మంగళవారం, జనవరి 17, 2017

నియోజకవర్గ సమాచారం

raj
కూకట్‌పల్లి

చారిత్రాత్మక నేపథ్యం
కూకట్‌పల్లిలో నిజాంకాలం నాటి బురుజులు, కమాన్లు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఒకప్పుడు కేపీహెచ్‌బీకాలనీలోకి రావాలంటే ప్రజలు భయపడేవారు. దోపిడీలు.. హత్యలు జరగడమే దీనికి కారణం. ఇటువంటి కాలనీ తర్వాత గణనీయమైన అభివృద్ధి చెంది ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా ఆవిర్భవించింది. అతిపెద్ద హౌసింగ్‌ ప్రాజెక్టులు మలేషియా టౌన్‌షిప్‌, ఇందూ ప్రాజెక్ట్సు తదితరాలు ఈ కాలనీకి మణిపూసల్లాంటివి. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ జేఎన్‌టీయూ ఇక్కడే కొలువై ఉంది.

రాజకీయ నేపథ్యం
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన ఖైరతాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న కూకట్‌పల్లి ప్రాంతం... పునర్విభజనలో 2009లో అసెంబ్లీ నియోజకర్గంగా ఆవిర్భవించింది.

భౌగోళిక పరిస్థితులు
కూకట్‌పల్లిలో అంతర్భాగమైన ముఖ్య ప్రాంతాలు శేరిలింగంపల్లిలో కలిశాయి. సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌కు అనుబంధంగా ఉంటే పాత బోయిన్‌పల్లి, హస్మత్‌పేట ప్రాంతాలతో పాటు బేగంపేటలోని కొంత భాగాన్ని ఈ నియోజకవర్గంలో కలిపారు.

రహదారులు
ముంబయి జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌9) కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాల మీదుగా వెళుతుంది. బాలానగర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆర్‌ అండ్‌ బి రహదారులు ఉన్నాయి. అధికశాతం రహదారులన్నీ కూకట్‌పల్లి సర్కిల్‌ నిర్వహణలో ఉన్నాయి.
మేడ్చల్‌ నియోజకవర్గం


మండలాలు: మేడ్చల్‌ నియోజకవర్గం మేడ్చల్‌, శామీర్‌పేట, ఘట్‌కేసర్‌, కీసర మండలాల పరిధితో ఏర్పాటయింది. మేడ్చల్‌ నియోజకవర్గంలోని కీసర మండలంలో శ్రీ రామలింగేశ్వరస్వామిఆలయం(కీసరగుట్ట) పర్యాటక ప్రాధాన్యం కల్గిన దేవాలయం.
సహజవనరులు: మేడ్చల్‌ నియోజకవర్గంలోని ఘట్‌కేసర్‌, మేడ్చల్‌, శామీర్‌పేట, కీసర మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకర రాయి, ఇసుక, ఇటుకమట్టి, ఆర్డినరీ క్లే తదితర సహజవనరులు లభిస్తున్నాయి.
రైల్వే స్టేషన్లు: మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలో మేడ్చల్‌, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, డబ్లిపూర్‌, చర్లపల్లి, ఘట్‌కేసర్‌లలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

మల్కాజిగిరి

నియోజకవర్గ ఆవిర్భావం: 2009
నియోజకవర్గపరిధిలోని మండలాలు: ఒక్కటి (మల్కాజిగిరి)
సర్కిళ్లు : మల్కాజిగిరి, అల్వాల్‌
నేపథ్యం: మల్కాజిగిరి నియోజకవర్గం ఏర్పడక ముందు ఈ ప్రాంతం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉండేది. పూర్వకాలంలో ఇక్కడ మల్లికార్జునస్వామి దేవాలయం ఉండేది. దాంతో ఈ ప్రాంతాన్ని మల్లికార్జున గిరిగా పిలిచేవారు. కాలక్రమంలో మల్కాజిగిరిగా మారిపోయింది. రంగారెడ్డి జిల్లాలో గ్రామంగా ఉండేది. కాలక్రమంలో నగరీకరణ వల్ల ఈ ప్రాంతం 1981లో మున్సిపాలిటీగా అవతరించింది. నాలుగేళ్ల క్రితం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో విలీనమయింది. మల్కాజిగిరిలో రామకృష్ణాపురం, సఫిల్‌గూడ చెరువు, బండ్లచెరువు, అల్వాల్‌లో చెరువులు ప్రసిద్ధిచెందాయి. సఫిల్‌గూడ చెరువు ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. కేంద్ర రక్షణ శాఖకు చెందిన ‘ఏఓసీ’ సెంటర్‌ సగం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడ సైనిక శిక్షణ, యుద్ధంలో ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తారు.
కుత్బుల్లాపూర్‌

నియోజకవర్గ ఆవిర్భావం: 2009
మండలాలు: కుత్బుల్లాపూర్‌
చారిత్రక నేపథ్యం: నైజాం ప్రభుత్వం 1897లో జీడిమెట్లలో ఫాక్స్‌సాగర్‌ నిర్మించింది. ఆసియా ఖండంలోకెల్లా అతి పెద్ద పారిశ్రామిక వాడ జీడిమెట్లలో ఆవిర్భవించింది. దుండిగల్‌లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమినీ ఏర్పాటు చేశారు. గతంలో ఈ ప్రాంతం మేడ్చల్‌ అసెంబ్లీ, సిద్ధిపేట పార్లమెంటు నియోజకవర్గాల్లో అంతర్భాగం. పునర్విభజనలో తాజాగా ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇది మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది.

భౌగోళిక పరిస్థితులు: 1500 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వ్‌డ్‌ ఫారెస్టు, 200 ఎకరాల్లో క్వారీ పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ఉత్తరం దిక్కున దుండిగల్‌ ఏయిర్‌ఫోర్స్‌ అకాడమీ, దుండిగల్‌, బౌరంపేట, మల్లంపేట, బాచుపల్లి గ్రామాల సరిహద్దులో మెదక్‌ జిల్లాలోని అన్నారం, జిన్నారం, ఖాజిపల్లి, ఐడీఎ బొల్లారం ఉండగా, తూర్పున మేడ్చల్‌, అల్వాల్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లోని, కాలనీలు, దక్షిణానా బాలానగర్‌ ప్రాంతంలోని కాలనీలు, పశ్చిమాన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కాలనీలు విస్తరించి ఉన్నాయి.
రహదారులు: 7వ నెంబరు జాతీయ రహదారి సుచిత్రా చౌరస్తా నుంచి కొంపల్లి వరకు మూడు కిలోమీర్ల మేర విస్తరించి ఉంది. 25 కిలోమీటర్ల మేర నర్సాపూర్‌ అర్‌అండ్‌బీ రాష్ట్ర రహదారి ఉంది.
ఉప్పల్‌

ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలో ఉప్పల్‌ మండలం ఉంది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం


ప్రత్యేకత: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని హయత్‌నగర్‌ మండలంలో ఉంది.
మండలాలు: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హయత్‌నగర్‌, మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలతో ఏర్పాటయింది.
సహజవనరులు: ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్‌ మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఇటుక మట్టి, ఇసుక పుష్కలంగా లభిస్తున్నాయి.
ఇబ్రహీంపట్నం మండల వివరాలు
ఇబ్రహీంపట్నం మండల విస్తీర్ణం- చ.కి.మీ: 244.07
మండలంలోని మొత్తం గ్రామాలు-28
ప్రస్తుతం ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కావటంతో శేరిగూడ, ఇబ్రహీంపట్నం, సీతారాంపేట్‌ మూడు గ్రామాలు విలీనమయ్యాయి. గ్రామ పంచాయతీల సంఖ్య 19కి చేరింది.
మండలంలో మొత్తం రెవెన్యూ గ్రామాలు 22
మండలంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 31
ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 8
ఉన్నత పాఠశాలలు 13
మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాలుగు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలున్నాయి. ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు 8. ఇబ్రహీంపట్నం మండలంలో వృత్తి విద్యా కళాశాలలు 12.
ప్రభుత్వ సాంఘీక, సంక్షేమ వసతి గృహాల సంఖ్య 6. అంగన్‌వాడీ కేంద్రాలు 42 ఉన్నాయి.

