అమెరికాకు ట్రంప్‌ ఫీవర్‌..!
close

తాజావార్తలు

అమెరికాకు ట్రంప్‌ ఫీవర్‌..!
ముంబయి: అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో (ఈ నెల 20) అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ థీమ్‌తో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ రెండు బైబిల్స్‌ మీద ప్రమాణం చేయనున్నారు. ఒకటి మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ తొలిసారి అధ్యక్షుడైనపుడు ఉపయోగించిన బైబిల్‌ కాగా, మరొకటి గ్రాడ్యుయేషన్‌ సమయంలో ట్రంప్‌కు తల్లి బహూకరించిన బైబిల్‌. దీంతో అమెరికా అంతట ట్రంప్‌ ఫీవర్‌ పట్టుకుంది. ఈ కార్యక్రమానికి భారతీయ-అమెరికన్లు, హాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పలువురు హాజరుకానున్నారు.

రేపటి నుంచి అన్ని ప్రాంతాల్లో ట్రంప్‌ ప్రమాణ స్వీకార వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. ఆ ఏర్పాట్లను అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పర్యవేక్షిస్తున్నారు. ఇదొక చరిత్రాత్మకమైన కార్యక్రమంగా నిలవనున్నట్లు శ్వేతసౌధ కార్యదర్శి సీన్‌ స్పైసర్‌ అభివర్ణించారు. వాషింగ్టన్‌ డీసీలో ఇప్పటికే సంబరాలు ప్రారంభమయ్యాయి. చారిత్రక నేషనల్‌ మాల్‌ ఈ సంబరాలకు వేదిక కానుంది. లింకన్‌ మెమోరియల్‌ వద్ద దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ఈ వేడుకలను ప్రజలంతా చూసేవిధంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.


జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని

రాజకీయం

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

జనరల్‌

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.