latest breaking telugu news
close

తాజావార్తలు

జల్లికట్టు న్యాయ పరిధిలో ఉంది: మోదీ
దిల్లీ: జల్లికట్టు తమిళ సంస్కృతిలో భాగమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని రాష్ట్రంలో ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఈరోజు మోదీతో భేటీ అయ్యారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రధానికి కోరారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించిందని... ఈ అంశం న్యాయ పరిధిలో ఉన్నందున ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందేనని వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్‌ ఇవ్వలేమనే సంకేతాన్ని ఇచ్చారు.

పన్నీరసెల్వంతో భేటీ అనంతరం మోదీ ఈ విషయంపై వరుస ట్వీట్లు చేశారు. ‘‘జల్లికట్టు సంస్కృతిని, దాని ప్రాముఖ్యాన్ని అభినందిస్తున్నాం.. కానీ ఈ విషయం కోర్టులో ఉంది. జల్లికట్టు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు కేంద్రం మద్దతిస్తుంది. రాష్ట్రానికి ఏ రకమైన సహాయం కావాల్సి ఉన్నా కేంద్రం అందిస్తుంది. త్వరలోనే తమిళనాడుకు కేంద్ర బృందాన్ని పంపుతున్నాం.’’ అని ప్రధాని తన ట్వీట్లలో పేర్కొన్నారు.

జల్లికట్టుపై నిషేధం ఎత్తేయడానికి వీలైనన్ని రకాలుగా ప్రయత్నిస్తామని, ఆందోళనలు విరమించాలని పన్నీరసెల్వం తమిళ ప్రజలను కోరారు. త్వరలోనే కేంద్రంతో కలిసి చర్యలు తీసుకుంటామన్నారు. మంచే జరుగుతుందని ఆయన విలేకరులకు తెలిపారు.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.