మండలంలో వ్యవసాయ గొట్టపు బావులు 1220
చిన్న నీటి తరహా నీటి వనరులైన చెరువులు, కుంటలు 59
ఇబ్రహీంపట్నం మండలంలో చెరువుల కింద ఆయకట్టు 20634 ఎకరాలు
మండలంలో మొత్తం వ్యవసాయ బావులు 1360
పశువైద్య కేంద్రాలు 6
మండలంలో ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రి 1
పీహెచ్‌సీ కేంద్రం 1
విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు 4
టెలిఫోన్‌ కేంద్రాలు 2
రైస్‌ మిల్లులు 38
కోల్డ్‌ స్టోరేజీలు 4
పాలశీతలీకరణ కేంద్రం 1
మండలంలో మొత్తం భూమి 66 వేల ఎకరాలు
మండలంలో 12 వేల ఎకరాల్లో అటవి భూమి, 30 వేల ఎకరాల వరకు వ్యవసాయ సాగు భూమి ఉంది.
ప్రధాన పంటలు- వరి, జొన్న, ఆముదం, మొక్కజొన్న, కూరగాయలు
మండలంలో ప్రముఖ రక్షణ సంస్థలు
ఇబ్రహీంపట్నంలో సర్వే నంబరు 2లో 570 ఎకరాల్లో ఆక్టోపస్‌ను ఏర్పాటు చేశారు. సర్వే నంబరు 58లో 600 ఎకరాల్లో ఎన్‌ఎస్‌జీ శిబిరాన్ని ఏర్పాటుచేశారు. శేరిగూడ, ఇబ్రహీంపట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 662, 678, 257, 108 సర్వే నంబరులో 430 ఎకరాల్లో భారత డైనమిక్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) ఏర్పాటుచేశారు. మండల పరిధిలోని ఆదిభట్లలో టాటాఏరోస్పేస్‌ కేంద్రం ఉంది. ఇబ్రహీంపట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 58లో నేషనల్‌ పోలీస్‌ అకాడమి ఏర్పాటు చేస్తున్నారు. దండుమైలారం మైనింగ్‌ జోన్‌ను కొంగరకలాన్‌లోఏర్పాటుచేయనున్నారు.
ఇబ్రహీంపట్నం సహకార సంఘాలు: ఇబ్రహీంపట్నం, దండుమైలారం, పోల్కంపల్లి, శేరిగూడ, ఎంపీపటేల్‌గూడలో 4 సహకార సంఘాలున్నాయి.
ఇబ్రహీంపట్నం మండలంలో గ్రామ పంచాయతీలు :
ఆదిత్యానగర్‌, బొంగుళూరు, ఎంపీపటేల్‌గూడ, కొంగరకలాన్‌, మంగల్‌పల్లి, పోచారం, రాందాస్‌పల్లి, నాగన్‌పల్లి, నెర్రపల్లి, పోల్కంపల్లి, దండుమైలారం, రాయపోల్‌, ముకునూరు, ఎలిమినేడు, కప్పాపాహాడ్‌, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ, కర్ణంగూడ, ఉప్పరిగూడ, తులేకలాన్‌ . నగర పంచాయతీ పరిధిలో ఇబ్రహీంపట్నం, శేరిగూడ, సీతారాంపేట్‌, మంచాల మండల పరిధిలోని ఖానాపూర్‌ గ్రామ పంచాయతిని కలిపి నగర పంచాయతీగా ఏర్పాటు చేశారు.
చారిత్రక కట్టడాలు
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును క్రీ.శ.1555 లో నిర్మించారు. జిల్లాలోనే ఈ చెరువు అతిపెద్దది. ఈ చెరువులో నీళ్ళుంటే వంద గ్రామాలకు భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాగే వెయ్యిమంది మత్స్య కార్మికులకు, ఐదారు వేల మంది రైతులు జీవనాధారం లభిస్తుంది. గతంలో నీళ్ళున్నప్పుడు 13వందల ఎకరాల భూమిలో వరి, ఇతర పంటలు సాగు చేసేవారు. అలాగే దండుమైలారం, రాయపోల్‌ గ్రామాల్లో చారిత్రాత్మకమైన చెరువులు, కుంటలున్నాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టికాన, శేరిగూడ వద్ద పులందేశ్వరీ చెక్‌డ్యామ్‌లున్నాయి. పోచారం, తులేకలాన్‌ గ్రామాల్లో దాదాపు వెయ్యి సంవత్సరాల కోట గోడ, బురుజులున్నాయి.
భూదాన భూముల వివరాలు
ఇబ్రహీంపట్నం మండలంలో స్వాతంత్య్రం అనంతరం భూదానోద్యమ పితామహాడు ఆచార్య వినోభాబావే, భూదాన సేకరణలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని భూస్వాముల వద్ద దాదాపు 5వేల ఎకరాలకు పైగా భూములను సేకరించాడు. 1973-74లో భూదాన బోర్డు ట్రస్టు ఏర్పాటుచేసి భూమి లేని నిరుపేదలకు ఒక్కొక్క కుటుంబానికి మూడు నుంచి ఐదెకరాల భూమిని పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఈ భూదాన భూముల్లో సుమారు 3వేల ఎకరాల్లో పేదల నుంచి భూములు తీసుకొని వారికి నష్టపరిహారం ఇచ్చి వివిధ రక్షణ సంస్థల ఏర్పాటుకు, కేటాయించారు.
మంచాల సమాచారం
గ్రామ పంచాయతీల సంఖ్య : 17
అనుబంధ గ్రామాలు : 13
మొత్తం రహదారులు : 172 కిమీ
నీటి వనరులు : ఎలాంటి కాలువలు లేవు, కేవలం వర్షం పైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులు : మంచాల, ఆరుట్ల, జాపాల
గ్రంథాలయాలు : ఆరుట్ల, మంచాల
మొత్తం వసతి గృహలు : మంచాల బీసీ బాలికలు, ఆరుట్ల ఎస్సీ బాలురు, రంగాపూర్‌ ఎస్టీ బాలికలు, మంచాలలో కస్తూర్బాగాంధీ బాలికల వసతి గృహం
చారిత్రక దేవాలయాలు : బుగ్గరామలింగేశ్వర ఆలయం, శివాలయం (ఆరుట్ల), రాజకొండ దేవాలయం (తిప్పాయిగూడ)
చూడదగ్గ ప్రదేశాలు : నక్షత్రశాల, లోయపల్లి రాచకొండ గుట్టలు
పరిశ్రమలు : ఆడాపల్లిలో కంకర పరిశ్రమ ఉన్నాయి.ఇటివల నోములలో నూనె మిల్లు ప్రారంభమయింది.
సాగు నీటి సంఘాలు : 5, మంచాల, లింగంపల్లి, బొడకొండ, కాగజ్‌ఘాట్‌, చిత్తాపూర్‌
టెలిఫోన్‌ ఎక్సైంజ్‌ లు : రంగాపూర్‌, బొడకొండ, మంచాల
బ్యాంకులు : 3, ఆరుట్ల యస్‌బిహెచ్‌, మంచాల, బొడకొండ (దక్కన్‌ గ్రామీణ బ్యాంకు )
సహకర సంఘాలు : మంచాలలో ఒక్కటే
పశువైద్యశాల : ఆరుట్ల, మంచాల, లోయపల్లి
విద్యుత్‌ సబ్‌స్టేషన్లు : 3, మంచాల, ఆరుట్ల, బొడకొండ
పరిశ్రమలు :
* గున్‌గల్‌లో తిరుమల డైయిరీ పాల పరిశ్రమ ఉంది. ఇక్కడ కోస్తా ఆంధ్రాప్రాంతంతో పాటు ఇక్కడ ఖరీదు చేసిన పాలను వివిధ పాల ఉత్పత్తులు, పాల పాకెట్‌లు తయారీ చేసి తెలంగాణ ప్రాంతంలో విక్రయిస్తారు.
* తక్కళ్ళపల్లి వద్ద ఆల్ట్రా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఉంది. దీనిని వ్యవసాయ, కోళ్లఫారాల వ్యర్థాలతో నిర్వహించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.
* మాల్‌లో మదర్‌ డైయిరీ పాలశీతలీకరణ కేంద్రం ఉంది. రైతుల నుంచి 60వేల లీటర్‌ల పాలను ఖరీదు చేసి నగరానికి సరఫరా చేస్తారు.
దేవాలయాలు : నందివనపర్తిలో ప్రసిద్ద దేవాలయాలున్నాయి. ఓంకారేశ్వరాలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ ఆలయానికి 1100 ఎకరాల భూమి ఉంది. ఇదే గ్రామంలోని నందీశ్వరాలయంలో ఏడడుగుల నందివిగ్రహం ఉంది. ఇక్కడే పూర్వవిద్యార్థులు జ్ఞానసరస్వతీ దేవాలయాన్ని కొత్తగా నిర్మించారు. దీన్ని ప్రసిద్ద క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. గ్రామంలోని హనుమాన్‌ మందిరాన్ని జీర్ణోద్దరణ చేశారు. ప్రసిద్ద సిద్దేశ్వరాలయం ఉంది. దీన్ని ఐదొందల ఏళ్ల క్రితం నిర్మితమైన గుడి ఇదీ. ఇందులో స్వయంభు శివలింగం ఉన్నది.
శిక్షణ సంస్థలు: తక్కళ్లపల్లి వద్ద గ్రామపునర్‌నిర్మాణ సంస్థ(వీఆర్వో) గ్రామీణ మహిళలకు ఉచితంగా కట్లు, అల్లికలు, ఎఎన్‌ఎం తదితర స్వయం పాధిలో శిక్షణ ఇస్తోంది.
*తమ్మలోనిగూడెం సమీపంలోని పిపల్‌ట్రీ వెంచర్‌లో భారీ యంత్రాల నిర్వహణ, సెంట్రింగ్‌, భూమికొలతలు తదితర రంగాలలో శిక్షణ ఇస్తారు. 97036 21294
ప్రభుత్వ ఆసుపత్రులు:
యాచారంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం దాని పరిధిలో 12 ఉపకేంద్రాలున్నాయి.
యాచారంలో సెయింట్‌ గిగ్రోయస్‌ బాలగ్రాం కంటి ఆసుపత్రి ఉంది. ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి సహకారంతో దీన్ని నిర్వహిస్తున్నారు. పేదలకు ఇక్కడ ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.9440193183
మెడికల్‌, అంబులెన్స్‌ వసతి: 108, 104 సేవలు అందుబాటులో ఉన్నాయి.

