Saturday, February 06, 2016


Untitled Document
Comments
0
Recommend
0
Views
71
వసతి గృహాల్లో దుష్ట గ్రహాలు !
సర్కారీ హాస్టళ్లలో విచ్చలవిడి అవినీతి
ఏసీబీ దాడుల్లో బట్టబయలు
ఈనాడు, విజయవాడ
...ఒక్కో ప్రభుత్వ హాస్టల్లో నెల అవినీతి మొత్తం కనీసం రూ. లక్ష పైనే. కక్కుర్తి వార్డెన్లు పిల్లల సొమ్మునూ వదలడం లేదు. బుల్లి బొజ్జలను ఎండబెట్టి తాము దండుకుంటున్నారు. ప్రభుత్వం పుష్కలంగా నిధులు విడుదల చేస్తుంటే వాటిని సొంత జేబుల్లోకి మళ్లిస్తున్నారు వార్డెన్లు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వారంక్రితం జిల్లాలో పలు హాస్టళ్లలో జరిపిన ఆకస్మిక సోదాల్లో నివ్వెరపరిచే చేదు నిజాలు బయటపడ్డాయి. సొంతంగా చదువుకునే స్తోమత లేని పేద కుటుంబాల పిల్లలను ప్రభుత్వమే సొంత ఖర్చుతో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంచి చదివిస్తోంది. ఏడాదికి కోట్ల రూపాయలను కేటాయిస్తోంటే

ఆ సొమ్మును వార్డెన్లు అప్పనంగా స్వాహా చేసేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తోసిరాజంటూ ఈ వసతి గృహాలను సొంత జాగీర్లుగా మార్చుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 29న నందిగామలోని బీసీ, ఎస్టీ, ఎస్సీ బాలుర వసతి గృహాల్లో ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ బృందం జరిపిన సోదాల్లో భారీ అవకతవకలు బయటపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా- గుంటూరు జిల్లాలోని పలు హాస్టళ్లలో ఏసీబీ చేపట్టిన ర్యాండమ్‌ సర్వేలో ఇదే తరహా లొసుగులు వెలుగుచూసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. 30 మంది పిల్లలుంటే వందమంది లెక్కచూపి రేషన్‌కు నిధులు డ్రా చేస్తున్నారు.

బయోమెట్రిక్‌... పెద్ద ఫార్స్‌
హాస్టల్‌ రిజిస్టర్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు, వాస్తవాలకు ఎక్కడా పొంతనలేదు. నందిగామలో బీసీ హాస్టల్‌ రిజిస్టరులో 75 మంది విద్యార్థుల పేర్లుంటే, అక్కడ ఉన్నది మాత్రం ఐదుగురే. మిగతా 70 మంది ఎక్కడ ఉన్నారో వార్డెన్‌ చెప్పలేకపోయారు. ఇదే పరిస్థితి అనేక హాస్టల్లో తాండవిస్తోంది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.45 ను ప్రభుత్వం మెస్‌ ఛార్జిల కింద చెల్లిస్తోంది. మిగతా 70 మంది రేషన్‌ ఛార్జి రోజుకు రూ.3150... నెలకు... అక్షరాలా రూ.94500 ఏమవుతున్నట్లు. ఇది వార్డెన్లు, సహాయక సాంఘిక సంక్షేమ అధికారులు (ఏఎస్‌డబ్ల్యూ), ఇంకా ఆపైస్థాయి అధికారులు కలిసి దోచుకుంటున్నారనడంలో సందేహం లేదు. ఇప్పటికీ పాతికశాతం హాస్టళ్లలో బయోమెట్రిక్‌ ఏర్పాటుకాలేదు. ఇది ఉన్నచోటున బయట బాలల నుంచి వేలిముద్రతో హాజరు వేయించి పంపించేస్తారు.

