Wednesday, February 10, 2016

Untitled Document

Untitled Document
Comments
0
Recommend
1
Views
707
వెళ్లొస్తాం..
న్యూస్‌ట్యుడే విశాఖపట్నం
భౌగోళికంగా విడివిడిగా ఉన్నా.. మహా సాగరాల్లో మనమంతా ఒక్కటే అన్న నినాదం మారుమోగించి.. విశాఖ సాగర తీరాన మనతో మమేకమై.. మన ఆతిథ్యానికి మెచ్చి.. జనంతో సందడి చేసి.. తమ అద్భుత విన్యాసాలతో కనువిందు చేసిన సాగర మిత్రులు మంగళవారం స్వస్థలాలకు పయనమయ్యారు. భారత నావికాదళ అధికారులు సాగరంలో వందకిలోమీటర్ల వరకు వెళ్లి దేశ విదేశీ యుద్ధ నౌకలకుఘనమైన వీడ్కోలు పలికారు.

అరుదైన అతిథులు.. అబ్బురపరిచే నౌకలు.. విదేశీహొయలు.. ఎల్లలన్నీ చెరిపేసుకుని.. ఐక్యవేదికపై సాగాయి అంతర్జాతీయ యుద్ధ నౌకా సమీక్ష (అ.నౌ.స.) సంబరాలు. దేశ, దేశాల నుంచి విచ్చేసిన అతిరథ మహారథులంతా ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకూ నగరంలో విడిది చేశారు. ఎన్నో విన్యాసాలు, మరెన్నో విశేషాలు, సుందరమైన విశాఖ నగరంలో మధురమైన జ్ఞాపకాలు.. ఎన్నో సంగతులను మూటకట్టుకొని మంగళవారం వేకువజామున ఉషోదయ కిరణాలు ప్రసరిస్తుండగానే పలు దేశాల నౌకలు విశాఖ తీరం నుంచి పయనమయ్యాయి. ఒకవైపు అ.నౌ.స. విన్యాసాల విజయ దరహాసం.. మరోవైపు వీడలేక వీడ్కోలు.. వెళ్లొస్తామంటూ కొందరు ప్రతినిధులుయుద్ధనౌకల్లో, మరికొందరు విమానాల్లో తవ స్వదేశాలకు తిరుగు ప్రయాణమయ్యారు.అ.నౌ.స.తో భారతీయ సంస్కృతిని, యుద్ధ నైపుణ్యాలను, నావికాదళ ప్రత్యేకతలను తెలుసుకున్నామని ఈ సందర్భంగా అతిథులంతా కొనియాడటం విశేషం.

విశాఖ ప్రజల సహకరంతోనే విజయం
విశాఖ ప్రజల సహకారం వల్లే అ.నౌ.స.ను విజయవంతంగా నిర్వహించగలిగాం. అందరికీ ఇందుకు ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌, వారి అధికారులు గొప్ప సహకారం అందించారు. ఎంతో క్లిష్టమైన ఈ వేడుకలో అందరూ సమన్వయంతో సాగడం ద్వారానే విజయవంతంగా సాగింది. విశాఖపట్నం దేశంలోనే అత్యంత అందమైన నగరం. పారిశుద్ధ్య నిర్వహణ ఎంతో బాగుంది. నగరాభివృద్ధికి నావికాదళం తరపున పూర్తి సహకారం ఉంటుంది.

అలా.. ముగిసింది
విదేశీ ప్రతినిధులకు తీపి జ్ఞాపకంగా అ.నౌ.స.
అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష అంగరంగ వైభవంగా ముగిసింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన యుద్ధ నౌకలు మంగళవారం తెల్లవారుజాము నుంచి ఇంటిదారి పట్టాయి. సోమవారం రాత్రి భారత నౌకాదళం విదేశీ ప్రతినిధులకు జ్ఞాపికలను అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక విందు ఆకట్టుకుంది. పలు దేశాల నావికా దళాల బ్యాండు బృందాలు వీనులవిందైన సంగీతాన్ని ఆలపించి ఆకట్టుకున్నాయి. మణిపురి నృత్యం ప్రత్యేకంగా నిలిచింది. ఈ నెల 4న ప్రారంభమైన అ.నౌ.స.లో 50 దేశాల నుంచి వందలాది మంది నావికాదళ ప్రతినిధులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నెల 6న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ యుద్ధనౌకల సమీక్ష, 7న ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషనల్‌ డెమో, అంతర్జాతీయ నగర కవాతును వీక్షించారు. ఈ వేడుకలు పూర్తయ్యే వరకూ తూర్పు నావికాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ సతీష్‌ సోనీ సతీమణి, నవా అధ్యక్షురాలు సైతం ప్రత్యేక బాధ్యతలు తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల సతీమణులకు భారతీయ సంప్రదాయాలను పరిచయం చేశారు. ‘కాఫీ ఈవ్నింగ్‌’ పేరిట వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు విదేశీ మహిళలు సైతం భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీరలు ధరించి హాజరవడం విశేషం. ఈ సందర్భంగా బాలీవుడ్‌ గీతాలకు మహిళలు నృత్యాలు ప్రదర్శించి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అలాగే, వివిధ నౌకల్లో నగరానికి వచ్చిన ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సతీష్‌ సోనీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం రాత్రి జరిగిన ముగింపు వేడుకల్లో సతీష్‌ సోనీ, భారత నావికాదళాధిపతి ధోవన్‌ విదేశీ ప్రతినిధులతో కలిసి కేకును కత్తిరించారు.

