Sunday, February 07, 2016


Untitled Document
Comments
0
Recommend
0
Views
10
సాగరాన ఒకటవుదాం.. సమున్నత స్ఫూర్తి చాటుదాం..
ఎన్నో సంస్కృతులు... మరెన్నో జాతులు... ఇంకెన్నో ప్రాంతీయ వైవిధ్యాలు... ఇవన్నీవర్ణశోభిత సుమబాలలైతే... వాటన్నింటినీ మాలగా మలచేది... ఒక్కటిగా కట్టిఉంచేది సాగరమాతే... అందుకే మహాజలధిలో ఒకటవుదాం... సమున్నత స్ఫూర్తిచాటుదాం... అంటూ విశ్వనౌకాబలమంతా స్నేహగీతిక ఆలపించింది... పసిఫిక్‌ పశ్చిమ తీరం నుంచి జపాన్‌ సముద్రం వరకూ సప్త సాగర తీరాల్ని పంచుకునే వారంతా ఒక్కచోట చేరారు... అన్నదమ్ములమై అడుగువేద్దామంటూ బాసచేశారు... ఈ మహా వేడుకకు వేదికైన విశాఖ నగరం ఆ దీప్తిని చూసి పులకించింది... అంతర్జాతీయ నౌకా సమీక్ష వేళ... ప్రపంచ దేశాల యుద్ధనౌకలన్నీ మన కెరటాలపై కొలువుదీరాయి... ఈ దేశం కాకపోయినా... ఈ నేలలో నడయాడకపోయినా... మన దేశాధినేతకు శిరస్సు వంచి... ‘అహోయ్‌... హలో... నమస్తే...’’ అంటూ వందనం పలికారు...సోదర స్ఫూర్తిని చాటారు...
-ఈనాడు, విశాఖపట్నం
అ.నౌ.స. భేష్‌
విశాఖలో చేసిన అ.నౌ.స. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ నగరానికి వచ్చిన దేశ, విదేశీ ప్రతినిధులు పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నగరం కూడా అత్యంత సుందరంగా ఉందని ఏమాత్రం విరామం దొరికినా నగర పర్యటనకు వెళ్తున్నామని, షాపింగ్‌ చేస్తున్నామని, విశాఖ అనుభూతి మరువలేమని పేర్కొంటున్నారు.
ప్రత్యేకతల కలబోత...
ఐఎన్‌ఎస్‌ సుమిత్ర యుద్ధ నౌకలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఎడమవైపున ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పక్కన తూర్పు నౌకాదళాధిపతి సతీష్‌ సోనీ కూర్చున్నారు. కుడిపక్కన భారత నౌకాదళాధిపతి ఆర్కే ధోవన్‌, ఆయన పక్కన రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ కూర్చున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్‌లు రాష్ట్రపతికి వెనక వరుసలో కూర్చొన్నారు. సీఎంకు సమీపంలో కేంద్రం పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష మొత్తం బైనాక్యూలర్‌ ద్వారా వీక్షించారు. హాక్‌లు ప్రదర్శించిన డాగ్‌ ఫైట్‌ను ఆసక్తిగా తిలకించారు.

రాష్ట్రపతి, ప్రధానికి ఇచ్చిన టోపీల్లో ప్రత్యేకత ఉంది. ఆయా రాష్ట్రపతి టోపీకి ప్రెసిడెంట్‌ అని, ప్రధాని టోపీకి పీఎం అని రాశారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు నౌకాదళం బహూకరించిన జ్ఞాపికలో ఐఎఫ్‌ఆర్‌ సమీక్ష కోసం రూపొందించిన ప్రణాళికను చిత్రించారు.

సమీక్షలో ఉన్న పలు యుద్ధ నౌకల గురించి ఆర్కే ధోవన్‌ను రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.

‘రాష్ట్రపతిజీ జైహింద్‌’ అంటూ యుద్ధ నౌకలపై నుంచి నావికాదళ సిబ్బంది చేసే నినాదాలను గౌరవిస్తూ.. రాష్ట్రపతి వారికి సెల్యూట్‌ చేశారు.

జలాంతర్గాముల ప్రదర్శనతో సమీక్ష ముగిసింది.
సమీక్ష కోసం ఆహ్వానాలు అందుకున్నవారంతా సమయానికి చేరుకోలేకపోవడంతో నాలుగు యుద్ధ నౌకల్లోని సీట్లు ఖాళీగానే కనిపించాయి.రాష్ట్రపతి కూర్చొన్న ఐఎన్‌ఎస్‌ సుమిత్రను అనుసరిస్తూ.. నావల్‌ ఫాస్ట్‌ అటాక్‌ క్రాఫ్ట్‌ ట్యాంగో 83, 84 నౌకలు రక్షణగా వచ్చాయి. సమీక్ష ప్రారంభం కాగానే భారత నావికాదళ చరిత్ర, ప్రత్యేకతలను తెలిపే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.

