kalanjali_200
Comments
0
Recommend
0
Views
552
విజయా బ్యాంక్‌ లాభంలో 41% వృద్ధి
దిల్లీ: నికర వడ్డీ ఆదాయం పెరగడంతో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో విజయా బ్యాంక్‌ రూ.52.61 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన రూ.37.40 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 41 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.3,302.67 కోట్ల నుంచి 3,237.02 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.554.8 కోట్ల నుంచి 33% పెరిగి.. రూ.737.7 కోట్లుగా నమోదైంది. ఇక స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2.92% నుంచి 4.32 శాతానికి పెరిగాయి. నికర నిరర్ధక ఆస్తులు సైతం 1.89% నుంచి 2.98 శాతానికి వృద్ధి చెందాయి.
* * *
* కోల్‌ ఇండియాకు చెందిన మహానది కోల్‌ ఫీల్డ్స్‌ 2015-16కు గాను రూ.1000 ముఖ విలువగల ఒక్కో షేరుకు రూ.2,758.45 కోట్ల మధ్యంతర డివిడెండును ప్రకటించింది. అలాగే మరో అనుబంధ సంస్థ సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ కూడా డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ.1,457 కోట్ల మధ్యంతర డివిడెండును ఇవ్వనున్నట్లు తెలిపింది.

* తన అనుబంధ సంస్థ మెటాహెలిక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌లో 19% వాటాను రూ.73.33 కోట్లకు ర్యాలీస్‌ ఇండియా కొనుగోలు చేసింది.

Your Rating:
-
Overall Rating:
0

అభివృద్ధికి గులామ్‌ తెరాసకు ‘మహా’ సలామ్‌

అభివృద్ధికి ఓటర్లు జైకొట్టారు. విశ్వనగరం దిశగా మహా నగరాన్ని ముందుకు నడిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. గ్రేటర్‌ కార్పొరేషన్‌ చరిత్రలో తొలిసారిగా వందకు...

కృష్ణమ్మ చేరితేనే జలాభిషేకం

మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఈసారి తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఏటా తిరునాళ్లకు అయిదు లక్షలమందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు.

ఉపాధికి.. జన్‌ధన్‌ వెన్నుదన్ను

తపాలా కార్యాలయాల ద్వారా బయోమెట్రిక్‌ విధానంతో ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపు సకాలంలో జరగడం లేదు. నగదు బదిలీతో కూలీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి కూలీ డబ్బులను జమచేస్తే....

భగీరథయత్నం !

గుడ్లవల్లేరు వద్ద ఆరు చమురు యంత్రాలతో నీటిని బంటుమిల్లి కాల్వకు తోడుతున్నారు. ఈ నీరు కమలాపురం లాకుల వద్దనుంచి బంటుమిల్లికి చేరే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.