Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: హ్యాపీ ఫిర్‌ భాగ్‌ జాయేగీ

సినిమా పేరు: హ్యాపీ ఫిర్‌ భాగ్‌ జాయేగీ (హిందీ)

నటీనటులు: సోనాక్షి సిన్హా, డయానా పెంటీ, జిమ్మీ షేర్గిల్‌, అలీ ఫజల్‌, అపరశక్తి ఖురానా తదితరులు

సంగీతం: సొహైల్‌ సేన్‌

సినిమాటోగ్రఫీ: సునీల్‌ పాటిల్‌

కూర్పు: నినద్‌ ఖనోల్కర్‌

నిర్మాణ సంస్థ: కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌, ఎరాస్‌ ఇంటర్నేషనల్‌

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ముదస్సర్‌ అజీజ్‌

విడుదల తేదీ: 24-08-2018

సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ ఫిర్‌ భాగ్‌ జాయేగీ’. రెండేళ్ల క్రితం వచ్చిన ‘హ్యాపీ భాగ్‌ జాయేగీ’కి సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన ముదస్సర్‌ అజీజ్‌ సీక్వెల్‌నూ తెరకెక్కించారు. తొలి చిత్రంలో హ్యాపీ పాత్రలో నటించిన డయానా పెంటీ, జిమ్మీ షేర్గిల్‌, అలీ ఫజల్‌ రెండో చిత్రంలోనూ కనిపించారు. అయితే తొలి చిత్రంలో నటించిన అభయ్‌ డియోల్‌ బదులు సీక్వెల్‌లో సోనాక్షి సిన్హా నటించి కొత్త ఆకర్షణ తీసుకొచ్చింది. పంజాబీ గాయకుడు, నటుడు జెస్సీ గిల్‌ ఈ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. హ్యాపీ అనే అమ్మాయి చుట్టూ తిరిగే ఈ వినోదాత్మక ప్రేమకథా చిత్రం ఈరోజు విడుదలైంది. తొలి చిత్రంలాగే ఇదీ మంచి విజయం అందుకుంటుందా? అసలు హ్యాపీ ఎందుకు పారిపోవాలనుకుంది? తెలుసుకుందాం

కథేంటంటే: హ్యాపీ అలియాస్‌ హర్‌ప్రీత్‌ కౌర్‌(సోనాక్షి) తనను వదిలి వెళ్లిపోయిన పెళ్లికొడుకు(అపరశక్తి ఖురానా)ను వెతుక్కుకుంటూ చైనాకు వెళ్తుంది. అక్కడ కొందరు దుండగులు హర్‌ప్రీత్‌ని చూసి హ్యాపీ (డయానా పెంటీ. ఇందులో ఆమె పేరు కూడా అదే) అనుకుని కిడ్నాప్‌ చేస్తారు. ఇద్దరు పేర్లు ఒకేలా ఉండడంతో వారు కన్‌ఫ్యూజ్‌ అవుతారు. దాంతో సోనాక్షి ఎలాగైనా తన ఇంటికి వెళ్లిపోవాలని చైనాలోని భారత దౌత్యాధికారి అయిన కుశ్వంత్‌ సింగ్‌(జస్సీ గిల్‌) సాయం కోరుతుంది. మరి ఇద్దరు హ్యాపీలు ఒకరిని ఒకరు కలుసుకున్నారా? సోనాక్షి దుండగుల నుంచి తప్పించుకోగలిగిందా? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఇందులో సోనాక్షి సిన్హా, జస్సీ గిల్‌ ప్రధాన పాత్రల్లో ఆకట్టుకున్నారు. సోనాక్షి సినిమా మొదలైనప్పటి నుంచి కన్‌ఫ్యూజ్డ్‌ అమ్మాయిగా కన్పిస్తుంది. సినిమాలో ఎన్ని కొత్త పాత్రలు పుట్టుకువచ్చినా మొత్తానికి తిరిగి కథ సోనాక్షి వద్దే ఆగుతుంది. హ్యాపీ పేరు ఇద్దరు యువతులకు ఉండడంతో అటు పోలీసులు, ఇటు కిడ్నాపర్లు కన్‌ఫ్యూజ్‌ అయ్యి చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. కాకపోతే పాస్‌పోర్ట్‌ సన్నివేశాల్లో లాజిక్‌ లేనట్లు అనిపిస్తుంది. పాస్‌పోర్ట్‌లో సోనాక్షి ఫొటో ఉన్నప్పటికీ ఆమెను డయానా పెంటీ అనుకుని కిడ్నాప్‌ చేయడంలో అర్థం ఉండదు. మరోపక్క కథకు అణుగుణంగా వచ్చే పాటలు కూడా అంతగా రుచించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్‌ సునీల్‌ పాటిల్‌ టేకింగ్‌ బాగుంది.

ఎవరెలా చేశారంటే: ఇందులో సోనాక్షి సిన్హా తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసినప్పుడు కంగారుపడకుండా అసలు ఏమీ అర్థంకానట్లు చక్కగా హావభావాలు పలికించింది. ఈ సినిమాతో తను కామెడీ పాత్రల్లోనూ చక్కగా నటించగలదని రుజువుచేసింది. పెళ్లికొడుకుగా అపరశక్తి ఖురానా నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇందులో చైనీస్‌ వ్యక్తులు కూడా హిందీ సంభాషణలు చక్కగా పలికారు. మిగతా వారంతా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.

బాలాలు:

+ సోనాక్షి సిన్హా

+ కామెడీ

బలహీనతలు:

- లాజిక్‌ లేని సన్నివేశాలు

చివరగా: ‘హ్యాపీ’గా ఒకసారి సినిమా చూడొచ్చు

గమనిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.