విడుదలకు ముందే నోకియా సంచలనం
close

తాజావార్తలు

విడుదలకు ముందే నోకియా సంచలనం
ఇంటర్నెట్‌డెస్క్‌: ఆండ్రాయిడ్‌ ఫోన్లతో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశిస్తున్న నోకియా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది.మూడేళ్ల తర్వాత సంస్థ నుంచి వస్తున్న ‘నోకియా 6’ మొబైల్‌ అమ్మకాలు ఈ నెల 19 నుంచి చైనాలో ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనిని పొందేందుకు ఇప్పటికే పది లక్షలమంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జేడీ.కామ్‌లో ఫ్లాష్‌సేల్‌ కింద వీటిని అమ్మకానికి ఉంచనున్నారు. ఆ రోజు ఎన్ని ఫోన్లను అమ్మకానికి ఉంచుతున్నదీ కంపెనీ తెలపలేదు. కాగా, ఈ ఫోన్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన 24 గంటల్లోనే 2.5లక్షలమంది రిజిస్టర్‌ చేసుకోవడం గమనార్హం. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న దీని ధర రూ.17,000 ఉంటుందని అంచనా. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశముంది. మరోవైపు ఫిబ్రవరిలో నోకియా బ్రాండ్‌పై మరిన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చేందుకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ సన్నాహాలు చేస్తోంది.

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.