kalanjali_200
Comments
0
Recommend
0
Views
856
భోజ్‌శాల వద్ద ప్రశాంతంగా పూజలు, నమాజు..
ధార్‌ (మధ్యప్రదేశ్‌): ఉత్కంఠ పరిస్థితుల నడుమ మధ్యప్రదేశ్‌ ధార్‌ పట్టణంలోని భోజ్‌శాలలో అటు హిందువులు, ఇటు ముస్లింలు శుక్రవారం నాడు పూజలు, నమాజ్‌ జరుపుకొన్నారు. 11వ శతాబ్దపు నాటి చారిత్రక నిర్మాణం భోజ్‌శాలను హిందువులు వాగ్దేవి (సరస్వతి) మందిరంగాను, ముస్లింలు కమాల్‌ మౌలా మసీదుగానూ భావిస్తారు. సాధారణంగా ఇక్కడ ముస్లింలు శుక్రవారాల్లో నమాజు చేసుకుంటారు. ఈసారి వసంత పంచమి శుక్రవారం నాడు రావడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఉదయం, సాయంత్రం వేళల్లో హిందువులు.. మధ్యాహ్నం 1 - 3 గంటల మధ్య ముస్లింలు పూజలు, నమాజ్‌ చేసుకోవాలని పేర్కొంది. దీన్ని కొందరు వ్యతిరేకించినా.. ప్రశాంతంగా పూజలు, నమాజు జరిగేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
Your Rating:
-
Overall Rating:
5.0