close

శుక్రవారం, అక్టోబర్ 19, 2018

తాజా వార్తలు

సీఎం పర్యటన బందోబస్తుకు వెయ్యిమంది
డీఎస్పీ పోతురాజు న సీఎం పర్యటనలో స్వల్ప మార్పు
కూచిపూడి, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనలో భాగంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూచిపూడిలో నిర్మించిన సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యశాల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వస్తున్నారన్నారు. అయితే పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయని ఆయన వివరించారు. ఉదయం 11 గంటలకు జరగాల్సిన కార్యక్రమం మధ్యాహ్నం 3.20గంటలకు మారిందన్నారు. సీఎం పర్యటన బందోబస్తు నిమిత్తం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వెయ్యి మంది సిబ్బంది వచ్చినట్లు చెప్పారు. అదనపు ఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు ఐదుగురు, సీఐలు 39 మంది, ఎస్‌ఐలు 54 మంది, పీసీలు 700 మంది, ఏఆర్‌ కానిస్టేబుల్స్‌ 120 మంది, ట్రాఫిక్‌ సిబ్బంది 100 మందిని నియమించినట్లు తెలిపారు. సమావేశంలో చల్లపల్లి సీఐ జనార్ధన్‌, ఎస్‌ఐ డి.దుర్గామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూచిపూడిలో సీఎం సభావేదిక వద్ద బందోబస్తును, హెలిప్యాడ్‌ వద్ద బందోబస్తును కృష్ణాజిల్లా అడిషనల్‌ ఎస్పీ సాయికృష్ణ పరిశీలించారు. ఏఆర్‌ ఏఎస్పీ డిల్లీ, ఏఆర్‌ డీఎస్పీ బి.నారాయణ, బాంబ్‌స్వ్కాడ్‌ ఏఎస్‌ఐ రాంబాబు, సిబ్బంది హెలీప్యాడ్‌ వద్ద, సంజీవని వైద్యశాల ఆవరణలో తనిఖీలు చేశారు. మచిలీపట్నం ఆర్డీవో జె.ఉదయ్‌భాస్కర్‌ హెలీప్యాడ్‌ స్థలంతోపాటు ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపీడీఓ ఆనందరావు, తహసీల్దార్‌ బి.రామనాయక్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.