Thursday, February 11, 2016


Untitled Document
Comments
0
Recommend
0
Views
27
చవకబారు ఏర్పాట్లు.. నేలబారు పరీక్షలు
అరకొర వసతుల మధ్య ఐటీఐ పరీక్షలు ప్రారంభం
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో బుధవారం ఐటీఐ పరీక్షలు అరకొర వసతుల మధ్య ప్రారంభమయ్యాయి. మొత్తం 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగూడెంలో రెండు, భద్రాచలం 5, పాల్వంచ రెండు, ఖమ్మం మూడు, మణుగూరు, ఇల్లెందు, వాజేడు, అశ్వారావుపేట, గార్లలో ఒక్కో కేంద్రం ఉన్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి రెగ్యులర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది పరీక్ష విధానంలో మార్పులు చేశారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష పత్రాన్ని తయారు చేశారు. పార్ట్‌-ఏ, పార్ట్‌-బి, ప్రశ్నపత్రాలు ఇచ్చి జవాబులు నింపటానికి ఓఎంఆర్‌ షీట్లు ఇచ్చారు. కలెక్టర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌ కార్యాలయంలో, ఆర్‌డీఓ కార్యాలయంలో పనిచేసే రెవెన్యూ సిబ్బందితో సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. వీరితో పాటు వరంగల్‌లోని ఆర్‌జేడీ కార్యాలయం నుంచి ప్రతి పరీక్ష కేంద్రానికి ఓ పరిశీలకుడిని నియమించారు. ప్రత్యేక విజిలెన్స్‌ అధికారిగా జిల్లా ఉపాధి కల్పనా అధికారి విజేతను నియమించారు. వీరంతా పరీక్షలు పకడ్బందీగా జరగటానికి చర్యలు తీసుకున్నారు.

ఖమ్మం నగరంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షలు 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇక్కడ పరీక్ష కేంద్రంలో హాజరుకావాల్సిన ఓ ఐటీఐ విద్యార్థులకు ఫీజులు చెల్లించలేదనే కారణంతో ఆలస్యంగా హాల్‌ టిక్కెట్లు ఇవ్వడంలో వారంతా పరీక్షలకు సకాలంలో హాజరు కాలేకపోయారు. దీంతో ఆలస్యంగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ మొత్తం 310 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. విద్యార్థులకు సరిపోయినన్ని గదులు లేవు. దీంతో వరండాల్లో, మెట్లపై ఏర్పాట్లు చేసి పరీక్షలు రాయించారు. కొన్ని వరండాల్లో కనీసం లైట్లు కూడా లేవు. గాలి, వెలుతురు లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. చాలా గదుల్లో నేలపైనే కూర్చొని పరీక్షలు రాశారు. సకాలంలో ఏర్పాట్లు చేయకపోవడంతో సుమారు గంట ఆలస్యంగా పరీక్షలు మొదలయ్యాయి. గుర్తింపుకార్డు లేదా ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకురావాలని నిబంధన విధించటంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ కేంద్రానికి కలెక్టరేట్‌కు చెందిన డిప్యూటీ తహశీల్దారు కల్పనను ప్రత్యేకాధికారిణిగా నియమించారు. ప్రిన్సిపల్‌ రాధాకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

* నగరంలోని మరో పరీక్ష కేంద్రం వాణి ఐటీఐలో 500 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. సిట్టింగ్‌ స్క్వాడ్‌ అధికారిగా ఆర్‌డీఓ కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దారు ముజాహిద్‌ను నియిమించారు. మరో పరీక్ష కేంద్రం రెహనా ఐటీఐలో కూడా పరీక్షలు జరిగాయి. ఈ కేంద్రాల్లో కూడా అరకొర వసతులే ఉండటంతో తొలిరోజు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సగటున 20 శాతం మంది గైర్హాజరైనట్లు తెలిసింది.

Untitled Document
బెదిరింపులతోనే సత్యం ఆత్మహత్యాయత్నం: ఎన్డీ
త్వరలో మాదిరిపురం ఎత్తిపోతలకు కేసీఆర్‌ శంకుస్థాపన
జిల్లాకు 12 మోడల్‌ పాఠశాలలు మంజూరు
అందరి ఆమోదంతోనే జలాశయం నిర్మాణం: మంత్రి తుమ్మల
నేటి నుంచి వాగ్గేయకారోత్సవాలు
వంద శాతం లక్ష్యాలను పూర్తిచేయాలి: కలెక్టర్‌
వగ్గెల మిత్రసేన ఆరోగ్య పరిస్థితి విషమం
నులిపురుగులతో రక్తహీనత
శ్రీరాముడు అడుగుపెట్టిన నేల ఖమ్మం జిల్లా: మంత్రి తుమ్మల
జిల్లా వ్యవసాయశాఖ జేడీగా మణిమాల
భద్రాద్రిలో నులిపురుగుల మాత్రల పంపిణీ
రామాలయంలో విజిలెన్స్‌ అధికారి పూజలు
జిల్లాలో 15 దోభీఘాట్‌లు మంజూరు
బోధనా రుసుముల బకాయిలపై సీఎం నియంత వైఖరి
రోడ్డు తవ్వకంతో రాకపోకలకు అంతరాయం
అనార్యోగంతో ఆత్మహత్య
కుక్కల దాడిలో ఎనిమిది గొర్రెల మృతి
‘చంద్రబాబుపై కేసు నమోదు చేయండి’
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net