కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రంలో కదలిక!
close

తాజావార్తలు

కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రంలో కదలిక!

దిల్లీ: విభజన చట్టం ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశంపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టు కనబడుతోంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌తో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ గురువారం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత త్వరగా వివరాలు సేకరించాలని మెకాన్‌ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ బృందంతో సమీక్షించిన కేంద్ర ఉక్కుమంత్రిత్వ శాఖ.. ఈ మేరకు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వివరాల కోసం వేచిచూడకుండా మిగిలిన అంశాలతో నివేదిక సమర్పించాలని మెకాన్‌కు కేంద్ర ఉక్కుమంత్రి బీరేంద్రసింగ్‌ నిర్దేశించారు. ముడి ఇనుము లభ్యత, గనుల లీజు, తదితర కీలక అంశాలకు సంబంధించిన వివరాలు త్వరగా రప్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు, ఉమ్మడి భాగస్వామ్యంతో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేసే అవకాశంపైనా చర్చించినటట్టు తెలుస్తోంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.


స్పోర్ట్స్

మరిన్ని

రాజకీయం

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

జనరల్‌

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.