kalanjali_200
Comments
0
Recommend
0
Views
674
తమిళనాడులో ‘అమ్మ’ తాగునీరు పథకం
చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడు ప్రజలకు ‘అమ్మ’ పేరుతో ఉప్పు, సిమెంట్‌, ఔషధాలు, వాటర్‌ బాటిల్‌ తదితర నిత్యావసర, అత్యవసర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం చౌకధరకు అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమంత్రి జయలలిత తాజాగా నిరుపేదలకు ‘అమ్మ’ తాగునీటి పథకం అమలు చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ పథకం కింద పేదల కుటుంబాలకు ప్రతిరోజూ 20 లీటర్ల చొప్పున శుద్ధీ చేసిన తాగునీటిని ఉచితంగా సరఫరా చేయనున్నారు. ఈ పథకాన్ని తొలి విడతగా చెన్నైలో అమలు చేయనున్నారు. ఇందుకోసం 100 ప్రాంతాలను గుర్తించి అక్కడ నీటి శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని, లబ్ధిదారులు సులభంగా శుద్ధ తాగునీటిని పొందేందుకు అనువుగా స్మార్ట్‌కార్డులు అందించనున్నట్లు జయలలిత తెలిపారు.
Your Rating:
-
Overall Rating:
0