-ఈనాడు, విశాఖపట్నం
అనుబంధం మరువలేం... : భారత్‌తో నౌకాదళ అనుబంధాన్ని మేం మరవలేం. ఐ.ఎన్‌.ఎస్‌ .విరాట్‌ విమానవాహక యుద్ధనౌకను భారత్‌ బ్రిటన్‌ నుంచే కొనుగోలు చేసింది. దీన్ని విశాఖలోనే మ్యూజియంగా ఏర్పాటుచేయబోతుండడం గొప్ప విశేషం.
- వాట్సన్‌, బ్రిటన్‌ నౌకాదళ అధికారి
మొదటిసారి విశాఖ వచ్చాం.... : విశాఖ నగరానికి మొట్టమొదటిసారిగా వచ్చాం. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. మా యుద్ధనౌకలు యు.ఎస్‌.ఎస్‌. మెక్‌ క్యాంప్‌బెల్‌, యు.ఎస్‌.ఎస్‌. యాంటీటంలను తీసుకుని వచ్చాం. ఈ కార్యక్రమం వల్ల పలుదేశాల నౌకాదళ అధికారులతో మా అభిప్రాయాలు పంచుకున్నాం. అన్ని నౌకాదళాలకు ఉమ్మడిగా ఉండే పలు సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలన్న అంశంపై చర్చించుకున్నాం.
- మైకేల్‌ మెక్‌రిట్నీ, కమాండింగ్‌ అధికారి, యు.ఎస్‌. నౌకాదళం
కొత్త అనుభూతి.... : బంగ్లాదేశ్‌ తరఫున నేను ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొంటున్నా. ఇదో కొత్త అనుభూతి. ఏర్పాట్లు బాగా చేశారు. ఎలాంటి ఇబ్బందులూ లేవు. అందరం సౌకర్యంగా ఉన్నాం.
-పలాష్‌, నౌకాదళ అధికారి, బంగ్లాదేశ్‌
సిడ్నీ గుర్తుకొచ్చింది.... : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో 2013లో ఐ.ఎఫ్‌.ఆర్‌. జరిగింది. ఇక్కడ చూస్తున్న ఏర్పాట్లు నాకు నాటి సిడ్నీని జ్ఞప్తికి తెచ్చాయి. ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయి. మేం డార్విన్‌ అనే యుద్ధనౌకతో వచ్చాం.
- టామ్‌, సబ్‌లెఫ్ట్‌నెంట్‌, ఆస్ట్రేలియా
మీకు తెలుసా?
1968 మార్చి 1న తూర్పు నౌకాదళం విశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటైంది. అంతవరకు నౌకాదళానికి చెందిన ఒక కమొడోర్‌ స్థాయి అధికారి 2600 కిలోమీటర్ల పొడవైన తూర్పుతీర పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తించేవారు. ఇపుడు వైస్‌ అడ్మిరల్‌ హోదా అధికారి ఆధ్వర్యంలో విశాఖ కేంద్రంగా అనేక యుద్ధ నౌకలను మోహరించారు.
-న్యూస్‌టుడే, సింథియా
విశాఖలో ‘ఐ.ఎన్‌.ఎస్‌.డేగా’ పేరుతో ప్రత్యేక నౌకాదళ వాయుస్థావరం ఉంది. కీలక యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, పైలెట్‌ రహిత యుద్ధ విమానం ఇక్కడున్నాయి. ఏ క్షణంలోనైనా దాడులు, సహాయక చర్యలు చేసేందుకు ఇవి సిద్ధంగా ఉన్నాయి.
-న్యూస్‌టుడే, సింథియా 


 


 


 


 


  Untitled Document
పత్తి కొనుగోలులో రిమోట్‌ మాయాజాలం
గ్రేటర్‌ విజయం ప్రభుత్వ పాలనకు నిదర్శనం
ఫోన్‌ అన్నారు.. చిత్తు కాయితాలు పంపారు
కాకతీయ విద్యార్థులకు బంగారు పతకాలు
మాఘమాస ఉత్సవాలకు సింగరయ్య లొద్దులు సిద్ధం
విద్యాధరిలో 2వేల తైలాభిషేకాలు
దామాషా ప్రకారం నిధులకు డిమాండ్‌
నది మడుగుల వద్ద బోర్డుల ఏర్పాటు
బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
ప్రదర్శనల జోరు..డీజేల హోరు
మైనర్‌ను పెళ్లి చేసుకున్న వ్యక్తి అరెస్టు
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
చికిత్స పొందుతూ మహిళ మృతి
ప్రకాశ్‌కు రంగస్థల రత్నం
పాఠశాలలో కొండచిలువ కలకలం
అమలుకాని చట్టం..అటకెక్కిన బోధన
పిల్లలతో పనులు చేయిస్తే చర్యలు
కేతకిలో ఎంపీ పూజలు
ఖేడ్‌లోనూ గ్రేటర్‌ తరహా ఫలితాలే
ఉపాధ్యాయుల ధర్నా నోటీసు
ప్రధానోపాధ్యాయుల సమావేశం రేపు
కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి
ప్రత్యేక పరిశీలనకు వెబ్‌కాస్టింగ్‌
గైర్హాజరైతే చర్యలు
పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి
జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నిధులు రాలేదని కేంద్రం మూసేస్తారా?
ఏటీఎం దోపిడీ నిందితుడు కోర్టుకు రేపు
కలెక్టర్‌ను కలిసిన హుక్యానాయక్‌
కూడవెళ్లి జాతరకు పోదాం రండి
పరోపకారంతోనే ఆనందం
మనస్తాపంతో ఆత్మహత్య
ఐసీడీఎస్‌ నిర్వీర్యానికి కుట్ర
మూడున్నరేళ్లు ముందుండి నడిపిస్తా
సాంప్రదాయాన్ని అణగదొక్కినందుకు బుద్ధి చెప్పాలి
కాంగ్రెస్‌తోనే ఖేడ్‌ అభివృద్ధి
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net