close

తాజావార్తలు

అలా జరిగితే శబరిమలను మూసేయండి
శుద్ధి చేసిన తర్వాతే ఆలయాన్ని మళ్లీ తెరవాలి

తిరువనంతపురం: శబరిమల ఆచారాలకు వ్యతిరేకంగా ఏదైనా జరిగి ఉంటే ఆలయాన్ని మూసివేసి శుభ్రం చేయాల్సిందిగా అధికారులకు పందళ ప్యాలెస్‌ ట్రస్ట్‌ లేఖ రాసింది. శుక్రవారం ముగ్గురు మహిళా భక్తులు గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉన్న 18 మెట్ల దారికి కేవలం 500 మీటర్ల దూరం వరకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆలయ ఆచారాలకు ఆటంకం కలిగినట్లైతే.. ఆలయాన్ని మూసివేయాల్సిందిగా ట్రస్టు నిర్వాహకులు శబరిమల దేవస్థానం అడ్మినిస్ట్రేషన్‌, ఎగ్జిక్యూటివ్‌ అధికారులకు లేఖ రాశారు.

‘ఒకవేళ ఆచారాలకు భంగం వాటిల్లితే ఆలయాన్ని తప్పకుండా మూసివేయాలి. ప్రధాన అర్చకులు లేదా మేల్‌ తంత్రి ఆలయాన్ని శుభ్రం చేసిన తర్వాతే ఆలయాన్నిమళ్లీ తెరవాలి’ అని పందళ రాజవంశీయులు లేఖలో పేర్కొన్నారు. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ రాజకుటుంబీకులు ఈనెల 12న శాంతియుతంగా నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం పాత్రికేయురాలు కవితా జక్కల్‌, రీహనా ఫాతిమా, మేరీ స్వీటీ ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. కానీ ఆందోళనకారులు ఒత్తిడి కారణంగా వాళ్లు వెనుదిరిగారు.

గర్వంగా ఉంది..
గర్భగుడిలోకి వెళ్లే 18 మెట్ల దారి సమీపం వరకు పాత్రికేయురాలు కవితా పోలీసుల సహాయంతో వెళ్లారు. కానీ అక్కడ నుంచి ముందుకు వెళ్లలేకపోవడంతో వెనుదిరిగారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడారు. ‘మాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినందుకు మేం చాలా గర్వపడుతున్నాం. మేము ఎంతటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చిందో మీరందరూ చూసే ఉంటారు’ అని ఆమె అన్నారు.


క్రైమ్

మరిన్ని

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.