హాస్టల్‌ వెళ్లని వార్డెన్లు : హాస్టల్‌ వార్డెన్‌ నిత్యం వసతిగృహాన్ని సందర్శించి పర్యవేక్షణ, బాలల బాగోగుల్ని చూడాలి. కానీ వారం, పదిరోజులైనా హాస్టల్‌ముఖం చూడని వార్డెన్లు కోకొల్లలు. సమీప పట్టణాలు, జిల్లాకేంద్రాల్లో నివాసం ఉంటూ చుట్టపుచూపుగా వెళ్లొస్తున్నట్లు వెల్లడైంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా నిలదీస్తే... మీటింగ్‌కు వెళ్లామని చెబుతారు. హాస్టల్లో ఉండే వాచ్‌మెన్‌-క్లర్కులు తమ స్థానంలో రూ.ఐదారు వేల జీతానికి ఎవరో విద్యావంతున్ని నియమించి డ్యూటీ ఎగ్గొడుతున్నారు. హాస్టళ్ల పరిపాలనకు అనేక అంచెల ఉన్నతాధికార వ్యవస్థ ఉన్నప్పటికీ ఎవరూ తనిఖీలు చేయడం లేదు. జిల్లాకేంద్రాల్లో మొక్కుబడి సమావేశాలు, సమీక్షలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారనే విమర్శలున్నాయి. పర్యవేక్షణ లేమితో బాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రోజూ సాయంత్రం ట్యూటర్లతో గణితం, సైన్స్‌, ఆంగ్లం ట్యూషన్‌ చెప్పించాలి. అది సక్రమంగా జరుగుతోంది ఏ పాతికశాతం హాస్టళ్లలోనే. నిర్వహణ కరవై పిల్లల పరిస్థితి దుర్భరంగా తయారవుతోంది. బాలికల వసతిగృహాల వద్ద పోకిరీలు చేష్టలు పెచ్చుపెరిగాయి.

రూ.25 కోట్లపైనే బడ్జెట్‌
కృష్ణా- గుంటూరు జిల్లాలో కలిపి 250 ఎస్సీ బాలుర హాస్టళ్లు, 120 బీసీ, 48 ఎస్టీ బాలుర వసతి గృహాలను సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది.

రెండు జిల్లాల్లో ఎస్సీ హాస్టళ్లలో సుమారు 18వేలు, 14 వేల బీసీలు, 6 వేల ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఒక్కో జిల్లాలో ఏడాదికి సుమారు రూ.25 కోట్ల చొప్పున హాస్టళ్ల బడ్జెట్‌ ఖర్చవుతోంది.

ఆ వార్డెన్లపై క్రిమినల్‌ కేసులు

ప్రభుత్వ హాస్టళ్లలో విచ్చలవిడిగా అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చినట్లు ఏసీబీ కృష్ణాజిల్లా డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. ‘ఇటీవలి ఆకస్మికదాడుల్లో అనేక ఆరోపణలు నిజమేనని తేలింది. పిల్లల సంఖ్యను ఇష్టానుసారం పెంచి చూపి రేషన్‌ నిధులు డ్రా చేస్తున్నారు. వారికి మెనూ సక్రమంగా ఇవ్వడం లేదు. నిజంగా ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ఇస్తే పిల్లలు అద్భుతంగా ఎదగాలి. కానీ అలా జరగడం లేదు. వార్డెన్లు, ఇతర సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ శూన్యం. వారంరోజుల్లో ప్రభుత్వానికి గట్టిగా నివేదిక అందజేస్తాం. నిధుల దుర్వినియోగంపై నందిగామ హాస్టళ్ల వార్డెన్ల మీద క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ఉన్నతాధికారులు తరచూ హాస్టళ్లను సందర్శిస్తుంటే కింది అధికారులు బాధ్యతగా ఉంటారు’ అని చెప్పారు.

- ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ
బాధ్యులపై కఠిన చర్యలు
హాస్టళ్లలో అస్తవ్యస్థ పరిస్థితులపై సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు (డీడీ) సునీల్‌రాజ్‌కుమార్‌ (ఎస్సీ హాస్టళ్లు), శివప్రసాద్‌ (ఎస్టీ హాస్టళ్లు) స్పందిస్తూ... తప్పు చేసిన వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బయోమెట్రిక్‌ వ్యవస్థ వల్ల బాలల హాజరుల్లో అక్రమాలకు తావుండదన్నారు. ఇటీవల పలు చోట్ల తనిఖీలు చేసి విధులకు గైర్హాజరైన వాచ్‌మెన్లను సస్పెండ్‌ చేశాం. కొందరికి మెమోలు జారీచేశాం. చిన్నచిన్న లోటుపాట్లుండే సరిదిద్దుకుంటాం. అక్రమాలకు ఆస్కారమివ్వకుండా పర్యవేక్షిస్తాం. ఏసీబీ నివేదికను బట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అన్నారు.
-ఉప సంచాలకులు

ఇలా జరుగుతోంది..!
హాస్టల్లో ఉదయం 6 గంటలకు పిల్లలకు పాలతో చేసిన గ్లాసెడు రాగి జావ ఇవ్వాలి. - ఇవ్వడం లేదు

ఉదయం అల్పాహారం కిచిడి, చపాతీ, పూరి, పులిహోరల్లో ఏదో ఒకటి పెట్టాలి.