మొత్తం రహదారులు: యాచారం మీదుగా ఆర్‌ అండ్‌ బీకి చెందిన నాగార్జునసాగర్‌-హైద్రాబాద్‌ రహదారి ఆగాపల్లి మొదలు మాల్‌ వరకు 20 కిమీల రహదారి కలదు. మండల, జడ్పీ రహదారులు 290కిమీలు కలవు.
నీటి వనరులు: వర్షాదారమే ఆధారం. ఎలాంటి కాలువలు లేవు.
వ్యవసాయం: పూర్తిగా వర్షాలతో 4200 బోర్లు, 300 బావులు ఉన్నాయి
గ్రంథాలయాలు: యాచారంలో ఒకటి ఉంది.
పాఠశాలలు మొత్తం: 49 ఇందులో 10 ఉన్నత పాఠశాలలు, మొత్తం విద్యార్థులు 5300.
వసతి గృహలు : యాచారంలో బీసీ బాలికలు, మేడిపల్లి ఎస్సీ బాలురు, బీసీ బాలికలు, యాచారంలో కస్తూర్బాగాంధీ ఆశ్రమపాఠశాల.

మీసేవలు : యాచారంలో ఎస్వీ ఇన్‌పో మీసేవా కేంద్రం ఉంది( నెం. 08414-243555), మండల కార్యాలయం వద్ద ధనుష్‌ మీసేవా కేంద్రం ఉంది(90009 87337)
సాగు నీటి సంఘాలు : మల్కీజ్‌గూడెం, మేడిపల్లి, నక్కర్త, తాటిపర్తి, నల్లవెల్లి, చింతపట్ల, తక్కళ్లపల్లి.
టెలిఫోన్‌ ఎక్సేంజ్‌లు : యాచారం, మాల్‌
బ్యాంకులు : యాచారం, మాల్‌లో ఎస్బీహెచ్‌, మాల్‌లో ఆంధ్రా బ్యాంకు, మేడిపల్లిలో ఇండియన్‌ బ్యాంకు ఉన్నాయి.
సహకార సంఘాలు : యాచారంలో పశువైద్యశాల ఉంది. యాచారం, మేడిపల్లిలో పశువైద్యకేంద్రాలున్నాయి. గున్‌గల్‌, చింతుల్ల, నందివనపర్తి, తాటిపర్తి, కొత్తపల్లి, మాల్‌ చింతపట్లలో ఉప కేంద్రాలున్నాయి.

హయత్‌నగర్‌ మండలంలో ప్రముఖ ప్రదేశాలు
ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ.. ప్రపంచ సాయి గుర్తింపుకు తోడు గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్న రామోజీ ఫిల్మ్‌సిటీ హయత్‌నగర్‌ మండలంలో విస్తరించి ఉంది. చలన చిత్ర రంగంతో పాటు పర్యాటక రంగానికి పట్టుకొమ్మలా వెలుగొందుతోంది. సకల ఏర్పాట్లతో చలన చిత్ర రంగానికి అందుబాటులోకి వచ్చిన రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇప్పటికే వివిధ భాషల్లో సుమారు 2 వేలకు పైగా సినిమాల చిత్రీకరణ జరిగింది. ఎన్నో విజయవంతమైన చిత్రాల చిత్రీకరణలో భాగమైన ఫిల్మ్‌సిటీ లోకేషన్లు, సాంకేతిక పరిజ్ఞానం చలనచిత్ర రంగంలో సాటిలేని ఖ్యాతిని గడించేలా చేసింది. చూడచక్కని ప్రకృతి అందాలు, ఆకట్టుకునే కట్టడాలతో ఫిల్మ్‌సిటీ నిర్మాణ ప్రావీణ్యం వెరిసి చలనచిత్ర రంగానికి చెరగని చిరునామాగా అవతరించింది.
మౌంట్‌ ఓపెరలో వినోదాలను ఆస్వాదించోచ్చు.. ప్రధాన జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 65)లోని హయత్‌నగర్‌ మండలం బాటసింగారం పరిధిలో మౌంట్‌ ఓపెర పర్యాటక (రిసార్టు) ప్రదేశం ఉంది. ఇందులో సకుటుంబ సమేతంగా ఆనందించేందుకు పలు ఏర్పాట్లు ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ఈత కొలను తదితర ఏర్పాట్లు ఉన్నాయి.
వందల ఏళ్ల చరిత్రకు ఆనవాళ్లు..! హయత్‌నగర్‌ మండలంలోని పలు విశేషాలు 4 వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యాలుగా నేటికి దర్శనమిస్తున్నాయి. హయత్‌నగర్‌ మండలం కవాడిపల్లిలోని శ్రీ కోదండరామచంద్రస్వామి ఆలయాన్ని 4 వందల సంవత్సరాల కిత్రం నిర్మించారు. శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. శ్రీ రంగనాథస్వామి ఆలయంలో.. హయత్‌నగర్‌ మండలం గండిచెరువు ప్రాంతంలోని ప్రాచీన రంగనాయకుల గుట్టపై స్వయంభు శ్రీ రంగనాథస్వామి ఆలయం ఉంది. ఆలయంలోని స్వామి ప్రతిమ ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. ఏటా శ్రీ రామనవమికి ఆలయ బ్రహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
ఎల్బీనగర్‌

ఆవిర్భావం: 2009

డివిజన్లు: 8. (కొత్తపేట, మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, కర్మన్‌ఘాట్‌, చంపాపేట, గడ్డిఅన్నారం, పీఅండ్‌టీకాలనీ).
మండలాలు: సరూర్‌నగర్‌, ఉప్పల్‌. (గ్రామాలు- కొత్తపేట, బండ్లగూడ, నాగోలు, మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌, సాహెబ్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, బైరామల్‌గూడ, చంపాపేట, గడ్డిఅన్నారం).
నియోజకవర్గ విస్తీర్ణం: 86 చ.కి.మీ.
మున్సిపాలిటీ: ఎల్‌.బి.నగర్‌, గడ్డిఅన్నారం మున్సిపాలిటీలుగా ఉండేవి. రెండున్నరేళ్ల క్రితం గ్రేటర్‌లో విలీనమయ్యాయి. ఎల్‌.బి.నగర్‌ సర్కిల్‌గా కొనసాగుతోంది.

