kalanjali_200

తిరువణ్ణామలైలో తొక్కిసలాట

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరర్‌ ఆలయంలో సోమవారం జరిగిన తొక్కిసలాటలో నలుగురు మరణించారు. మరణించిన వారిలో ముగ్గురు అర్చకులు, మరోభక్తుడు ఉన్నారు....

రాష్ట్రపతితో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌... రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో దిల్లీలో సోమవారం భేటీ అయ్యారు. ఉభయ రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రణబ్‌కు ఆయన వివరించారు....

చిన్నారులను విదేశాలకు తరలించే ముఠా అరెస్టు

అభాగ్య బాలలకు నకిలీ తల్లిదండ్రులను సృష్టించి అమెరికాతో పాటు వేర్వేరు దేశాలకు అక్రమంగా తరలిస్తున్న 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నాయకుడు ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ (44)తో...

విమానం ఇంజన్‌ను మధ్యలోనే ఆపివేసిన పైలట్‌

దిల్లీ నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం(ఏఐ-115)లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఓ ఇంజన్‌ను పైలట్‌ మధ్యలోనే ఆపివేశారు. అనంతరం విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా...

బాబా నుంచి నగ స్వీకరించిన మహారాష్ట్ర సీఎం సతీమణి

గాల్లో నుంచి సృష్టించినట్లుగా కనిపిస్తున్న నగను ఓ బాబా నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత స్వీకరించడంపట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి....

మసూద్‌కు వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలు లేవు:పాక్‌

పఠాన్‌కోట్‌ ఉగ్రదాడికి జైష్‌-ఎ-మహమ్మద్‌ (జేఈఎం) అధినేత మౌలానా మసూద్‌ అజహార్‌ సూత్రధారిగా వ్యవహరించినట్లు ఎలాంటి స్పష్టమైన ఆధారాలూలేవని పాకిస్థాన్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు...

భారత్‌తో అమెరికా బలమైన బంధాన్ని కోరుకుంటోంది

భారత్‌తో అమెరికా బలమైన బంధాన్ని కోరుకుంటోందని అమెరికా యుద్ధనౌక యాంటీటమ్‌ కమాండింగ్‌ అధికారి మెకరిట్నీ పేర్కొన్నారు. సోమవారం విశాఖ తీరంలో నిలిపిన యుద్ధనౌకపై...

మున్ముందు చైనాతో చాలా ముప్పు!

చైనా నుంచి ముంచుకురాబోతున్న ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని రక్షణరంగ వ్యవహారాల విశ్లేషకుడు గుల్షన్‌ ఆర్‌ లూథ్రా పేర్కొన్నారు. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షలో...

చెన్నైలో బైక్‌ అంబులెన్స్‌లు!

ప్రమాదాల్లో ఉన్న వారికి తక్షణ వైద్యం అందించడానికివీలుగా తమిళనాడు ప్రభుత్వం 41 ద్విచక్ర వాహన అంబులెన్స్‌లను సోమవారం ప్రారంభించింది....

రైలు ప్రయాణికులకు ప్రత్యేక రుచుల్లో తేనీరు

రైల్లో ప్రయాణిస్తూ పొగలు కక్కుతున్న తేనీటిని సేవిస్తుంటే లభించే అనుభూతిని మరింత మధురంగా మార్చాలని రైల్వేశాఖ భావిస్తోంది. మొహం మొత్తేసే విధంగా ఉండే ఒకే రకమైన తేనీటి బదులు రకరకాల రుచులను...

ప్రసారభారతి బోర్డు సభ్యురాలిగా కాజోల్‌

ప్రసారభారతి బోర్డులో తాత్కాలిక సభ్యురాలిగా బాలీవుడ్‌నటి కాజోల్‌ ఎంపికయ్యారు. సోమవారంఉపరాష్ట్రపతి హమీద్‌అన్సారి అధ్యక్షతన సమావేశమైన త్రిసభ్య కమిటీ.. కాజోల్‌ పేరును ఖరారు చేసింది. ఆమెతో పాటు ఓ...

