close

బ్రహ్మోస్‌కు పోటీగా సూపర్‌సోనిక్‌ క్షిపణి
బీజింగ్‌: భారత్‌-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ క్షిపణికి పోటీగా చైనాలో ఓ ప్రైవేటు సంస్థ సూపర్‌సోనిక్‌ క్షిపణిని అభివృద్ధి చేసింది. ఉత్తర చైనాలో గత సోమవారం దాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ విధ్వంసక క్షిపణిని పాకిస్థాన్‌కు విక్రయించే అవకాశాలున్నాయి. గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులోని గ్వాంగ్‌ఝౌలో ‘హోంగ్డా బ్లాస్టింగ్‌ కంపెనీ’ 1988లో ప్రారంభమైంది. ఇది ప్రధానంగా గనుల తవ్వకపు సంస్థ. పేలుడు, మిలటరీ పరికరాలను తయారుచేస్తుంటుంది. తాజాగా ఈ సంస్థ ‘హెచ్‌డీ-1’ సూపర్‌సోనిక్‌ క్షిపణిని అభివృద్ధి చేసింది.

ప్రధానాంశాలు

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.