రాశిఫలం

గ్రహబలం (జ‌న‌వ‌రి 8-14)
డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

మేషం
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
సౌభాగ్య యోగం ఉంది. ప్రశాంతంగా లక్ష్యాల్ని పూర్తిచేస్తారు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో ఆటంకాలు తగ్గుతాయి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. సుఖసంతోషాలు నెలకొంటాయి. విందూ వినోదాలున్నాయి. అపోహలు తొలగుతాయి. ఆరోగ్యంపై ఒత్తిడి రాకుండా జాగ్రత్తపడండి. లక్ష్మీదేవి దర్శనం సంపదనిస్తుంది.


వృషభం
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

పట్టుదలతో పనుల్ని పూర్తిచేయాలి. ఓర్పుతో వ్యవహరిస్తే తక్షణ విజయం లభిస్తుంది. మాట పట్టింపులకు పోరాదు. ఆధ్యాత్మికంగా శుభకాలం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిళ్ళు అధికం అవుతాయి. ఆశించిన ఫలితం చేజారే ఆస్కారం ఉంది. మీ పట్ల మీరు శ్రద్ధ వహించండి. మిత్రుల సూచనలు ఉపకరిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి.


మిథునం
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)  

మానసిక ప్రశాంతత లభిస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. అంతిమ ఫలితం గొప్పగా ఉంటుంది. పదవీ లాభం ఉంది. ఆర్థికంగా శుభకాలం. తలపెట్టిన కార్యాలు సఫలీకృతం అవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. వారం చివర్లో శుభవార్త వింటారు. ముందుచూపుతో మాట్లాడండి. ఆంజనేయస్వామి దర్శనం మేలు చేస్తుంది.


కర్కాటకం
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
సకాలంలో పనుల్ని పూర్తిచేస్తారు. విఘ్నాలను అధిగమిస్తారు. ధనలాభం ఉంది. వ్యయమూ పెరుగుతుంది. కొన్ని విషయాల్లో ప్రతిష్టంభన నెలకొంటుంది. అడుగడుగునా అడ్డుతగిలేవారున్నారు. ఆవేశపూరిత సమాధానాలు వద్దు. ‘తన శాంతమే తనకు రక్ష’ అన్న సూక్తిని పాటిస్తే సరిపోతుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. శివధ్యానం మంచిది.


సింహం
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
విజయం వరిస్తుంది. అలసత్వం లేకుండా పనిచేయండి. ఎటుచూసినా వ్యతిరేకతలున్నాయి. ఇది మీకు పరీక్షాకాలం. విఘ్నాలు అధికం అవుతాయి. దీంతో మరికొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. సంక్లిష్ట సమయంలో మౌనంగా ముందుకు సాగండి. లక్ష్యంపై పట్టు బిగించండి. ఆత్మవిశ్వాసం అండగా నిలుస్తుంది. విష్ణుమూర్తి దర్శనం చేసుకోండి.


కన్య
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు)
ఏ పని మొదలుపెట్టినా ఉత్తమ ఫలితం ఉంటుంది. మీకంటూ ప్రత్యేకత సాధిస్తారు. వివిధ సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. మీ కాలాన్ని వృథా చేసేవారున్నారు. అనవసర ప్రసంగాలతో కాలక్షేపం చేయకండి. శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. రుద్రాభిషేకం శ్రేయస్సునిస్తుంది.


తుల
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)
తిరుగులేని ఫలితం సొంతం అవుతుంది. ప్రశంసలు అందుకుంటారు. త్యాగగుణం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలుపుతుంది. ఉద్యోగంలో శుభఫలితం ఉంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికస్థితి బావుంటుంది. కలహ సూచన లేకపోలేదు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు. శివారాధన మంచిది.


వృశ్చికం
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)
అదృష్టకాలం. విజయం సాధిస్తారు. ఎంత కష్టపడితే అంత ఫలితం. ఆర్థిక విషయాలమీద దృష్టి సారించండి. రుణ సమస్యలు తగ్గే సూచన ఉంది. నిర్ణయాలు శీఘ్ర ఫలితాలనిస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా మారతాయి. విందూ వినోదాలతో సమయం గడిచిపోతుంది. ఆరోగ్యం బావుంటుంది. దుర్గామాతను స్మరించండి.ధనుస్సు
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
పనిలో చిత్తశుద్ధి అవసరం. ప్రశంసలు అందుకుంటారు. వినయగుణంతో మీదైన లక్ష్యాన్ని సాధిస్తారు. ధనయోగం ఉంది. తలుపుతట్టే అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవాలి. అలసత్వం వద్దు. శ్రమ మరింత పెరగాలి. కాలం సంతృప్తికరంగా సాగుతుంది. సంఘర్షణ వాతావరణానికి దూరంగా ఉండండి. వేంకటేశ్వరస్వామిని ధ్యానించండి.


మకరం
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)
దైవబలంతో ఒక లక్ష్యాన్ని పూర్తిచేస్తారు. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వస్తువుల్ని సేకరిస్తారు. సుఖసంతోషాలతో కాలం గడుస్తుంది. ఆలోచనలు మీలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయి. దైవచింతనకు సమయాన్ని కేటాయించండి. ఇష్టదేవతా స్మరణ శుభదాయకం.


 

కుంభం
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
లక్ష్యం చేరువలో ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా శుభకాలం. అనేక విధాలుగా కలిసి వస్తుంది. గృహప్రాప్తి ఉంది. కొత్త బాధ్యతలు వస్తాయి. జీవితాశయాలు నెరవేరతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. అపార్థాలకు తావివ్వకండి. ప్రయాణలాభం సూచితం. అనవసర వ్యయాలు తగ్గించుకోండి. అష్టలక్ష్మీ ధ్యానం అదృష్టాన్నిస్తుంది.


మీనం
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
విజయాన్ని పొందుతారు. లోపాలను సవరించుకుంటూ మంచి భవిష్యత్తును సాధిస్తారు. మనసు మాట వినండి. మొహమాటం తగ్గించుకుంటే ఆర్థికంగా లాభపడతారు. ఆధ్యాత్మికంగా ఉత్తమకాలం. దైవబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. మితభాషణ మంచిది. ఆందోళన కలిగించే సంఘటనలున్నా, సురక్షితంగా ఒడ్డునపడతారు. సుబ్రహ్మణ్య ధ్యానం శుభాన్నిస్తుంది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.