హైకోర్టుల న్యాయమూర్తులకు బదిలీలు

ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరేంద్ర హీరాలాల్‌ వాఘేలా... బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత కొన్ని నెలలుగా బాంబే హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు....

60 శాతం ‘ఉపాధి హామీ’ నిధులు వ్యవసాయ పనులకే

రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద చేసే...

ప్రముఖ రచయిత నిదా ఫజ్లి కన్నుమూత

ప్రముఖ రచయిత నిదా ఫజ్లి సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. 78 ఏళ్ల ఫజ్లి తన మధురమైన గీతాలతో చాలా కాలం అలరించారు. ఉదయం 11 గంటలకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో...

200 కి.మీ వేగాన్ని తట్టుకునే రైలుపెట్టెలు!

అత్యంత వేగాన్ని తట్టుకునే, అత్యాధునిక రైలుపెట్టెలను కపుర్తలా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ(ఆర్‌సీఎఫ్‌) సిద్ధం చేసింది. గంటకు 200 కి.మీ వేగంతో వెళ్లగల 4 రైలుపెట్టెలను(2 ఏసీ ఛైర్‌ కార్‌, 2 ఎక్జిక్యూటివ్‌ క్లాస్‌) ఈ నెలలోనే ప్రభుత్వం...

ప్రవాస భారతీయులు దేశంలో ఇల్లు కొనుక్కోవచ్చు

దేశానికి అప్పుడప్పుడు వచ్చే ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) ఇక్కడ ఇల్లు కొనుక్కోవచ్చని అత్యున్నత వినియోగదారుల కమిషన్‌ స్పష్టంచేసింది. దిల్లీకి చెందిన ఎన్‌ఆర్‌ఐలు రేష్మా భగత్‌, ఆమె కుమారుడు...

ఐఎస్‌ఐ అధికారుల ప్రమేయంపై ఆధారాలు సమర్పించనున్న భారత

ముంబయి దారుణ మారణహోమంలో పాక్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ అధికారుల ప్రమేయంపై భారత్‌ ఆ దేశానికి తాజాగా ఆధారాలను సమర్పించే అవకాశం ఉంది. ఐఎస్‌ఐ అధికారులు, లష్కరే తోయిబా అధిపతి హఫీజ్‌ సయీద్‌,...

పర్యాటకుల కోసం టోల్‌ఫ్రీ నంబరు ప్రారంభం

దేశంలో పర్యటించే వారి క్షేమం, భద్రత దృష్ట్యా 24 గంటలు పనిచేసే ఉచిత ఇన్ఫోలైన్‌ నంబరును సోమవారం నాడిక్కడ పర్యాటకశాఖ మంత్రి మహేష్‌శర్మ ప్రారంభించారు. ఈ సేవలను హిందీ, ఇంగ్లీషు సహా మొత్తం 12...

గాంధీ జీవిత విశేషాలపై తపాల కవర్ల విడుదల

మహాత్మా గాంధీ జీవితంలోని ప్రధాన ఘట్టాల జ్ఞాపకార్థంగా తపాలా శాఖ నాలుగు ప్రత్యేక కవర్లను సోమవారం విడుదల చేసింది. మహాత్మ గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ రావడానికి కారణమైన పరిస్థితులు, 1915లో భారత్‌ చేరుకోవడం...

రైతు ఆత్మహత్యలపై స్పందించాల్సింది ప్రభుత్వమే

రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)ను విచారణకు స్వీకరించడానికి సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది. ‘‘విధానపరమైన అంశాల్లోకి మేం వెళ్లకూడదు. వాటిపై పరిశీలన చేసి, నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే’’...

35 కోట్ల మందికి ఈఎస్‌ఐ సేవలు

రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 35 కోట్ల మందికి సామాజిక భద్రత అందించాలనే లక్ష్యంతో ఈఎస్‌ఐ సేవల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర...

