latest breaking telugu news
close

తాజావార్తలు

ఫేస్‌బుక్‌ ఛైర్మన్‌గా జుకర్‌బర్గ్‌ను తొలగించాలి..!

న్యూయార్క్‌: ప్రముఖ సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ గత కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. కేంబ్రిడ్జ్‌ అనలిటికా వ్యవహారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌ ఇటీవల మరో వివాదంలో చిక్కుకుంది. ఫేస్‌బుక్‌లో 3కోట్ల మంది యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్‌ సీఈవోగా ఉన్న మార్క్‌ జుకర్‌బర్గ్‌ను ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించాలని వాటాదార్లు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇల్లినాయిస్‌, రోడే ఐలాండ్‌, పెన్సుల్వేనియా, న్యూయార్క్‌కు చెందిన ట్రెజరర్స్‌ ఈ మేరకు ఓ ప్రతిపాదనను తీసుకొస్తున్నారు. మే 2019 జరిగే ఫేస్‌బుక్‌ వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదనను ఉంచాలని భావిస్తున్నారు. అయితే.. దీనిపై ఇప్పటివరకు ఫేస్‌బుక్‌ స్పందించేందుకు నిరాకరించింది. సమాజంలో ఫేస్‌బుక్‌ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఫేస్‌బుక్‌ సామాజిక, ఆర్థిక బాధ్యతలను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల బోర్డులో స్వతంత్ర, జవాబుదారీతనం ఉండే విధంగా మార్పులు చేయాలని వాటాదారులు డిమాండ్‌ చేస్తున్నారు. స్వతంత్ర బోర్డు లేకపోవడం వల్ల ఫేస్‌బుక్‌ మరిన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థ ఫేస్‌బుక్‌కు చెందిన 5కోట్ల మంది ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు భారతీయ వినియోగదారుల సమాచారం కూడా ఉన్నట్లు తేలింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వాల్సిందిగా ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చేసింది. అందుకు గాను జుకర్‌బర్గ్‌ క్షమాపణలు కూడా చెప్పారు.

ఈ వివాదం సద్దుమణగకముందే 5కోట్ల మంది యూజర్ల డేటాను హ్యాకర్లు చోరీ చేసినట్లు గత నెలలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ఫేస్‌బుక్‌ స్పందించింది. ముందుగా చెప్పినట్లు 5కోట్ల ఖాతాలు కాదని, 3కోట్ల మంది యూజర్ల డేటాను హ్యాకర్లు చోరీ చేశారని వెల్లడించింది. కేవలం 4లక్షల మంది యూజర్ల ఖాతాల సాయంతో హ్యాకర్లు 3కోట్ల మంది యూజర్ల డేటాను తెలుసుకున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది.


సినిమా

మరిన్ని

రాజకీయం

జనరల్‌

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.