గురువారం, జనవరి 19, 2017

జనరల్

నగదు రహిత లావాదేవిలపై గ్రామస్థులకు అవగాహన
ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఖమ్మం గ్రామీణ మండలంలోని కిట్స్‌ యంత్రవిద్య కళాశాల విద్యార్థులు కిట్స్‌ఏకత్రా-2017 కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రజలకు నగదురహిత లావాదేవిలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్‌ కోట అప్పిరెడ్డి మాట్లాడారు. నగదు రహిత లావాదేవిలపైన సరైన అవగాహన లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన అవసరమన్నారు. కళాశాల ఛైర్మన్‌ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కిట్స్‌ విద్యార్థులు నగదు రహిత లావాదేవిలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రతి ఏడాది ఏకత్రాలో భాగంగా ప్రజలకు ఉపయోపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ దుర్గాప్రసాద్‌, డైరక్టర్‌ లింగయ్య, అధ్యాపకులు దేవేందర్‌, ఆర్‌.ఎన్‌.శ్రీనివాస్‌, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.