22న కేంద్ర ఎన్నికల కమిషనర్ల బృందం రాక
24 వరకు హైదరాబాద్‌లోనే
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఈ నెల 22న కేంద్ర ఎన్నికల కమిషనర్ల బృందం హైదరాబాద్‌ రానుంది. రెండున్నర రోజుల పాటు ఆ బృందం రాజకీయపార్టీల ప్రతినిధుల నుంచి వివిధ స్థాయుల అధికారులతో వేరువేరుగా విస్తృత స్థాయి సమీక్షలు నిర్వహించనుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం సీనియర్‌ ఉప ఎన్నికల కమిషనర్‌ ఉమేష్‌ సిన్హా ఆధ్వర్యంలో అధికారుల బృందం హైదరాబాద్‌ వచ్చి సమీక్షించింది. ఆ బృందం నివేదిక ఆధారంగా డిసెంబర్‌ 7న ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయన్నది సమీక్షించేందుకు ఎన్నికల కమిషనర్ల బృందం ఈ నెల 22 నుంచి 24వరకు హైదరాబాద్‌లో సమీక్షించనుంది. 22న మధ్యాహ్నం 3.15కు ఆ బృందం హైదరాబాద్‌ చేరుకుంటుంది. సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. రాత్రి 7.30 నుంచి 8.30 వరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, పోలీసు నోడల్‌ అధికారులతో సమావేశం కానుంది. 23వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, డీఐజీ, ఐజీలతో సమీక్షించనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి ఆరు గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో సమావేశం అవుతుంది. 24న ఉదయం 10 నుంచి 11 వరకు ఆదాయపన్నుల శాఖ డీజీ, ఎన్‌ఫోర్స్‌మెంటు బృందాలతో సమావేశం కానుంది. 11.15 గంటల నుంచి 12 గంటల వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం అవుతుంది. సాయంత్రం 4 గంటల తరువాత ఆ బృందం దిల్లీ వెళ్లనుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.