అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ మరోసారి
close

తాజావార్తలు

అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ మరోసారి
ఈనెల 24-28 మధ్య మళ్లీ ఆఫర్ల వెల్లువ

దిల్లీ: దసరా పండుగ సీజన్‌ను ఈ-కామర్స్‌ సంస్థలు ఘనంగా ప్రారంభించాయి. దిగ్గజ సంస్థలైన అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్’‌తో, ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్ ‌బిలియన్‌ డే’ సేల్‌తో వినియోగదారులకు భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఐదు రోజుల్లోనే దాదాపు రూ.15,000కోట్ల మేర అమ్మకాలు జరిపి సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఆ రెండు సంస్థలు వారం తిరక్కముందే మరోసారి భారీ ఆఫర్లతో వినియోగదారుల ముందుకొస్తున్నాయి. అక్టోబరు 24-28 తేదీల్లో ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ ఫేజ్‌ 2’ నిర్వహించనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది.

ఈ ఐదు రోజుల సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీలతో పాటు పలు యాక్ససరీస్‌పై భారీ డిస్కౌంట్‌ను అందించనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. దీంతో పాటు రెడ్‌మీ 6ఏ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌సేల్‌ను ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపింది. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్‌ ఖాతాదారులు 10శాతం అదనపు రాయితీని పొందవచ్చు. హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి వాసులు అమెజాన్‌ ప్రైమ్‌నౌ యాప్‌ ద్వారా ఏదైనా ఆర్డర్‌ చేస్తే రెండు గంటల్లో డెలివరీ చేసే సదుపాయాన్ని పొందవచ్చు. అమెజాన్‌కు దీటుగా ఫ్లిప్‌కార్ట్‌ కూడా మరోసారి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. ‘ధమాకా డేస్‌’ పేరుతో సేల్‌ను త్వరలో ప్రారంభించన్నట్లు ప్రకటించింది. అయితే ఏయే తేదీలో ఈ ధమాకా డేస్‌ సేల్‌ను నిర్వహించనున్నారనే విషయం మాత్రం తెలియలేదు.

ఈనెల 10 నుంచి 15 తేదీ వరకు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను నిర్వహించగా.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌డే పేరిట 10 నుంచి 14తేదీల్లో ఆఫర్లను నిర్వహించింది. సెల్‌ఫోన్లు, టీవీలు, వాషింగ్‌మెషీన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, దుస్తులపైనా ఈ రెండు పోర్టళ్లు ఆఫర్లు ప్రకటించాయి.


క్రైమ్

మరిన్ని

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.