ప్రాధాన్యాలు: రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం. నియోజకవర్గంలో సచివాలయంలో పని చేసే ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. అసియాలోనే అతిపెద్ద కాలనీ వనస్థలిపురం ఇక్కడే ఉంది.

పరిశోధన సంస్థలు: దక్షిణ భారతదేశంలోని ఖనిజ వనరులు, భూగర్భవనరులు, మ్యాపింగ్‌, గనుల గుర్తింపు, శిలాజాలు, పురాతన అంశాలపై విశేషంగా కృషి చేసే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ బండ్లగూడలో సువిశాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 200 ఎకరాల స్థలంలో జీఎస్‌ఐ ఆవరించి ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంగా పని చేస్తోంది. పరిశోధనలు, శిక్షణలు, జలవనరులను గుర్తించే పనులు నిర్వహిస్తోంది. సుమారు 2 వేల మంది శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు.

నగరానికి తలమానికమైన సరూర్‌నగర్‌ ఇండోర్‌స్టేడియం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు వేదిక. జిమ్నాస్టిక్స్‌, రన్నింగ్‌, హాకీ, షటిల్‌, చదరంగం వంటి అనేక ఆటల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. శాప్‌ ఆధ్వర్యంలో స్టేడియం నడుస్తోంది.

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచ ివివిధ రకాల పండ్లు దిగుమతి అవుతాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ ఇది.

మన్సూరాబాద్‌ సహారా ఎస్టేట్స్‌లో దాదాపు 10 రాష్ట్రాలకు చెందిన ప్రజలు కలిసి నివసిస్తున్నారు. భిన్న సంస్కృతులకు వేదికగా నిలుస్తోంది.

చారిత్రక నేపథ్యం: కొత్తపేట, నాగోలు, బండ్లగూడ, మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌, సాహెబ్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట, బహదూర్‌గూడ, గడ్డిఅన్నారం, సరూర్‌నగర్‌ పంచాయతీలతో మొదట మున్సిపాలిటీ ఏర్పడింది. ఆ తర్వాత నియోజకవర్గ పునర్విభజనతో సరూర్‌నగర్‌ మినహా మిగతా గ్రామ పంచాయతీల పరిధి కలిసి నియోజకవర్గంగా మారింది. బహదూర్‌గూడ చౌరస్తాకే లాల్‌బహదూర్‌ చౌరస్తాగా నామకరణం చేశారు. తరవాత అక్కడ కొత్తగా ఏర్పడిన కాలనీకి లాల్‌బహదూర్‌నగర్‌ (ఎల్‌.బి.నగర్‌)గా పేరొచ్చింది. అదే పేరు మొదట మున్సిపాలిటీకి, తర్వాత నియోజకవర్గానికి వచ్చింది.

భౌగోళిక స్థితి: నియోజకవర్గం జాతీయ రహదారులు 7, 9ల మధ్య ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు ఎన్‌హెచ్‌-9, డీఆర్‌డీఎల్‌ చౌరస్తా నుంచి నాగోలు వరకు ఎన్‌హెచ్‌-7 ఉంది.


మహేశ్వరం నియోజకవర్గం


మండలాలు: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు, సరూర్‌నగర్‌, మహేశ్వరం మండలాల పరిధితో ఏర్పాటైంది.
సహజవనరులు: మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం, సరూర్‌నగర్‌, కందుకూరు మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఇటుకమట్టి, క్వార్ట్జ్‌, ఫీల్డ్‌ స్పార్‌ తదితర ఖనిజాలు లభిస్తున్నాయి.
మహేశ్వరం మండల సమాచారం.
1. విస్తీర్ణం చ.కి.మీ: 270
* మహేశ్వరం మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలు
*ఎంపీటీసీ స్ధానాల సంఖ్య :17
* అనుబంధ గ్రామాలు, గిరిజన తండాలు: 39
* రెవెన్యూ గ్రామాలు :33
* వైద్యం: మహేశ్వరంలో సీహెచ్‌ఎన్సీ ఆసుపత్రి ఉంది. దీనిని వంద పడకల ఆసుపత్రి స్ధాయికి పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం రూ.8కోట్లు మంజూరు చేశారు.
* దుబ్బచర్లలో పీహెచ్‌సీ ఆసుపత్రి ఉంది.

* పది ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి
* గ్రామీణ పశువైద్యశాలలు :6 ఉన్నాయి. దుబ్బచర్లలో మండల పశువైద్యశాల ఏర్పాటు చేశారు.
*టెలిఫోన్‌ ఎక్ఛేంజీ కార్యాలయాలు (4) : మహేశ్వరం, మంఖాల్‌,రావిర్యాల, దుబ్బచర్ల గ్రామాల్లో ఉన్నాయి.
మహేశ్వరం,కందుకూరు మండలాల పరిధలోని విద్యుత్‌ ఉపకేంద్రాలు : హైదరాబాదు-శ్రీశైలం రహదారిపై సర్ధార్‌నగర్‌ గేటు వద్ద 400 కెవి.విద్యుత్‌ ఉపకేంద్రం, ఫ్యాబ్‌సిటీలో 220 కెవి.విద్తుత్తు ఉపకేంద్రం ఏర్పాటు జరుగుతుంది. హార్డ్‌వేర్‌ పార్క్‌ లో 132 కెవి విద్యుత్‌ ఉపకేంద్రం పనులు సాగుతున్నాయి. హార్డ్‌వేర్‌ పార్క్‌లో రెండు, సర్దార్‌నగర్‌ గేటు, మంఖాల్‌ పారిశ్రామికవాడ, మహేశ్వరం, ఘట్టుపల్లి, పెండ్యాల, కోళ్లపడకల్‌, అమీర్‌పేట, నాగారం గ్రామాలల్లో 33/11 కెవి విద్యుత్తు ఉపకేంద్రాలున్నాయి.
*మహేశ్వరంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రం ఉంది.

*సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రం (ఐసీడీఎస్‌) ప్రాజెక్టు ఉంది. మహేశ్వరం, కందుకూరు మండలాలల్లో 124 కేంద్రాలున్నాయి.
*రైస్‌మిల్లులు మహేశ్వరంలో రెండు,మన్‌సాన్‌పల్లిలో రెండు,కోళ్లపడకల్‌ రెండు,తుక్కుగూడలో రెండు,మంఖాల్‌ పారిశ్రామిక వాడలో రెండు ఉన్నాయి.
*గ్రంథాలయాలు: మహేశ్వరంలో శాఖ గ్రంథాలయం ఉంది.
*వే బ్రిడ్జిలు: మంఖాల్‌ పారిశ్రామిక వాడ వద్ద 8,తుక్కుగూడలో రెండు,మన్‌సాన్‌పల్లి చౌరస్తాలో ఒకటి ఉంది.
*పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయం: మహేశ్వరం సబ్‌డివిజన్‌ పంచాయతీరాజ్‌ఇంజినీరింగ్‌ కార్యాలయం
*మహేశ్వరం మండలంలో పంచాయతీరాజ్‌ రహదారులు 192.7 కి.మీ దూరం.
* పశుగ్రాస విత్తనోత్పత్తి క్షేత్రం : మేలు రకం పశుగ్రాసంపై నిరంతరం పరిశోధన రావిర్యాల రెవెన్యూ పరిధిలో రాష్ట్ర రాజధానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని 1973లో నెలకొల్పారు.240 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. మన దేశంలో ఏడు ప్రశుగ్రాస వ్రిత్తనోత్పత్తి కేంద్రాలలో మద్యస్ధ అనార్ధ్ర ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్‌లోని మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.

