జూ. కళాశాలలకు దసరా సెలవులు పొడిగింపు
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలలకు దసరా సెలవులను పొడిగించారు. ఈనెల 9వ తేదీ నుంచి 18 వరకు సెలవులని, 19న కళాశాలలు పునఃప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ తదితర కళాశాలలకు 21వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. పండుగ పూర్తయిన మరుసటి రోజూ ఇతర ప్రాంతాల నుంచి కళాశాలలకు విద్యార్థులు ఎలా హాజరవుతారన్న విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో 19, 20వ తేదీలు కూడా సెలవు దినాలేనని, 21న ఆదివారం అయినందున 22న కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.