kalanjali_200
Comments
0
Recommend
1
Views
428
హైకోర్టుల న్యాయమూర్తులకు బదిలీలు
దిల్లీ: ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరేంద్ర హీరాలాల్‌ వాఘేలా... బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత కొన్ని నెలలుగా బాంబే హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. జస్టిస్‌ వాఘేలా ఈ నెల 16న నూతన బాధ్యతలు చేపట్టాలని న్యాయ మంత్రిత్వశాఖ పేర్కొంది. రాజస్థాన్‌, మేఘాలయా, గువాహటి హైకోర్టులకు సీనియర్‌ న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులు కాబోతున్నారు. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.కె.ముఖర్జీ అక్కడే పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టేలా సిఫార్సు వెళ్లింది. పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు చెందిన జస్టిస్‌ సతీశ్‌కుమార్‌ మిత్తల్‌ త్వరలో రాజస్థాన్‌కు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లనున్నారు. రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అజిత్‌సింగ్‌ను గువాహటి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా, అలహాబాద్‌ హైకోర్టులోని లఖ్‌నవూ ధర్మాసనం సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిని మేఘాలయా ప్రధాన న్యాయమూర్తిగా నియమించనున్నారు. పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు చెందిన జస్టిస్‌ హేమంత్‌ గుప్తాను పట్నా హైకోర్టుకు బదిలీ చేశారు.
Your Rating:
-
Overall Rating:
4.0