Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: ర‌ంగుల‌రాట్నం

సినిమా: ర‌ంగుల‌రాట్నం

న‌టీన‌టులు: రాజ్‌తరుణ్‌, చిత్ర శుక్లా, సితార, ప్రియదర్శి త‌దిత‌రులు

సంగీతం: శ్రీచరణ్‌ పాకాల

సినిమాటోగ్రఫీ: ఎల్‌.కె.విజయ్‌

ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌

క‌ళ‌: పురుషోత్తం ఎం.

నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌

దర్శకత్వం: శ్రీరంజని

విడుదల తేదీ: 14-01-2018

నూహ్యంగా సంక్రాంతి బ‌రిలోకి దిగిన నాలుగో చిత్రం `రంగుల‌రాట్నం`. రాజ్‌త‌రుణ్ ప‌రిచ‌య‌మైన `ఉయ్యాలా జంపాలా` త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌నతో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన చిత్రమిది. ప‌రిమిత వ్యయంతో కూడిన చిత్ర‌మే అయినప్పటికీ కీల‌క‌మైన సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా విడుద‌ల కావ‌డం... వినూత్నమైన క‌థ‌ల్ని ప్రోత్సహించే అన్నపూర్ణ సంస్థలో తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. శ్రీరంజ‌ని దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం సంక్రాంతి బొబ్బట్టులా ఉంటుంద‌ని నిర్మాత నాగార్జున చెప్పడంతో పాటుగా... ప్రచార చిత్రాలు కూడా ఆక‌ట్టుకొనేలా ఉండ‌టంతో `రంగుల‌రాట్నం` సినీ ప్రేమికుల దృష్టిని ఆక‌ర్షించింది. మ‌రి చిత్రం ఎలా ఉందో తెలుసుకొందాం పదండి...

కథేంటంటే..: ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ విష్ణు(రాజ్‌ తరుణ్‌) తన తల్లి (సితార) తో కలిసి జీవిస్తుంటాడు. కొడుకే తన లోకంగా భావించే సితార ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటుంది. కీర్తి(చిత్ర శుక్లా) అనే అమ్మాయిని చూసి రాజ్‌తరుణ్‌ ప్రేమలో పడతాడు. తన తల్లికి కూడా పరిచయం చేస్తాడు. అనుకోకుండా సితార చనిపోతుంది. దాంతో విష్ణు గురించి అన్నీ తెలిసిన కీర్తి అతనితో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంటుంది. అయితే అతి జాగ్రత్తగా వ్యవహరించే అలవాటున్న కీర్తి.. విష్ణుని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఆ అతి జాగ్రత్త విష్ణుని ఏ రకంగా బాధపెట్టింది? అసలు ఆమెకి ఆ జాగ్రత్త అలవాటు ఎలా వచ్చింది? వాళ్లిద్దరి పెళ్లి జరిగిందా? లేదా? తదితర విషయాలు తెరపై చూడాలి.

ఎలా ఉందంటే..?

ఏ విషయాన్నైనా లైట్‌గా తీసుకునే ఓ అబ్బాయి ప్రతి విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించే ఓ అమ్మాయి మధ్య సాగే ప్రేమకథే ఈ చిత్రం. భిన్నమైన నడవడికలు ఉన్న వారిద్దరూ ఎలా ఒక్కటయ్యారనే ఇతివృత్తంతో చిత్రాన్ని తీర్చి దిద్దారు. తొలి సగభాగం తల్లీ కొడుకు బంధం నేపథ్యంలో సెంటిమెంట్‌ ప్రధానంగా సాగుతుంది. అయితే సన్నివేశాల్లో వేగం లేకపోవడంతో సినిమా ఓ సీరియల్‌ను తలపిస్తుంది. ప్ర‌థ‌మార్ధంలో కథ కూడా ఏమీ లేదు. తల్లీకొడుకు, ఓ అమ్మాయి, ఓ స్నేహితుడు.. ఈ నాలుగు పాత్రల చుట్టూనే సన్నివేశాలను తీర్చిదిద్దారు. విరామం సమయానికి కథానాయకుడి తల్లి మరణించడంతో కథ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. దాంతో ద్వితీయార్ధంలోనైనా కథ, పాత్రల మధ్య సంఘర్షణ ఉంటుందేమో అని ఆశించిన ప్రేక్షకుడికి అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది. కథ, కథనాలపై ఏమాత్రం కసరత్తు చేయకపోవడంతో సన్నివేశాలన్నీ ఫ్లాట్‌గా ఉండడంతో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తున్నట్లుగా సాగిపోతుంటాయి. తరుణ్‌, ప్రియదర్శి మధ్య సన్నివేశాలు కాస్తలో కాస్త ఉపశమనం. అక్కడక్కడా ఇద్దరూ కలిసి నవ్వించారు. పతాక సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే..?

ప్రతి సినిమాలో తన సహజమైన నటనతో అలరించే రాజ్‌తరుణ్‌ ఇందులో కొనితెచ్చుకున్న భావోద్వేగాలతో కనిపిస్తారు. దాంతో పలు సన్నివేశాలు కృతకంగా అనిపిస్తాయి. ప్రియదర్శితో కలిసి వినోదం మాత్రం బాగా పండించారు. చిత్రశుక్లా అందం పరంగా పర్వాలేదనిపిస్తుంది. కానీ కథానాయకుడి పక్కన కాస్త ముదురుగా కనిపించింది. తల్లి పాత్రలో సితార ఆకట్టుకుంది. ప్రియదర్శి పాత్ర సినిమాకు కీలకం. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఛాయాగ్రహణం, సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు అన్నపూర్ణ స్టూడియోస్‌ స్థాయిలో లేవు. రచన, సన్నివేశాలు తీయడంలో దర్శకురాలు శ్రీరంజని అనుభవరాహిత్యం అడుగడుగునా కనిపిస్తుంది.

బలాలు

+రాజ్‌తరుణ్‌, ప్రియదర్శిలు పండించిన‌ హాస్యం

బలహీనతలు

-కథ, కథనం

-సాగదీతగా అనిపించే సన్నివేశాలు

-భావోద్వేగాలు పండకపోవడం

చివరిగా: ‘రంగులు లేని రాట్నం’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది అతడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.