ప్రధాన చెరువులు: అమీర్‌పేట కొత్తచెరువు 43 హెక్టార్లువిస్తీర్ణం ఆయకట్టు బాగ్‌మంఖాల్‌ పెద్దచెరువు 60 హెక్టార్లు విస్తీర్ణం కోళ్లపడకల్‌ పత్తేసాగర్‌ చెరువు 60 హెక్టార్లు విస్తీర్ణం కల్వకోల్‌ పెద్దచెరువు 133 హెక్టార్లు విస్తీర్ణం రావిర్యాల 440 హెక్టర్లు విస్తీర్ణం ఉంది.
వ్యవసాయం : మహేశ్వరం మండలం భౌగోళిక విస్తీర్ణం :26,938 హెక్టార్లు
సాధారణ వర్షపాతం :750 మిల్లీమీటర్లు

 మండలంలోని ప్రధానమైన దేవాలయాలు: ఉట్లపల్లి లక్ష్మీచెన్నకేశవ దేవాయలం, రాచులూరు: కోదండ రామాలయం, పులిమామిడి: చీకటి వెంకటేశ్వర ఆలయం, నేదునూరు: వెంకటేశ్వర ఆలయం. మీర్‌ఖాన్‌పేట: సాయిబాబా ఆలయం
నీటి పారుదల శాఖ, వ్యవసాయ విస్తీర్ణం: నీటి పారుదల కింద మండలంలో ఎనిమిది చెరువుల కింద 1455 ఏకరాల ఆయకట్టు ఉంది. నీటి పారుదల ప్రాంతాలు, మీర్‌ఖాన్‌పేట రాంబాయి కత్వా, ఆకుల మైలారం: మైలమ్మ చెరువు, రాచులూరు సంధ్యమ చెరువు, సాయిరెడ్డిగూడ పెద్దిరెడ్డి చెరువు, గుమ్మడవెల్లి తులసీబాయి కత్వా, కొత్తగూడ సున్నం చెరువు, తిమ్మాపురం తిమ్మా చెరువు, జైత్వారం నాయిని చెరువు,.. వ్యవసాయ వీస్తీర్ణం: 23957 ఏకరాలు , ప్రధాన పంటలు మొక్కజోన్న,వరి, పత్తి, జోన్న, టమాట సాగు
అటవీ శాఖ వీస్తీర్ణం:5964 ఎకరాలు
రోడ్ల విస్తీర్ణం: ఆర్‌అండ్‌బీ పరిధిలో 61కి.మీ.పంచాయతీ రాజ్‌ పరిధిలో227 కి.మీ
ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల పోన్‌ నంబర్లు:ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:9849605915
భూలక్ష్మీ మోమోరియల్‌ ఆసుపత్రి: సెల్‌నం: 9848482646రాజేంద్రనగర్‌

నియోజకవర్గం: రాజేంద్రనగర్‌
నియోజకవర్గం విస్తీర్ణం:
మున్సిపాలిటీలు: రెండేళ్లక్రితం వరకు రాజేంద్రనగర్‌ మున్సిపాలిటీగా ఉండేది. ప్రస్తుతం సర్కిల్‌గా మారి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం అయింది.
ప్రాధాన్యాలు: పరిశోధనా సంస్థలు
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపుపొందిన రాజేంద్రనగర్‌ పరిశోధనా రంగంలో ప్రపంచఖ్యాతిని పొందింది. వ్యవసాయ ఉత్పత్తుల గురించి తెలుసుకునేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌ ఇక్కడికి వచ్చారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా రంగంలో ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రసిద్ధి పొందింది. దీంతో పాటు నారం, ఎన్‌ఐఆర్‌డీ, శంషాబాద్‌లో కేంద్ర విత్తన పరిశోధనాకేంద్రం ఉంది. మరోవైపు ఔటర్‌రింగురోడ్డుతో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం తన ప్రత్యేకతను చాటుతోంది.
గ్రామాలు: మణికొండ, పుప్పాలగూడ, నెక్నాపూర్‌, ఖానాపూర్‌, కోకాపేట
శేరిలింగంపల్లి

ఈ నియోజకవర్గం పరిధిలో చందానగర్‌, మియాపూర్‌, లింగంపల్లి ప్రాంతాలున్నాయి.
చేవెళ్ల నియోజకవర్గం


చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్‌ మండలంలోని చిల్కూరులో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం.
మండలాలు: చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, నవాబుపేట, షాబాద్‌ మండలాలు ఉన్నాయి.
సహజవనరులు: చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, నవాబుపేట మండలాల్లో ఇసుక, కంకరరాయి, ముల్తానీమట్టి, బిల్డింగ్‌ స్టోన్‌, ఆర్డినరీ క్లే, ఇటుక మట్టి, ఇసుక లభిస్తున్నాయి.
రైల్వే స్టేషన్లు: శంకర్‌పల్లి మండలంలోని శంకర్‌పల్లిలో, నవాబ్‌పేట మండలంలోని గుల్లగూడ, చిటిగిద్దలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
నియోజకవర్గం పేరు: చేవెళ్ల
ఏర్పడిన సంవత్సరం: 1952
ప్రధాన ఆలయాలు: చిలుకూరు బాలాజీ దేవాలయం (మొయినాబాద్‌ మండలం),
లక్ష్మీవెంకటేశ్వర దేవాయలం (చేవెళ్ల), సీతారామ దేవాలయం (షాబాద్‌ మండలం)
ప్రభుత్వ ఆసుపత్రులు
చేవెళ్ల- ఏరియా ఆసుపత్రి-1, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(ఆలూరు)-1
శంకర్‌పల్లి- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -2 (టంగటూరు, శంకర్‌పల్లి)
షాబాద్‌- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -2 (షాబాద్‌, చందన్‌వెళ్లి)
మొయినాబాద్‌- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -2 (మొయినాబాద్‌, పెద్దమంగళారం)
నవాబుపేట్‌- ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు -1 (నవాబుపేట్‌)
షాబాద్‌ మండలం వివరాలు
షాబాద్‌ మండలం నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.
శంకర్‌పల్లి మండల సమాచారం.
విద్య: మండలంలో 11 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 9 ప్రాధమికోన్నత పాఠశాలలు, 34 ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి.మొత్తం 54 పాఠశాలల్లో సుమారు 5150 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.126 మంది ఉపాధ్యాయులు ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలో, 128 మంది ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు.మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లేక పోవడంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు.ఆదర్శ పాఠశాల భవనం నిర్మాణ దశలో ఉంది. .
వైద్యం: మండలంలో శంకర్‌పల్లి, టంగటూర్‌ గ్రామాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
వ్యవసాయం:
శంకర్‌పల్లి మండలం రాజధానికి అతి సమీపంలో ఉండడంతో భూములకు మంచి ధరలు పలుకుతున్నాయి. నగరానికి చెరువలో ఉన్న జన్వాడ, మిర్జాగూడ, మహారాజ్‌పేట్‌ , మోకిల, కొండకల్‌, ప్రొద్దుటూరు తదితర గ్రామాల్లో 70 శాతం భూములు రైతులు ఇప్పటికే వ్యాపారస్థులకు అమ్మేశారు.మండలంలోని సగానికి పైగా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం.శంకర్‌పల్లి, రామంతాపురం, చందిప్ప, ఎల్వర్తి, టంగటూర్‌, పర్వేద, సంకేపల్లి, మాసానిగూడ, అంతప్పగూడ, కొత్తపల్లి , మహాలింగాపురం, లక్ష్మారెడ్డిగూడ, గాజులగూడ గ్రామాల్లో వ్యవసాయమే ప్రధార ఆధారం. ప్రత్తి, మెక్కజొన్న, పంటలను పండిస్తారు.మూసీ వాగు సమీపంలో ఉన్న పోల్లాలో నీటి సదుపాయం ఉండడంతో కూరగాయాల సాగు చేస్తారు.

