Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: పల్టాన్‌

సినిమా పేరు: పల్టాన్‌(హిందీ)

నటీనటులు: జాకీ ష్రాఫ్‌, సోనూ సూద్‌, అర్జున్‌ రాంపాల్‌, గుర్మీత్‌ చౌదరి, హర్షవర్ధన్‌ రానే, సిద్ధాంత్ కపూర్‌, లవ్‌ సిన్హా, ఈషా గుప్తా, సోనల్‌ చౌహన్‌ తదితరులు

సంగీతం: అను మాలిక్‌

కూర్పు: బల్లు సలూజా

సినిమాటోగ్రఫీ: శైలేష్‌ అవస్తి, నిగమ్‌ బోమ్జాన్‌

నిర్మాణ సంస్థ: జేపీ ఫిలింస్‌

కథ, స్క్రీప్‌ప్లే, దర్శకత్వం: జేపీ దత్తా

విడుదల తేదీ: 07-09-2018

దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధాల నేపథ్యంలో చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు జె.పి.దత్తా. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘బోర్డర్‌’ ఘన విజయం సాధించడంతో పాటు జాతీయ పురస్కారం కూడా అందుకుంది. ఆయన నుంచి వచ్చిన ‘రెఫ్యూజీ’, ‘ఎల్‌ఓసీ కార్గిల్’‌ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తరహాలోనే తాజాగా మరో యుద్ధ నేపథ్య చిత్రంగా ‘పల్టాన్‌’ను తెరకెక్కించారు దత్తా.

కథేంటంటే: ఇండియా, చైనా యుద్ధం జరిగిన కొన్నేళ్ల తర్వాత 1967లో సిక్కిం సరిహద్దులో మళ్లీ ఆ రెండు దేశాల బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చైనా బలగాలను ఎదుర్కోవడానికి భారత ఆర్మీ రాజ్‌పుత్ బెటాలియన్‌ ఎలాంటి పథకాలు రచించింది? తదితర విషయాలు తెరపై చూడాలి.

ఎలా ఉందంటే: ఈ సినిమా చిత్రీకరణకు భారత సైన్యం సహకారం అందించింది. తెరపై సైనిక బలగాలు భారీ సంఖ్యలో కనిపించడానికి నిజమైన సైనికులు ఇందులో నటించడం గమనార్హం. ఆర్మీ అధికారులుగా నటించిన ప్రధాన పాత్రధారులకు నిజమైన సైన్యాధికారులు శిక్షణ ఇచ్చారు. భారత, చైనా సరిహద్దులోని సున్నితమైన ప్రాంతాల్లో చిత్రీకరణ చేయడానికి కూడా అనుమతి ఇచ్చారు. యుద్ధ సన్నివేశాల కోసం నిజమైన గన్నులు, బుల్లెట్లు ఉపయోగించారు. సినిమాలో సైనికులు పలికే సంభాషణలు ఆకట్టుకుంటాయి. ‘1962లో యుద్ధం వారు మొదలుపెట్టారు. 1967లో మేం ముగిస్తాం’, ‘సైనికుడు నిజంగా మరణించేది కాల్చినప్పుడు కాదు, అతని త్యాగాన్ని మర్చిపోయినప్పుడు’ వంటి సంభాషణలు హైలెట్‌గా నిలిచాయి. అయితే కథను చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు స్వాతంత్ర్య దినోత్సవం నాడో లేదా గణతంత్ర దినోత్సవం నాడో విడుదల చేసుంటే ప్రేక్షకులను ఆకట్టుకునేవి.

ఎవరెలా చేశారంటే: ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్‌, అర్జున్‌ రాంపాల్‌, సోనూ సూద్‌ల పాత్రలే కీలకం. మేజర్‌ జనరల్‌ సగత్‌ సింగ్‌ పాత్రలో జాకీ, మేజర్‌ బిషెన్‌ సింగ్‌ పాత్రలో సోనూ సూద్‌, లెఫ్టి‌నెంట్‌ కల్నల్‌ రాయ్‌ సింగ్‌ యాదవ్‌ పాత్రలో అర్జున్‌ రాంపాల్‌ తమ నటనలతో అదరగొట్టేశారు. ముగ్గురూ అనుభవమున్న నటులే. ఆర్మీ అధికారుల పాత్రల్లో ఒదిగిపోయారు. ఒక సినిమాలో నటిస్తున్నట్లుగా కాకుండా నిజంగా దేశం కోసం పోరాడుతున్న వీరుల్లా చక్కగా నటించారు. మిగతా వారంతా తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు.

బలాలు:

+ అర్జున్‌ రాంపాల్‌, సోనూ సూద్‌, జాకీ ష్రాఫ్‌ నటన

+ కథనం

బలహీనతలు:

- కథనం

చివరగా: ‘పల్టాన్‌’..ఓ మంచి యాక్షన్‌ చిత్రం

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.