Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: పరమాణు:ది స్టోరీ ఆఫ్‌ పోఖ్రాన్‌

సినిమా పేరు: పరమాణు: ది స్టోరీ ఆఫ్‌ పోఖ్రాన్‌
నటీనటులు: జాన్‌ అబ్రహం, డయానా పెంటీ, బొమన్‌ ఇరానీ తదితరులు
కథ: సంయుక్త చావ్లా షేక్‌, అభిషేక్‌ శర్మ
సంగీతం: సచిన్‌-జిగర్, జీత్‌ గంగూలీ
సినీమాటోగ్రఫీ: అసీమ్‌ మిశ్రా
కూర్పు: రామేశ్వర్‌ ఎస్‌.భగత్‌
నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్‌, జేఏ ఎంటర్‌టైన్‌మెంట్‌
దర్శకత్వం: అభిషేక్ శర్మ
విడుదల తేదీ: 25-05-2018
ఈ మధ్యకాలంలో కమర్షియల్ చిత్రాలకంటే వాస్తవిక సంఘటనలతో తెరకెక్కించిన చిత్రాలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. అందుకు బాలీవుడ్‌ దర్శకురాలు మేఘనా గుల్జార్‌ తెరకెక్కించిన ‘రాజీ’ చిత్రమే నిదర్శనం. ఇందులో ఆలియా భట్‌ తప్ప మిగిలినవారంతా సాధారణ నటీనటులే. అయినప్పటికీ సినిమా మంచి వసూళ్లతో విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కోవలో ‘పరమాణు’ చిత్రం వచ్చింది. బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం ఈ చిత్రంలో నటించారు. 20 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం పోఖ్రాన్‌లో చేపట్టిన అణుపరీక్షల నేపథ్యంలో ఈ చిత్రాన్ని అభిషేక్‌ శర్మ రూపొందించారు. ఇలాంటి వాస్తవిక కథతో తెరకెక్కించిన చిత్రంలో జాన్‌ నటించడం ఇదే తొలిసారి. మరి ఈ కొత్త ప్రయత్నంతో జాన్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నారా? అసలు ఏంటీ పోఖ్రాన్‌ ఘటన? చూద్దాం.
కథేంటంటే: 1998లో భారత సైన్యం పోఖ్రాన్‌లో రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరీక్షల ద్వారా అణుశక్తి విషయంలో అగ్రదేశాల సరసన సగర్వంగా నిలిచి భారత్‌ సత్తా చాటింది. ఈ చారిత్రక సంఘటన వెనుక అసలేం జరిగింది? భారత ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలు రచించింది? దీన్ని అమలుపరచడంలో సైన్యానికి చెందిన ఆరుగురు కీలక వ్యక్తులు పోషించిన పాత్ర ఎలాంటిది? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: అణు పరీక్షలకు సంబంధించిన చిత్రం కావడంతో దీని నేపథ్యం తెలిస్తే కానీ సినిమా ప్రేక్షకుడికి అర్థంకాకపోవచ్చు. కీలక సన్నివేశాలను పోఖ్రాన్‌లోనే చిత్రీకరించడం గమనార్హం. సినిమాలో అణు పరీక్షలు నిర్వహించిన తీరును టెక్నాలజీని వాడి చూపించారు. దాంతో కొన్ని సన్నివేశాలు అంత సహజంగా అనిపించవు. అసలే కథేంటో చెప్పడానికి ప్రథమార్థంలో దర్శకుడు చాలా సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి వాస్తవిక సంఘటనల నేపథ్యం ఉన్న సినిమా నుంచి ప్రేక్షకుడు మరిన్ని వివరాలను ఆశిస్తాడు. కానీ అవేవీ ఎక్కువగా చూపించకపోవడంతో నిరాశచెందుతారు. అసలైన కథను సరిగ్గా చెప్పకుండా నాటకీయంగా రూపొందించి సస్పెన్స్‌, థ్రిల్లర్‌, కామెడీ ఎలిమెంట్స్‌ను జోడించారు.
ఎవరెలా చేశారంటే: ఇందులో ఆర్మీ కెప్టెన్‌గా వ్యవహరించిన జాన్‌ అబ్రహంది కీలక పాత్ర. కథానాయిక డయానా పెంటీ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఆరుగురు ఆర్మీ అధికారుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వారి పాత్రలు ఆకట్టుకుంటాయి.
బలాలు:
+ జాన్‌ అబ్రహం, డయానా పెంటీ నటన
బలహీనతలు:
- పోఖ్రాన్‌ పేలుళ్ల గురించి పూర్తిగా వివరించకపోవడం
-వాస్తవిక ఘటనలను నాటకీయంగా చూపడం
చివరగా: ఆకట్టుకునే ‘పరమాణు’
గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.