నౌకాదళాల బంధం బలోపేతం కావాలి

ప్రపంచ దేశాల నౌకాదళాల మధ్య బంధాలు మరింత బలోపేతం కావాలని... అన్ని నౌకాదళాలు ఇతర నౌకాదళాలతో పరస్పరం సహకరించుకోవాలని భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.కె.ధోవన్‌ పేర్కొన్నారు....

విద్యకూ ఏకగవాక్ష విధానం అవసరం: విశ్వనాథన్‌

పరిశ్రమలు, ఇతర వాటికి ఏకగవాక్ష (సింగిల్‌ విండో) విధానం ద్వారా అనుమతులు ఇచ్చినట్లుగా విద్యాసంస్థలకు కూడాదాన్ని వర్తింపజేయాలని తమిళనాడులోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌టెక్నాలజీ(వీఐటీ)...

సీబీఐలో సిబ్బంది కొరత

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో దాదాపు మూడింట ఒకటో వంతు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బొగ్గు, చిట్‌ఫండ్‌ కుంభకోణాలు, బ్యాంకుల నిరర్ధ ఆస్తుల వంటి కీలక కేసులు దర్యాప్తు జరుగుతున్న సీబీఐలో...

సియాచిన్‌లో జవాను మృతదేహం లభ్యం

సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడంతో సజీవ సమాధి అయిన పది మంది సైనికుల్లో ఒకరి మృతదేహాన్ని సోమవారం సహాయ బృందాలు వెలికి తీశాయి. గల్లంతయిన వారికోసం సైనిక సహాయ బృందాలు ఆరురోజులుగా...

రామజన్మభూమి కేసులో ‘కురువృద్ధ వ్యాజ్యకర్త’ ఆసుపత్రిలో చేరిక

రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదం కేసుతో ఏళ్లుగా సంబంధమున్న మహమ్మద్‌ హషీం అన్సారీ గుండె పోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిమితంగానే ఉన్నప్పటికీ ఐసీయూ పర్యవేక్షణలో...

శబరిమలలో మహిళల ప్రవేశానికి మహేశ్‌ శర్మ మద్దతు

శబరిమల దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ పెదవివిప్పారు. లింగ భేదం, కులం ఆధారంగా వివక్ష చూపకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. గుడి లోపలకు మహిళలను అనుమతించేందుకు...

సుప్రీం కోర్టు తీర్పు తర్వాతే రామ మందిర నిర్మాణంపై నిర్ణయం

అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కల్‌రాజ్‌ మిశ్ర వెల్లడించారు. ‘సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకూ మేం ఎదురుచూడాలి....

గవర్నర్‌ ఇష్టానుసారం శాసనభ సమావేశాలు నిర్వహించలేరు

అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ జె.పి.రాజ్‌ఖోవా.. తన ఇష్టానుసారం రాష్ట్ర శాసనసభ సమావేశాల నిర్వహణకు ఆదేశించలేరని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని నబం టుకీ ప్రభుత్వం సంక్షోభాన్ని...

ర్యాగింగ్‌కు కళ్లెం వేసేందుకు సహకరించండి

విద్యాలయాల్లో ర్యాగింగ్‌కు కళ్లెం వేసేందుకు ప్రజలు సహకరించాలని విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) కోరింది. ర్యాగింగ్‌ నేరమని చెబుతూ తమ వెబ్‌సైట్‌లో దీనిపై యూజీసీ బహిరంగ ప్రకటన విడుదల చేసింది....

ఆప్‌ నేత అభ్యర్థనను తోసిపుచ్చిన దిల్లీ హైకోర్టు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం దావాలో నిర్దుష్టంగా తనపై అభియోగాలు లేనందున ప్రతివాదిగా తన పేరు తొలగించాలని ఆప్‌ అధికార ప్రతినిధి దీపక్‌ బాజ్‌పాయ్‌ చేసిన అభ్యర్థనను దిల్లీ హైకోర్టు సోమవారం...