గురువారం, జనవరి 19, 2017

జనరల్

సమగ్ర అంశాలతో తెలుగు నివేదిక ఇవ్వాలి
గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
డీఆర్వో భాస్కర్‌
కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న భారత గణతంత్ర దినోత్సవం చిరస్థాయిగా గుర్తుండి పోయేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.భాస్కర్‌ సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ రెవెన్యూ సమావేశ మందిరంలో ఆయన డీఆర్‌డీవో కట్టా దామోదర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఆర్డీవో, జడ్పీ సీఈవో వి.లక్ష్మీనారాయణతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో జెండా పండగ నిర్వహణ, ఏర్పాట్లు, నివేదికలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌ ప్రసంగంలో జిల్లా అభివృద్ధి, లక్ష్యాలు, ప్రభుత్వం శాఖలవారీగా ప్రవేశ పెట్టిన నూతన పథకాల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ఇప్పటి వరకు ఆయా శాఖల వారీగా వచ్చిన బడ్జెట్‌, ఖర్చు, సాధించిన ప్రగతి నివేదికలతో కూడిన సమగ్ర అంశాలు పొందుపర్చి ఒకే ఒక్క పేజీలో పొందుపర్చి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయానికి తెలుగులోనే నివేదించాలన్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 21 నాటికి పూర్తి కావాలని సూచించారు. ఎవరైనా తాత్సారం చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

* అధికారులతో జేసీ సమీక్ష : గణతంత్ర వేడుకలకు ప్రముఖులందరికీ ఆహ్వానం అందేలా చూడడంతోపాటు ప్రొటోకాల్‌కు ఎక్కడా విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కె.శివకుమార్‌నాయుడు సూచించారు. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు, ఆర్మీకి సంబంధించిన వారందరికీ ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో సాయంత్రం నిర్వహించే ఎట్‌హోం కార్యక్రమానికి జిల్లా అధికారులంతా హాజరుకావాలని జేసీ సూచించారు. సమావేశంలో కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ప్రేమ్‌రాజ్‌, సీ-విభాగం తహశీల్దారు ఉదయ్‌కుమార్‌, మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండల తహశీల్దారు ఎంవీ.ప్రభాకర్‌రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.