మీ సేవా కేంద్రాలు:
మండలంలో 4 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. దొంతాన్‌పల్లి, మోకిల, శంకర్‌పల్లి, మహాలింగాపురం గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు ఉన్నాయి.
రైల్వే స్టేషన్‌:
శంకర్‌పల్లిలో రైల్వేస్టేషన్‌ ఉంది.శంకర్‌పల్లి నుంచి వికారాబాద్‌, హైదారాబాద్‌ వెళ్లేందుకు పలు రైలు ఉదయం , సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు.రైల్వే స్టేషన్‌ శిధిలావస్థకు చేరుకోవడంతో ఆధునీకీకరణ కోసం రూ.3 కోట్లతో పనులు ప్రారంభించారు.
నవాబుపేట మండల వివరాలు..
మండలంలో మొత్తం గ్రామాలు- 36
మండలంలో మొత్తం గ్రామ పంచాయతీలు -21
మండలంలో ఎంపిటీసి స్థానాలు మొత్తం- 11
జెడ్పీటీసి స్థానాలు- 1

పరిగి నియోజకవర్గం


మండలాలు: పరిగి నియోజకవర్గం పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూరు, గండేడ్‌ మండలాల పరిధితో ఏర్పాటయింది.
ఈ నియోజకవర్గంలోని పరిగి, కుల్కచర్ల, దోమ, గండేడ్‌, పూడూరు మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, గ్రానైట్‌, బ్రిక్‌ ఎర్త్‌, ఇసుక, ముల్తానీమట్టి లభిస్తున్నాయి.
పరిగి మండల సమాచారం
* పరిగి మండల భౌగోళిక విస్తీర్ణం - 22,309 హెక్టార్లు
* అటవీ భూమి - 1852 హెక్టార్లు
* సాగుభూమి - 11,116 హెక్టార్లు
* బంజరు భూమి - 817 హెక్టార్లు
* నేలలు - 60% నల్లరేగడి, 40% చెల్కనేలలు
* రైతుల సంఖ్య - 9398
* నీటి సదుపాయం - 60% వర్షాధారం, 40% బోరుబావులు
* ప్రధాన పంటలు - వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, పసుపు, కంది, జొన్న
పంచాయతీలు
* పరిగి మండలంలో 22 పంచాయతీలు
* రెవిన్యూ గ్రామాలు - 37
* ఎంపీటిసి స్థానాలు -16
పొదుపు సంఘాల వివరాలు
స్వయం సహాయక సంఘాల సంఖ్య - 853
సభ్యుల సంఖ్య - 10,223
పరిగి విద్యా రంగం
మండలంలో ప్రాథమిక పాఠశాలలు - 47
ప్రాథమికోన్నత పాఠశాలలు - 08

అటవీశాఖ
మొత్తం అటవీ విస్తీర్ణం - 4615 హెక్టార్లు
పరిగి పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఐదు మండలాలున్నాయి. 284 రోడ్లు 650కి.మీ దూరం కలిగి ఉన్నాయి.
ఆర్‌అండ్‌బీ రహదారులు
పరిగి డీఈఈ పరిధిలో 22రోడ్లు, 343కి,మీ దూరం ఉన్నాయి. బి.టి లేకుండా 24కి.మీ దూరం ఉన్నాయి.
దోమ మండల సమాచారం
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు-1
* ఉపకేంద్రాలు-8
*బ్యాంకులు-3
* మీసేవాకేంద్రాలు-4
* దేవాలయాలు-4
* ఖరీఫ్‌ సాధారణ సాగు 2177 ప్రస్తుత సాగు 1634
* చెరువులు-ఇరిగేషన్‌ పరిధిలో 5
* పంచాయతీరాజ్‌ పరిధిలో 20
* పాఠశాలలు
ప్రాథమిక-57 ప్రాథమికోన్నత-7 ఉన్నత-10 వసతి గృహాలు-2 కస్తూరీభా గాంధీ బాలిక వసతిగృహం.
గండేడ్‌ మండల సమాచారం
మండల విస్తీర్ణం-57,765 ఎకరాల 30గుంటలు
గ్రామ పంచాయతీల సంఖ్య-24
రెవెన్యూ గ్రామాల సంఖ్య-29
అనుబంధ గ్రామాల సంఖ్య-59
వార్డుల సంఖ్య- 256
ఎంపీటీసీ స్థానాల సంఖ్య- 18
పోలింగ్‌కేంద్రాల సంఖ్య- 51
ఖరీఫ్‌సాగు వివరాలు:
పంట సాధారణసాగు (ఎకరాల్లో) అవుతోన్న సాగు ఎకరాల్లో..
వరి- 1539 - 3024
ïన్న - 1284 - 1440
మొక్కజొన్న- 138 - 215
రాగులు- 348 - 285
కందిపప్పు- 1244 - 1155
పెసళ్లు- 18 - 24
మినుములు- 34 - 25
పత్తి- 47 - 58
ఆముదాలు- 92 - 38
ఇతరములు- 503- 95
రబీసాగు వివరాలు
పంటలు - సాధారణసాగు - అవుతోన్న సాగు ఎకరాల్లో
వరి - 1539 - 1909
జొన్న- 1284 - 62
మొక్కజొన్న - 138- 82
రాగులు- 348- 50
వేరుశనగ- 6662- 7570
కుల్కచర్ల మండలం వివరాలు
గ్రామ పంచాయితీలు 29
1) కుల్కచర్ల 2)రాంనగర్‌ 3)బండవెల్కిచర్ల 4)చెల్లాపూర్‌ 5)ఘణాపూర్‌ 6)సాల్వీడ్‌ 7)బొంరెడ్డిపల్లి 8)కామన్‌పల్లి 9)పీరంపల్లి 10)ముజాహిద్‌పూర్‌ 11)రాంరెడ్డిపల్లి 12)లింగంపల్లి 13)అడవివెంకటాపూర్‌ 14)తిర్మలాపూర్‌ 15)చౌడాపూర్‌ 16)వీరాపూర్‌, 17)మందిపల్‌ 18)మరికల్‌ 19)చాకల్‌పల్లి 20)మక్తవెంకటాపూర్‌ 21)కొత్తపల్లి 22)కన్మన్‌కాల్వ 23)మల్కాపూర్‌ 24)ఇప్పాయిపలి 25)రాంపూర్‌ 26)కుస్మసముద్రం 27)అనంతసాగర్‌ 28)పుట్టపహడ్‌ 29)అంతారం
ఎంపీటీసీ స్థానాల వివరాలు- 17 కుల్కచర్ల 1 కుల్కచర్ల 2 బండవెల్కిచర్ల అంతారం పుట్టపహడ్‌ కుస్మసముద్రం కామన్‌పల్లి ముజాహిద్‌పూర్‌ చౌడాపూర్‌ మందిపల్‌ మరికల్‌ 1 మరికల్‌ 2 కన్మన్‌కాల్వ తిర్మలాపూర్‌, రాంపూర్‌ సాల్వీడ్‌ కొత్తపల్లి వార్డుల సంఖ్య 280
చిన్ననీటి పారుదల శాఖ వివరాలు
మైలమ్మ చెరువు (కుల్కచర్ల), కామునిచెరువు(కామన్‌పల్లి), దంతెకానిచెరువు(
ముజాహిద్‌పూర్‌), పాటిమీది చెరువు(అంతారం), చింతల్‌చెరువు(మరికల్‌), అక్కమ్మచెరువు(ముజాహిద్‌పూర్‌), ఘణాపూర్‌(ఘనాపూర్‌), ఇప్పాయిపల్లి( ఇప్పాయిపల్లి), పుట్టపహడ్‌(పుట్టపహడ్‌), చెల్లాపూర్‌(చెల్లాపూర్‌), దంతెకాని చెరువు(అల్లాపూర్‌), కుస్మసముద్రం(కుస్మసముద్రం)
మీ సేవా కేంద్రాలు కుల్కచర్ల 9441570909 ప్రధాన చౌరస్తా సమీపంలో మీ సేవా కేంద్రం 9573006685
ప్రభుత్వ వసతి గృహాలు కుల్కచర్ల బీసీ వసతి గృహం, అంతారం బీసీ వసతి గృహం, కుల్కచర్ల ఎస్టీ వసతి గృహం, మరికల్‌ ఎస్సీ వసతి గృహం ముజాహిద్‌పూర్‌ బీసీ వసతి గృహం, ముజాహిద్‌పూర్‌ బీసీ వసతి గృహం కొత్తపల్లి, రాంపూర్‌ గిరిజన ఆశ్రమ పాఠశాల, బండవెల్కిచర్ల గిరిజన ఆశ్రమ పాఠశాల
కుల్కచర్ల సందర్శనీయ స్థలాలు
పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం (బండవెల్కిచర్ల) కుల్కచర్ల మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీనిని ఏకశిలా పర్వతంగా పిలుస్తుంటారు. ఇక్కడ శివలింగం, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి కొలువై ఉన్నారు.
ఉపమార్కెట్‌ యార్డ్‌ కుల్కచర్ల మండల కేంద్రంలో ఉపమార్కెట్‌ యార్డ్‌ ఉంది. ఇది 13 సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీని ఆదాయం సంవత్సరానికి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది. ఈ ఆదాయాన్ని పరిగి మార్కెట్‌లో కలుపుతారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుల్కచర్ల, ఉపకేంద్రాలు కుల్కచర్ల, పుట్టపహడ్‌, బండవెల్కిచర్ల, పుట్టపహడ్‌, ముజాహిద్‌పూర్‌, తిర్మలాపూర్‌, చౌడాపూర్‌, మందిపల్‌, కుస్మసముద్రం, మరికల్‌, కొత్తపల్లి, పశువైద్యశాల కుల్కచర్ల, ఉపకేంద్రాలు ముజాహిద్‌పూర్‌, చౌడాపూర్‌, మరికల్‌, పుట్టపహడ్‌
వ్యవసాయ శాఖ వివరాలు కుల్కచర్ల మండలంలో రబీ సాధారణ సాగు వివరాలు ప్యాడి 1158, జోవార్‌, 12 హెక్టార్లు మైజ్‌ 59 హెక్టార్లు, రాగి 36 హెక్టార్లు, వేరుసెనగ 1022 హెక్టార్లు, ఖరీఫ్‌ సాధారణ సాగువివరాలు.. వరి 1274, జోవార్‌ 942, మైజ్‌ 1420, రాగి 533, రెడ్‌గ్రామ్‌ 572, కాస్టర్‌ 134 హెక్టార్లు
పూడూరు మండల సమాచారం
దేవాలయాలు: దామగుండం శ్రీరామలింగేశ్వర దేవాలయం పేరుగాంచింది. హైదరాబాద్‌ నుంచి 75 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఏటా ఉగాది పండగా ముందు వారం రోజుల పాటు జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ నావికాదళం రాడర్‌ కేంద్రం ఏర్పాటు అవుతుండటంతో మరింతగా ప్రాధాన్యత లభించనుంది. దీంతో పాటు పూడూరు గేటు సమీపంలో ఉన్న శ్రీసాయి మందిరంలో ప్రతి గురువారం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. ప్రతివారం 200 మంది పేదలు వైద్యం పొందుతున్నారు.
ఆసుపత్రులు-2. పూడూరు,. చన్‌గోముల్‌లో ప్రాథమీక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
పాఠశాలలు-50. జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలు-8. ప్రాథమీకోన్నత పాఠశాలలు 6. ప్రాథమిక పాఠశాలలు 36. ఉండగా ఎన్కెపల్లి సమీపంలో హిట్స్‌ కళాశాల ఉపాధ్యాయ శిక్షణకేంద్రం. కేశవరెడ్డికి చెందిన కార్పోరేట్‌ విద్యాసంస్థ మన్నెగూడలో ఉంది.
వ్యవసాయం సాగుభూమి-15 వందల హెక్టార్లు
రహదారులు ఆర్‌ఆండ్‌బీ రోడ్లు పూడూరు మండలంలో 50 కిలోమీటర్లు ఉండగా పంచాయిత్‌రాజ్‌ రోడ్లు-86. కిలోమీటర్లు విస్తీర్ణం కలిగిఉంది
మండలంలోని మీసేవా కేంద్రాలు-4. చన్‌గోముల్‌ ఫోన్‌నెం, 9949297201. పూడూరు-9666610618, మన్నెగూడ-9177451155, కంకల్‌-9177389143

