kalanjali_200
Comments
0
Recommend
0
Views
224
చిన్నారులను విదేశాలకు తరలించే ముఠా అరెస్టు
బెంగళూరు, న్యూస్‌టుడే: అభాగ్య బాలలకు నకిలీ తల్లిదండ్రులను సృష్టించి అమెరికాతో పాటు వేర్వేరు దేశాలకు అక్రమంగా తరలిస్తున్న 16 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నాయకుడు ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ (44)తో పాటు మైఖేల్‌ అలియాస్‌ రంజిత్‌ నరేన్‌, రాజేష్‌, సైమన్‌, కుశాలప్ప, గుణశేఖర్‌, ప్రవీణ్‌, డోమ్నిక్‌ అరుళ్‌ కుమార్‌, జాయ్సన్‌, మంజునాథ్‌, ఫ్రాన్సిస్‌ క్రిస్టోఫర్‌ అలియాస్‌ ఆనంద్‌ ఆంథోణి, సంగీత ప్రకాశ్‌, లతా వేమరెడ్డి, సుధీర్‌ కుమార్‌ కస్తూర్‌, భాను ప్రకాశ్‌, వీణా ప్రకాశ్‌లను నిందితులుగా గుర్తించారు. సోమవారం బెంగళూరులో అదనపు పోలీసు కమిషనర్‌ వివరాలను వెల్లడించారు.
Your Rating:
-
Overall Rating:
0