యువ నావికులకు గొప్ప అనుభవం
తూర్పు నౌకాదళాధిపతి సతీష్‌ సోనీ
ప్రపంచానికి శాంతి సందేశాలు ఇవ్వడమే కాదు, నావికాదళంలో ప్రవేశించే యువ సైలర్లకు రాటుదేలే శిక్షణ ఇవ్వడంలో తెరచాప(సెయిలింగ్‌) బోట్లు కీలక భూమిక పోషిస్తున్నాయని తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ సతీష్‌ సోనీ పేర్కొన్నారు. మంగళవారం విశాఖ సముద్ర జలాల్లో ‘సైల్‌ ఇన్‌ కంపెనీ’ అనే కార్యక్రమం నిర్వహించారు. అ.నౌ.సలో పాల్గొన్న ఐఎన్‌ఎస్వీ మాధేయి, తరంగిణి, సుదర్శిణి నౌకలకు ఫ్లాగ్‌ ఆఫ్‌ ద్వారా సతీష్‌ సోనీ వీడ్కోలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సమీక్ష నిర్వహించిన ఐఎన్‌ఎస్‌ సుమిత్ర యుద్ధనౌకపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్‌ సోనీ నగరంలోని ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి చేతక్‌ హెలికాప్టర్‌లో నేరుగా సముద్రంలో ప్రయాణిస్తున్న సుమిత్ర నౌకపై దిగారు. అనంతరం మూడు తెర చాప నౌకలకు ఫ్లాగ్‌ ఆఫ్‌ చేశారు. చెన్నైలో ఉన్న మరో అధికారిక కార్యక్రమంలో ఈ మూడు నౌకలు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా సతీష్‌ సోనీ నౌకలో ఉన్న విలేకర్లతో మాట్లాడుతూ.. నావికాదళంలో శిక్షణ పొందే యువ కేడెట్లకు ఈ తెరచాప నౌకలు మంచి శిక్షణ ఇస్తాయన్నారు. సముద్రంలో గాలివాటం, ఉద్వేగంగా ఉండే అలల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మాధేయి, సుదర్శిని, తరంగిణినిలకు ప్రపంచాన్నే చుట్టిన ఘనత ఉందన్నారు. అ.నౌ.స. యువ సైలర్లకు గొప్ప అనుభవాన్ని, అనుభూతిని మిగిల్చిందన్నారు.

Untitled Document
రథసప్తమి వేడుకలకు రాజుపాలెం ముస్తాబు
ప్రభుత్వ గురుకుల ఉద్యోగులు ఉద్యమించాలి
రిజిస్ట్రేషన్లశాఖ ప్రైవేటీకరణ చర్యలు సరికాదు
సంస్కారం అందించే విద్యను నేర్పించాలి
గోడపత్రిక విడుదల
విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం తొలిప్రాధాన్యం
నేడు, రేపు నులిపురుగుల మందు పంపిణీ
చెరకు రైతులకు రూ.36 కోట్ల మేర చెల్లింపులు
లింగభూపాలపురఅగ్రహారంలో మహిళ హత్య
రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత
పని తీరు మార్చుకోకపోతే ఇంటికే
వైద్యవిధాన పరిషత్తులోకి ఐదు ఆసుపత్రులు
జిల్లాకు 5 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు
‘మతం... నమ్మకం... వ్యక్తిగతం’
‘మెరుగైన వేతనాల కోసం పోరాడతాం’
కేంద్ర కారాగారంలో పూర్తిస్థాయి పాడిపరిశ్రమ
ఉరివేసుకొని వ్యక్తి బలవన్మరణం
ఎ.యు.లో అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
నగరం ఆకర్షణీయ(స్మార్ట్‌సిటీ) వైపుగా పరుగులు!
అప్పన్న ఆభరణాల ప్రదర్శనకు ప్రయత్నాలు
అపూర్వం... పూర్వ విద్యార్థుల నిర్ణయం
ఎన్‌ఎస్‌టీఎల్‌ శాస్త్రవేత్తలకు డాక్టరేట్లు
నేటి నుంచి జాతీయస్థాయి టెన్నికాయిట్‌ పోటీలు
అందరి సహకారంతోనే అభివృద్ధి
పారిశుద్ధ్య పనులకు వాహనాలు సిద్ధం
వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
వర్సిటీలో అక్రమాలపై విచారణ జరిపించండి
సమర్థంగా తరగతులు నిర్వహించండి
ఇసుక ఈ-వేలంపై అవగాహన
కలల వాహనం సొంతం చేసుకోండి
మినీ మాల్స్‌గా రేషను దుకాణాలు
ఇక సముద్రంలో జలవిహారం
వివాహిత ఆత్మహత్య
ఉక్కు ఉద్యోగులకు ప్రధానమంత్రి శ్రమ పురస్కారాలు!
12న అమెరికా రాయబారి గీతం వర్సిటీ సందర్శన
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మూర్తి అభినందనలు
కేథరిన్‌కు ఆస్ట్రేలియా ఛాత్రోపాధ్యాయులు
మాజీసైనికులు, స్వాతంత్య్ర సమరయోధుల
విమ్స్‌కు కదలిక
కొలంబో సదస్సుకు డాక్టర్‌ కూటికుప్పల
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net