- తరచూ ఉప్మానే పెడుతున్నారు. పిల్లలు దీనిని ఇష్టపడడం లేదు.

అల్పాహారంతో తరువాత ప్రతి విద్యార్థికి పాలు ఇవ్వాలి. - ఎక్కువ చోట్ల పాల సరఫరా చేయడం లేదు.

స్కూలు నుంచి రాగానే సాయంత్రం 5 గంటలకు పోషకాలతో కూడిన బిస్కెట్లు, లేదా వేరుసెనగ పప్పుండలు (స్నాక్స్‌), టీ ఇవ్వాలి.

- కేవలం టీ మాత్రమే ఇస్తున్నారు. స్నాక్స్‌ వూసేలేదు.

రాత్రిభోజనంలో అన్నం, సాంబారు, ఒక కూరగాయల కూర పెట్టాలి. - కూర ఇవ్వట్లేదు

ప్రతి ఆదివారం వెజిటబుల్‌ పలావు- చికెన్‌ వడ్డించాలి.

- నెలలో ఒకటిరెండు వారాలే ఇది లభ్యం. ఏదో ఒక కారణంతో రెండు సార్లు మొండిచేయి చూపుతున్నారు.

Untitled Document
బంటుమిల్లిలో రేషన్‌ దుకాణానికి సీలు
ట్యాంకరుకు చిల్లుతో భయాందోళనలు
వైద్య సౌకర్యం అందిస్తే పింఛన్ల సొమ్ము ఆదా..
కుక్క దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
వివాహిత ఆత్మహత్య
ఉమ్మడి పరీక్షా విధానం వద్దు
శ్రీత్యాగరాజగాన కళా సమితి వార్షికోత్సవానికి ఏర్పాట్లు
ఎన్జీవో సభల విజయవంతానికి పిలుపు
గణితంలో విద్యార్థుల ప్రతిభ
విద్యుత్తు అక్రమ వినియోగదారులకు
నిందితుల విడుదలపై బాధితుల ఆగ్రహం
జలసిరి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
పేదలకు రూ.55కే క్యూబిక్‌ మీటర్‌ ఇసుక ఇవ్వాలి
తుళ్లూరులో ప్రజా ఫిర్యాదుల విభాగం
జానపద కళానిధి ‘గరికపాటి’
ఉమ్మడి పరీక్షా విధానం వద్దు
శ్రీత్యాగరాజగాన కళా సమితి వార్షికోత్సవానికి ఏర్పాట్లు
ఎన్జీవో సభల విజయవంతానికి పిలుపు
గణితంలో విద్యార్థుల ప్రతిభ
విద్యుత్తు అక్రమ వినియోగదారులకు
నిందితుల విడుదలపై బాధితుల ఆగ్రహం
జలసిరి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
రాధాకృష్ణమూర్తి సేవలు అభినందనీయం
తపాలా కార్యాలయంలో నిలిచిన లావాదేవీలు
ముద్రగడ నిరహార దీక్షకు మద్దతు
వరకట్నం ‘మంట’కు మహిళ బలి..!
రైతు బజార్‌ కోసం ఎదురుచూపు
పూడిక... తీయక
అద్వితీయం.. ఆ కళాకౌశలం
‘జి.ఒ. నెం. 279 రద్దు చేయాలి’
నలుగురు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరిక
రేపు సంగీత విభావరి
సామాజిక అభివృద్ధికి ఐక్యంగా పోరాటం
అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు
విద్యాలయం... ప్రగతిపథం!
సీసీ రోడ్లకు శంకుస్థాపన
ప్రకటనల రంగంలో తిరుగులేని ‘ముద్ర’
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net