వికారాబాద్‌ నియోజకవర్గం


మండలాలు: వికారాబాద్‌ నియోజకవర్గంలో వికారాబాద్‌ మున్సిపాలిటీ, వికారాబాద్‌, మర్పల్లి, మోమిన్‌పేట, ధారూర్‌, బంట్వారం మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలోని వికారాబాద్‌ మండలం అలంపల్లిలో పేరొందిన అలంపల్లి మఠం ఉంది.
సహజవనరులు: వికారాబాద్‌, ధారూర్‌, మర్పల్లి, మోమిన్‌పేట, బంట్వారం మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఇసుక, ఆర్డినరీ క్లే, ముల్తానీ మట్టి, ఇటుక మట్టి(బ్రిక్‌ ఎర్త్‌), సున్నపురాయి లభిస్తున్నాయి.
రైల్వేస్టేషన్లు: మర్పల్లి మండలంలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలంలోని సదాశివపేట రోడ్‌లో, ధారూర్‌ గాడంగూడలో, వికారాబాద్‌లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
వికారాబాద్‌ నియోజకవర్గం
వికారాబాద్‌ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. వికారాబాద్‌, ధారూర్‌, మర్పల్లి, మోమిన్‌పేట్‌, బంట్వారం. . ప్రధాన దేవాలయం అనంతగిరిలోని శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయం. ఎస్‌ఏపీ కళాశాలతోపాటు అన్వర్‌ ఉలూమ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, సాయిడెంట్‌ కళాశాల శ్రీనివాస పార్మసిటికల్‌ కళాశాల, హిట్స్‌, సెయింట్‌జూడ్స్‌, నవాబ్‌షా ఎడ్యుకేషన్‌ బీఎడ్‌ కళాశాలలు, జిల్లా విద్యాశిక్షణ కళాశాల(డైట్‌)పాలిటెక్నికల్‌ కళాశాలలతోపాటు సరస్వతీ, సిద్దార్థ, నలంద, వికాస్‌, గౌతమి, విద్యాసాగర్‌, తక్షశిల కళాశాలలు ఉన్నాయి. మోమిన్‌పేట, మర్పల్లిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వికారాబాద్‌లో 50 పడకల ఏరియా ఆసుపత్రిని 100 పడకలకు పెంచారు. మర్పల్లిలో కమ్యూనిటీ ఆసుపత్రికాగా మోమిన్‌పేట, బంట్వారం, పట్లూర్‌, ధారూర్‌, నాగసమందర్‌, సిద్దూలూర్‌లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వికారాబాద్‌ అగ్నిమాప కేంద్రం ఒకటి ఉంది. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో విశ్రాంతి గృహం, అనంతగిరిలో అటవీ శాఖ విశ్రాంతి గృహం ఉన్నాయి.
1956లో వికారాబాద్‌కు విద్యుత్తు
1956లో వికారాబాద్‌కు తొలిసారిగా విద్యుత్తు సౌకర్యం సమకూరింది. ప్రస్తుత సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాటి గవర్నర్‌ చందూలాల్‌ మాధవరావ్‌ త్రివేది విద్యుత్తు సరఫరాను ప్రారంభించారు. 1965లో కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రిగా కొనసాగిన మర్రి చెన్నారెడ్డి రూ.67 లక్షల వ్యయంతో కోట్‌పల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1967లో పనులు పూర్తిచేసి రైతులకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. వికారాబాద్‌లో అక్టోబరు 2, 1962లో జిల్లా గ్రంథాలయ భవనానికి, జూన్‌ 18, 1967లో స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి నాటి కేంద్ర మంత్రి మర్రిచెన్నారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. క్రమక్రమంగా పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆచార వ్యవహారాల్లోను మార్పులు వచ్చాయి. ప్రజల జీవనసరళి మారింది. 1980లో ఇందిరాగాంధీ దళితుల కోసం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. సాగునీటి కోసం బావులు తవ్వించింది. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవవుతూ వచ్చాయి. అక్షరాస్యత శాతం పెరిగింది. ప్రధాన రోడ్డుమార్గాలు ఏర్పడ్డాయి. 1954లో వికారాబాద్‌ పురపాలక సంఘంగా ఏర్పడింది. ముద్ద వీరమల్లప్ప తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

శాటిలైట్‌ టౌన్‌షిప్‌గా..
వికారాబాద్‌ శాటిలైట్‌ టౌన్‌గా రూపొందించేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం దాదాపు రూ.186 కోట్లతో అండర్‌డ్రైనేజీ, తాగునీటి సౌకర్యానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.
మండలాల్లో ప్రాజెక్టులు... ఆలయాలు
మోమిన్‌పేట మండలంలో నందివాగు ప్రాజెక్టు, మర్పల్లి మండలంలో కొంషెట్‌పల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. మోమిన్‌పేట మండలంలో వెల్‌చాల్‌గుట్టలో లక్ష్మినర్సింహ స్వామ,ి ఎన్కతలో శనైశ్వర ఆలయాలువున్నాయి. .
బంట్వారం మండలం
18 గ్రామ పంచాయతీలు, 10 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. బంట్వారం, కొత్తపల్లి, నాగసాన్‌పల్లి చెరువులు వ్యవసాయానికి సాగునీటిని ఇస్తున్నాయి. ఇక్కడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 8, ప్రాథమికోన్నత పాఠశాలలు 4, ప్రాథమిక పాఠశాలలు 27, కస్తూర్బా బాలికల పాఠశాల 1, మోడల్‌ పాఠశాల ఒకటి ఉన్నాయి. మొత్తంగా 4323 మంది విద్యార్థులు చదువుతున్నారు.

తాండూరు నియోజకవర్గం


మండలాలు: ఈ నియోజకవర్గం పరిధిలో తాండూరు మున్సిపాలిటీ, తాండూరు, పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌ మండలాలు ఉన్నాయి. తాండూరు మండలం జుంటపల్లిలో శ్రీరామచంద్రస్వామి ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది.
సహజవనరులు: తాండూరు, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌ మండలాల్లో సున్నపురాయి, ఆర్డినరీ క్లే, షాబాద్‌ స్టోన్‌, ముల్తానీ మట్టి(ఫుల్లర్స్‌ ఎర్త్‌), బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఆర్డినరీ క్లే, ఇసుక తదితర సహజ వనరులు లభిస్తున్నాయి.
రైల్వే స్టేషన్లు: తాండూరులో పెద్దేముల్‌ మండలంలోని రుక్మాపూర్‌లో, బషీరాబాద్‌ మండలంలోని మైలారం, నవాన్‌డగ్‌లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
తాండూరు నియోజకవర్గం
తాండూరు నియోజకవర్గ విస్తీర్ణం 36 కిలో మీటర్లు. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి పురపాలక సంఘంతో పాటు తాండూరు, పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌ మండలాలతోపాటు 90 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పురపాలక సంఘంలో 31 వార్డులు ఉన్నాయి. రాష్ట్రానికి సరిహద్దులో ఉంది. పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రానికి చేరువలో ఉంది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. 44,453 హెక్టార్లలో పంటలను సాగుచేస్తారు. 22 శాతం మంది రైతులు బోరు బావుల కింద వ్యవసాయం చేస్తే మిగతా 78 శాతం మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తారు. నియోజక వర్గంలో రేగడి, చెల్క నేలలు ఎక్కువగా ఉన్నాయి. రైతులు ప్రధానంగా కందులు, పెసలు, మినుములు, కూరగాయలు, వరి,జొన్న పంటలను పండిస్తారు. తాండూరు ప్రాంతంలో సాగుచేసే కందికి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. వర్షాలు కురువకుంటే పంటలు పండించే పరిస్థితి లేక ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళతారు.

బషీరాబాద్‌ మండల సమాచారం
బషీరాబాద్‌ మండలం జిల్లాకు చివరన కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉంది. ఇక్కడి ప్రజలు వ్యవసాయంపైనే అధికశాతం ఆధారపడి ఉన్నారు. మండలంలో నాలుగు గ్రామాల్లో నాపరాయి గనులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 16 గ్రామ పంచాయతీలు, 32 అనుబంధ గ్రామాలు ఉన్నాయి.
విద్యారంగం
ఈ మండలంలో మొత్తం 63 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 194 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు.
వ్యవసాయం
బషీరాబాద్‌ మండలంలో 25 వేల ఎకరాల్లో వ్యవసాయ సాగు విస్తీర్ణం ఉంది. ప్రధానంగా కంది, పత్తి, మిరప, పెసర, మినుము, మొక్కజొన్న పంటలను పండిస్తారు. మండలంలో 11 పెద్ద చెరువులు, 20 వరకు చిన్న చెరువులు, కుంటలున్నాయి. నవాంద్గీ, ఇందర్‌చేడ్‌, జీవన్గీలలో ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. మండల కేంద్రంతోపాటు నవల్గాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రముంది.
పెద్దేముల్‌ మండలం సమాచారం
మండలంలో మొత్తం 65 పాఠశాలలు ఉండగా 254 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మండలంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 9 ఉపకేంద్రాలు ఉన్నాయి.సాగునీటి వనరులు: మండలంలో కోట్‌పల్లి ప్రాజెక్టు ఉంది. దీని సాగు విస్తీర్ణం 9200 ఎకరాలు. ప్రస్తుతం 6వేల ఎకరాలకే పరిమితమైంది. ఇక చెరువుల నాలుగు ఉండగా కుంటలు 34 ఉన్నాయి. ప్రధానంగా కంది, పెసర, మినుము, పత్తి, చెరకు సాగు చేస్తున్నారు. ఈ మండలంలో మండల పరిషత్‌ రోడ్లు 20 కి.మీ, జిల్లా పరిషత్‌ రోడ్లు 42 కి.మీలు ఉన్నాయి. 32 చౌకధర దుకాణాలు, 16 పోస్టాఫీసులు ఉన్నాయి. మండలంలోని మారేపల్లి, ఇందోల్‌, జనగాం,రుదార్రం, నర్సాపూరు, గోపాల్‌పూర్‌ గ్రామాల్లో సుద్ద ఖనిజం లభిస్తోంది. సుద్దను సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, నూనెలను శుద్ధి చేయడానికి వాడుతారు. మలేషియా, సింగపూర్‌లకు ఎగుమతి అవుతోంది. తట్టేపల్లి, పాషాపూర్‌ గ్రామాల్లో ఎర్రమట్టి లభ్యమవుతోంది. దీన్ని సిమెంటు తయారీలో ఉపయోగిస్తున్నారు. తాండూరులోని సిమెంటు పరిశ్రమలకు ఎర్రమట్టి ఎగుమతి అవుతోంది.
తాండూరు మండల సమాచారం
జిన్‌గుర్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. కస్తూర్బాగాంధీ పాఠశాల పట్టణంలో కొనసాగుతోంది. మండలంలో నాలుగుఉన్నత పాఠశాలలు, 13 ప్రాథమికోన్నత, 46 ప్రాథమిక బడులు ఉన్నాయి. వీటిలో దాదాపు 12 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మండలంలో సుమారు 15 వేలకుపైగా ఎకరాల్లో రైతులు వ్యవసాయం చేస్తారు. కంది పంటను ప్రధానంగా సాగు చేస్తారు. దీంతోపాటు పెసర, మినుము, ఉల్లి, వరి, పత్తి, జొన్న పంటలను పండిస్తారు. మండలంలో పెన్నాఇండియా సిమెంట్స్‌ పరిశ్రమలు ప్రైవేటు రంగంలో, సీసీఐ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. వీటితోపాటు వెయ్యికిపైగా నాపరాతి పరిశ్రమలు కొనసాగుతున్నాయి. నాలుగు గ్రామాల్లో ఐదువందలకుపైగా ఎకరాల్లో నాపరాతి గనులు ఉన్నాయి.
యాలాల మండల సమాచారం
విద్యాపరంగా చూస్తే 50 ప్రభుత్వ ప్రాథమిక, 3 ప్రాథమికోన్నత, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. రెండు ప్రైవేటు ఉన్నతపాఠశాలలు, 3 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. యాలాల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ మండలంలో 19812.5 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. మండలంలోని జుంటుపల్లి గ్రామంలో ప్రఖ్యాతి గాంచిన రామస్వామి దేవాలయం ఉంది.


జిల్లా వార్తలు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.