్యారంటీ అడిషన్‌ 7.00శాతం చెల్లిస్తారు. పాలసీని 10ఏళ్లపాటు కొనసాగిస్తే.. 10శాతం, 12 ఏళ్లయితే 12శాతం, 15 ఏళ్లయితే 15శాతం లాయల్టీ బెనిఫిట్‌ చెల్లిస్తారు. చెల్లించిన ప్రీమియానికి 10 రెట్ల వరకూ బీమా రక్షణ ఉంటుంది. ప్రమాదంలో మరణిస్తే.. బీమా పరిహారం రెట్టింపు లభిస్తుంది. ఎక్సైడ్‌ లైఫ్‌ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌, ఎక్సైడ్‌ లైఫ్‌ టర్మ్‌ రైడర్లను జోడించుకునే అవకాశం ఉంది. చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80సీ మినహాయింపు లభిస్తుంది.
  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif